ఏమీ తెలియని అమాయకత్వంలోనే జీవితం ఎంత అద్భుతంగా ఉంటుందో…
ఒక మనిషిని అభిమానించడానికీ, మనసారా నవ్వడానికీ బలమైన కారణాలు అవసరం లేని చోట మనుషులు అల్లుకుపోరూ.. అందుకే చిన్న పిల్లల బోసి నవ్వులకు ఎవరైనా ముగ్ధులైపోతారు!
చిన్న పిల్లలుగా బ్రతకడానికి మనకు నామోషీ… కష్టపడి బుర్రకెక్కించుకున్న తెలివితేటల్నిఅవసరం ఉన్నా లేకపోయినా అతిగా వాడేస్తూ కల్మషమెరుగని అమాయకత్వానికి బలవంతంగా దూరమవుతున్నాం…
చుట్టూ ముళ్ల పొదలు ఉన్నాయి సరే…. వాటి గురించి భయపడడంతోనే జీవితం ముగిసిపోతే… ముళ్ల పొదల మధ్య చిరునవ్వులు చిందించాల్సిన గులాబీ లాంటి జీవితం విచ్చుకోకుండానే వాడిపోదూ…!
నేను సంతోషంగా ఉన్నాను…. మనుషుల్ని చూసి అరమరికలు లేకుండా నవ్వగలుగుతున్నందుకు….!!
నేను సంతోషంగా ఉన్నాను…. డబ్బూ, హోదా, అవసరాలూ నా నవ్వుల్ని ఎవరెవరికో బలవంతంగా కృత్రిమంగా అందించకుండా ఉంటున్నందుకు..!!
ఏ అవసరం లేకున్నా నవ్వగలుగుతున్నందుకు… మనుషుల్ని అభిమానిస్తున్నందుకు నేను సంతోషంగా ఉన్నాను….
చాలు ఇలాంటి అమాయకత్వం… జీవితాన్ని మనసారా ఆస్వాదించడానికి!!
– నల్లమోతు శ్రీధర్
ఎడిటర్
కంప్యూటర్ ఎరా తెలుగు మేగజైన్
nice tapaa andi teliyani taname baavuntundi