ఎప్పుడో ఫ్రెండ్ నుండి గిఫ్ట్‌గా పొందినా ఇటీవలే "సీక్రెట్" బుక్ సగం చదవగలిగాను…
అందులో "లా ఆఫ్ అట్రాక్షన్" థీరిటికల్గా తెలుసుకోవడం.. "అవును కదా" అని సర్ప్రైజ్ అవుతూ చదవడం, బాగుందనుకోవడంతో సరిపెట్టుకోకుండా.. ఇటీవల చాలా సందర్భాల్లో ప్రాక్టికల్‌గా ఆ సిద్ధాంతాన్ని పరిశీలించడానికి స్కోప్ దొరికింది…
మనుషుల్ని ప్రేమిస్తూ, అభిమానిస్తూ, అన్ కండిషనల్‌గా మనం ఓ మనిషికి ఏం చేయగలమో అది చేసుకుంటూ పోతుంటే.. అద్భుతమైన వ్యక్తులు తారసపడుతున్నారు.. అద్భుతమైన సంఘటనలు జరుగుతున్నాయి…
ఏ మనిషికైనా దాచుకోకుండా ప్రేమమైనా, ఎఫెక్షన్నైనా ఎంతవరకూ ఇవ్వగలనో ఇవ్వడం నాకు మొదటి నుండీ అలవాటు.. నాతో నేరుగా పరిచయం ఉన్నవారికి ఇది ఎటూ తెలుసు.. ఈ ప్రాసెస్‌లో నేనేం ఇస్తున్నాను… నాకేం వస్తోంది అన్నది ఎప్పుడూ అబ్జర్వ్ చేసేవాడిని కాదు.
నేనేం చేయగలనో గుడ్డిగా చేసుకుంటూ వెళ్లడమే తెలిసిన నాకు.. సీక్రెట్ బుక్ చదివాక.. పనులూ, ఫలితాల మీద అన్కండిషనల్గానే, ఎలాంటి ఎక్స్పెక్టేషన్లు లేకుండానే దృష్టి పెట్టాలన్పించింది. గమనించడం మొదలెట్టాను.
నిజ్జంగా చెప్తున్నాను… ఓ పది జీవితాలకు సరిపడా సంతృప్తిని అందించే మనుషులు మన చుట్టూ ఉన్నారు… ఒక మనిషి నుండి మనం ఏం కోరుకుంటే అది వస్తుంది… ఒక మనిషి నుండి నేను ఎలాంటి స్వార్థం లేని ప్రేమనే కోరుకుంటే.. కొన్నిసార్లు నా ప్రయత్నం ఫెయిల్ కావచ్చు.. అయినా నేను స్వార్థం లేని
ప్రేమని అందిస్తూనే సరిగ్గా అలాంటి ప్రేమనే రిటర్న్ కోరుకుంటుంటే ఖచ్చితంగా వచ్చి తీరుతుంది.
ఎంత అభిమానించినా మనుషులు తమ ఏటిట్యూడ్ చూపించుకుంటున్నారు… అని చాలాసార్లు మనం కంప్లయింట్లు చేస్తాం. ఇక్కడొక క్లారిఫికేషన్ అవసరం. మనుషుల సహజసిద్ధమైన స్వభావం ప్రేమించడమే.. కానీ రకరకాల ఇన్ఫ్లుయెన్స్ల వల్లా, అవసరాల వల్లా, స్వార్థాల వల్లా, పోటీల వల్లా ప్రేమించే తీరుబడి లేక
మనుషులు "సాటి మనిషిని ప్రేమించడమే" టాప్ ప్రయారిటీని వెనక్కి తోసేశారంతే. అలా వెనక్కి తోసేయబడిన ప్రయారిటీని మనం ఓపిగ్గా పైకి తెప్పించి వారూ మనల్ని అన్ కండిషనల్‌గా అభిమానించే పరిస్థితుల్ని ఏర్పరుచుకోవాలి తప్ప "అందరు మనుషులూ స్వార్థపరులే" అన్నట్లు అందర్నీ ఓ గాటనా,మనల్ని ఓ గాటకా కట్టేసుకోవడం సబబు కాదు.
ఈ క్షణం నేను నిన్ను అభిమానిస్తున్నా… నువ్వు నన్ను ద్వేషిస్తున్నావంటే… అయినా నేను మొహం చిన్నబుచ్చుకోకుండా నిన్ను అభిమానిస్తూనే కొనసాగుతున్నానంటే.. ఏదో రోజు నువ్వు నన్ను విపరీతంగా అభిమానించే క్షణాలు వాటంతట అవే వస్తాయి. ఇది ప్రకృతి సహజసిద్ధ ఏర్పాటు.
మన ప్రేమకు ఫలితం కోరుకోవడం స్వార్థం.. తక్షణ ఫలితం కోరుకోవడం అస్సలు ప్రేమే కాదు… ఎలాంటి ఫలితమూ కోరుకోపోవడం దైవత్వాన్ని మనస్సులో ప్రతిష్టిస్తుంది.. మన ప్రయాణం దైవత్వం వైపా తక్షణ ఫలితాలతో కూడిన లౌకిక ప్రపంచం వైపా అన్నది నిర్ణయించుకోవలసింది మనమే.
పైన నేను రాసిన దాంట్లో ఆధ్యాత్మికత ఏదీ లేదు…. ఇదేదో మనకు రుచించదు అని మీరు గిరిగీసుకుంటే ఖచ్చితంగా అది మీకు రుచించకుండానే పోతుంది 🙂 అదే law of attraction. ఇదేదో బాగుంది అనుకుంటే.. అన్ కండిషనల్ గా మనుషుల్ని అభిమానిస్తూ పోతే ఈ తత్వం యొక్క శక్తి ఖచ్చితంగా అర్థమవుతుంది.
గమనిక: ఇది ఎవరికైనా పనికొస్తుంది అన్పిస్తే ఇతరులకూ షేర్ చెయ్యగలరు.
– నల్లమోతు శ్రీధర్
ఎడిటర్
కంప్యూటర్ ఎరా తెలుగు మేగజైన్
http://computerera.co.in
http://youtube.com/nallamothu
http://nallamothusridhar.com
Leave a Reply