ఎంత అనుభవం గడిస్తే అంత సంతోషంగా ఉంటాం అనుకుంటారు చాలామంది…
మనం గడించే అనుభవమంతా కొన్ని bad, good మూమెంట్స్, కొన్ని జాగ్రత్తలు, కొన్ని కంక్లూజన్లు, కొన్ని ఓపీనియన్లు.. ఇవే ఎంత వెనక్కి తిరిగి చూసుకున్నా కన్పించేది.
ఎక్స్‌పీరియెన్స్ జీవితాన్ని చాలా చప్పగా చేస్తుంది. బాగా సంతోషమేసినా కూడా మెమరీ అర్కైవ్స్లోంచి ఓ పాత అనుభవం తన్నుకొచ్చి ఆ సంతోషాన్ని చంపేస్తుంది. ప్రతీ సందర్భానికీ మనమెలా ఉండాలో, మన నడవడిక ఎలా ఉండాలో, ఎలా ఉంటే సేఫ్‌గా, సెక్యూర్డ్‌గా ఉంటామో, పెయిన్ లేకుండా ఉంటామో ఎక్స్‌పీరియెన్స్ ద్వారా మనం స్ట్రేటజీలా సృష్టించుకుంటాం. దాంతో లైఫ్‌లో ప్రతీ మూమెంట్ దాని ఫ్లేవర్‌ని కోల్పోతుంది..
“ఫలానా ఇన్సిడెంట్ జరిగేవరకూ నేను చాలా హాపీగా ఉండే వాడిని.. ఆ తర్వాత నా థాట్స్ మారిపోయాయి” అంటూ చాలామంది ఇన్సిడెంట్లతో లైఫ్ మొత్తాన్నీ మార్చేసుకుంటారు. కరెక్టే.. జీవితంలో మనం ఎక్స్‌పీరియెన్స్ చేసిన వాటి ద్వారా కొన్ని జాగ్రత్తలు తీసుకోవలసిందే. కానీ జాగ్రత్తలు తీసుకోవడం మాత్రమే లైఫ్ కాకూడదు కదా?
ఈరోజు జనాలు ముడుచుకుపోయి బ్రతుకుతున్నారు… పక్కోడిని చూసి నవ్వాలన్నా బెరుకే… ఎవడో అన్యాయం చేస్తాడనో.. ఎవడ్ని నమ్మాలో తెలీక.. జీవితం ఎప్పుడెలా అయిపోతుందో అర్థం కాక క్షణక్షణం బెదిరిపోతూ మధ్యలో పార్టీలు, గెట్టుగెదర్లూ చేసుకుంటూ ఏదో సెక్యూర్డ్‌గా ఉన్న భ్రాంతిలో మునిగే ప్రయత్నం. ఇంత భయం అవసరమా?
————————
అనుభవం బ్రతుకుని నేర్పుతుంది అంటారు.. కొన్ని కోణాల్లో అది నూటికి నూరుశాతం శుద్ధ తప్పు. అనుభవం బతుకుని చెడగొడుతుంది. సహజసిద్ధంగా బ్రతికే గుణాన్ని పోగొడుతుంది. ఏజ్ పెరిగే కొద్దీ.. జీవితంలో చూడాల్సినవన్నీ చూసే కొద్దీ లైఫ్ పట్ల థ్రిల్ పోతుంది.. లైఫ్‌ని కొత్తగా చూడాలన్న ఇంట్రెస్ట్ పోతుంది.
ప్రతీ సమస్యకీ వంద కారణాలుంటాయి. వంద సొల్యూషన్లుంటాయి. కానీ మనం కంక్లూడ్ చేసిన సొల్యూషనే ఫైనల్ అన్నట్లూ.. ఆ అనుభవం ఇక జీవితంలో మళ్లీ ఎదురు కాకూడదు అన్నట్లు.. మన బ్రెయిన్‌ని ప్రోగ్రామింగ్ చేసి బిగదీసుకు కూర్చుంటే లైఫ్ చెత్తగా కాకుండా హాపీగా ఎలా ఉంటుంది?
———————————
ఎప్పటికప్పుడు డిటాచ్ కావాలి… unlink కావాలి.. మనకు ఏ అనుభవాలూ వద్దు… లైఫ్‌లో జరిగిన దాన్ని జరిగినట్లు accept చెయ్యడమూ, దాని గురించి వీలైనంత త్వరగా మర్చిపోయి మళ్లీ హాపీగా లైఫ్ లీడ్ చెయ్యడమే. అప్పుడే ఆలోచనల్లో క్రియేటివిటీ, శరీరంలో ఉత్సాహం మిగిలుంటాయి. లేదంటే ఎందుకొచ్చిన జీవితం అంటూ ఉసూరుమంటూనే బ్రతకాల్సి వస్తుంది.
చివరగా ఒక్కమాట, చిన్న పిల్లలకు తలపండిన మేధావుల్ని చూస్తే గౌరవం, తాము అంత గొప్పవాళ్లం ఎప్పుడు అయిపోతామో అని కూడా లోపల అనుకుంటూ ఉంటారు. కానీ ఆ మేధావుల కన్నా తామే గొప్పవాళ్లమని వాళ్లు ముసలి వాళ్లు అయ్యాక గానీ తెలీదు.
– నల్లమోతు శ్రీధర్
Leave a Reply