అంతం లేని అన్వేషణా… అంతే లేని వేదనా…!
నిరంతరం తపిస్తూ.. జ్వలిస్తూ.. కరుకు మొహాల్లోనూ, ఇరుకు మోహాల్లోనూ..
కపట నవ్వుల్లోనూ.. కరుణ చూపుల్లోనూ… దిగజారీ.. దిగజార్చీ.. బలపడీ.. బేలపడీ…
వలపించీ.. విలపించీ… వలపన్నీ.. వలలో చిక్కడిపోయీ…
నిశీధి రాత్రుల్లోనూ, నిశ్శబ్ధ మౌనాల్లోనూ… గుండె జార్చుకునీ… గుండె దిటవు చేసుకునీ….
ఎన్నెన్ని వ్యర్థ ప్రయత్నాలతోనో చితి మంటల్లో సమాధానపడి సమాదై పోయే అన్వేషణ!
– నల్లమోతు శ్రీధర్
Leave a Reply