భాషని విపరీతంగా అభిమానిస్తూ కుంచించుకుపోయే వారు కొందరు…
కులాన్నీ, మతాన్నీ, ప్రాంతాన్నీ, వర్గాన్నీ… మోసేస్తూ కూడా విశాలతత్వం ప్రదర్శించేవారు మరికొందరు….
ఆంగ్లేయుడి మీద ఉన్న తరతరాల కసి.. ఆంగ్లాన్ని ద్వేషించమంటోంది….
విభిన్న కులాలపై సంకుచిత ఆలోచనలతోనూ ద్వేషాలు నిరంతరం భగ్గుమంటూనే ఉంటాయి…
కానీ మన మనస్సులు సువిశాలం…. మనం ధీరోధాత్తులం…
ఎన్నో ఇజాలపై పెడుతున్నంత శ్రద్ధ మనమేంటో, మన జీవితమేంటో తెలుసుకోవడానికి పెట్టలేకపోవడం…. మన జీవితాన్ని మనకు కాకుండా చేస్తోంది..
భాషనో, కులాన్నో, మతాన్నో, ప్రాంతాన్నో విమర్శించడానికి, ద్వేషించడానికి అనర్గళంగా పుట్టుకొచ్చే మాటలు…. అందర్నీ, అన్నింటినీ కలుపుకుపోవడానికీ, పరస్పరం గౌరవించుకోవడానికీ… దేని ప్రత్యేకతను దానికి వదిలేయడానికీ రాకపోవడం….. నోరుండీ, వివేకం ఉండీ మూగగా మిగలడమే!
మాతృభాషపై అభిమానం ఉండొచ్చు… కానీ మాతృభాష మాట్లాడితేనే మనిషైనంత క్రూరంగా ప్రవర్తించడం…. ఏ మానసిక లోపానికి పరాకాష్టో గ్రహించుకోవాలి…
పుట్టిన కులమూ… ఆ కుల పెద్దలూ…. మనం గొప్పోళ్లం అన్న భావాల్ని నాటేయొచ్చు…. ఆ ఇరుకు ఆలోచనల్ని మోసుకు తిరుగుతూ నేను broad minded అనుకుంటే ఎలా…?
ఎలా ఎగిరెగిరి పడ్డా…. పుట్టిన ప్రతీ మనిషీ చిట్టచివరకు ఈ మట్టిలో కలిసిపోయే వాడే… ఉన్న కొన్నాళ్లూ…. ఇరుకు ఆలోచనలతో అందర్నీ ద్వేషిస్తూ పోవడం జీవితాన్ని నరకం చేసుకోవడమే!
– నల్లమోతు శ్రీధర్
nice tapaa andi
nice sir i like it so much…………..!