అమ్మాయైనా, అబ్బాయైనా fun కావాలి… "జీవితాంతం fun ఉంటే చాలు… ఇంకే అవసరం లేదు" అని పరితపించిపోతున్న సోషల్ ఛేంజ్ మన వాకిట్లో ఉంది.
నేను మొన్న ఓ లైన్ రాశాను.. "మెచ్యూర్డ్ కాని సొసైటీలో మెచ్యూరిటీ ఉంటేనే అంతా సవ్యంగా జరిగే mixed కల్చర్ని adopt చేసుకోవడంలో ఎన్ని సోషల్ స్ట్రగుల్సో.. " అని!
అమ్మాయిలూ, అబ్బాయిలూ కలిసి తిరగొచ్చు, గడపొచ్చు, డ్రింక్ చేయొచ్చు, బూతులు తిట్టుకోవచ్చు… it’s all part of fun అంతే!
కలిసి తిరిగేటప్పుడు చూపుల్లో తేడా వచ్చినా… "రిస్కేం లేనప్పుడు అంతా లైట్లే" అనే అడ్జెస్ట్మెంట్ నేచర్.
ఎంత ఆలోచించినా ఒక్క విషయం మాత్రం అర్థం కాదు.. ఏ ఎక్స్పెక్టేషన్లూ లేకుండా ఒకర్నొకరు గంటల తరబడి sms ఛాటింగులతోనూ, ఫోన్లతోనూ ఎంటర్టైన్ చేసుకునేటంత మెచ్యూరిటీ, pure attachment ఎంతమందిలో ఉంది అని?
గొప్ప గొప్ప ఫ్రెండ్షిప్లను నేను శంకించట్లేదు… ఫ్రెండ్షిప్ల పేరిట ఒకర్నొకరు ఇష్టపూర్వకంగానే మభ్యపుచ్చుకునే రిలేషనల్ అండర్స్టాండింగ్ల గురించి నా ఆలోచన అంతా.
"నువ్వు చాలా అందంగా ఉన్నావు" అని అబ్బాయిల చేత అన్పించుకోవడం అమ్మాయికి కావాలి… దానిదేముంది.. ఒక మాటేగా… అనేస్తారు 🙂 తర్వాత ఆకలిగా చూడడం మొదలెడతారు… "ఆ చూపులు మాత్రం తట్టుకోలేం.." అంటే ఆ చూపులకు ఆస్కారం ఇస్తోంది ఎవరు?
అబ్బాయిలూ అంతే… టార్గెట్ ఒకటుంటుంది.. దాన్ని సాధించడం కోసం ఏ పనైనా చేసి పారేస్తారు.. చివరకు వర్కవుట్ అయితే చాలు అన్న ఆశ.
ఇవ్వాళ సొసైటీలో మగా, ఆడా మధ్యా ఉన్న మెచ్యూరిటీని గమనించి ఉంటే సిగ్నండ్ ఫ్రాయిడ్ కూడా తన సైకాలజీ థీరీస్ని సరిచేసుకునే వాడేమో… "మగా, ఆడాకి మధ్య ఆకర్షణ ఉండదు" అని ప్రతిపాదించేవాడేమో.
మగా, ఆడా తేడాలు మర్చిపోయి చాలా చాలా హార్ట్ఫుల్గా గడిపే రిలేషన్లు చాలానే నాకు తెలుసు… అది అసాధ్యం అని నేను ఎప్పుడూ అనను.
కానీ అమ్మాయిల నవ్వులకు పడిపోయే అబ్బాయిలూ, అబ్బాయిలపై ఎక్స్పెక్టేషన్లతో పావులు కదిపే అమ్మాయిలూ… మధ్యలో touch me not తరహా బిహేవియర్లు… వీటితోనే చాలా రిలేషన్లు వికసిస్తాయీ, వాడిపోతూనూ ఉంటాయి. ఇంకా మెచ్యూరిటీ ఉన్న లాంగ్ స్టాండింగ్ రిలేషన్లు ఎక్కడ?
Open culture అడాప్ట్ చేసుకోవడానికి అందరూ ఉవ్విళూరుతూనే ఉన్నాం… ప్రపంచంలోని అందమంతా మనకోసమే పుట్టినట్లూ… ఎవర్నైనా కోరికతో చూడడం తప్పు కానట్లు.. నచ్చితే వస్తారు… లేదా no issues… అన్నట్లూ…!! ఈ విచ్చలవిడితనం అబ్బాయిల వరకే ఉన్నప్పుడు అమ్మాయిలు తమ ఇండివిడ్యువాలిటీతో తమని తాము రక్షించుకునే వారు.. అయితే ఇదే విచ్చలవిడితనం అటూ ఆడా, మగాకీ విస్తరించాక ఏదీ తప్పు కాదు… మన శరీరం, మన కోరికలు, మనిష్టం… ఆఫ్టరాల్ ఈ సొసైటీకి భయపడేదేమిటి? pch 🙂 సోషల్ ఏనిమల్స్ జంతుప్రవృత్తిని బాగానే వంటబట్టించుకుంటున్నాయి…!!
ఎదిగొచ్చిన కూతురు నాన్న కంట్లో భయాన్ని చూస్తే అర్థమవుతుంది… ఒక మగాడితో ఎంతవరకూ ఉండాలో…
అదే ఎదిగొచ్చిన కొడుకు తన అమ్మ కంట్లో బెరుకుని చూస్తే ఓ ఆడకూతురి పట్ల జన్మలో తప్పుగా ఆలోచించకూడదు అని అర్థమవుతుంది…
కానీ నాన్నల్నీ, అమ్మల్నీ పనికిమాలిన వాళ్లని చేసిపారేశాం.. వాళ్లకు ఛాదస్తమెక్కువ.. అస్సలు ఎంజాయ్ చెయ్యనీయరు… ATM సెంటర్కీ పేరెంట్స్కీ పెద్ద తేడానే లేదు.
చాలానే రాయాల్సి ఉంది… పర్సనల్గా ప్రస్తుత యూత్ కదలికలపై నాకెలాంటి కంప్లయింట్లూ లేవు… కానీ చాలామంది పేరెంట్స్ మొహాల్లో కన్పించే భయాలు మాత్రం ఇలా రాయకుండా ఆపలేకపోతున్నాయి…
ధన్యవాదాలు
– నల్లమోతు శ్రీధర్
ఎడిటర్
కంప్యూటర్ ఎరా తెలుగు మేగజైన్
http://computerera.co.in
http://youtube.com/nallamothu
http://nallamothusridhar.com
చాలా బాగా వ్రాసారు. ఎంత లెక్కలేనితనంగా వుంటున్నారో ఈ రోజుల్లో పిల్లలు. ఇది చదివిన కొంతమంది లోనైనా మార్పొస్తే బాగుండు.