“భారత దేశ యువత దేశానికి పునాదిగా నిలవాలి, దేశ భవిష్యత్‌ని కాపాడాలి” అని బలంగా నమ్మే స్వామి వివేకానంద స్ఫూర్తితో గత 20 ఏళ్లుగా పనిచేస్తున్న వ్యక్తిగా నేను సమాజాన్ని నిరంతరం నిశితంగా గమనిస్తూ వస్తున్నాను.
ముఖ్యంగా యువతరం కదలికలు, వారి బాడీ లాంగ్వేజ్, వారి థాట్ ప్రాసెస్, ఎక్స్ట్రీమ్స్ వంటివన్నీ చాలా దగ్గరగా పాసివ్‌గా గమనిస్తూ ఉంటాను. రోడ్ మీద గ్రూప్ ఆఫ్ కుర్రాళ్లు వెళుతుంటారు.. వాళ్ల బాడీ లాంగ్వేజ్, వేషాలు, వాళ్ల మాట్లాడుకునే మాటలు వంటివన్నీ సమాజాన్ని అర్థం చేసుకోవడంలో భాగంగా I observe. అలా అన్ని అకేషన్స్‌లో నేను keen observerని!
యువతని ఇంత క్లోజ్‌గా పరిశీలించాక.. నాకు ఏర్పడిన భావన..! పేరెంట్స్‌గా మీకు ఇళ్లల్లో ఉండి తెలీట్లేదు గానీ.. అధికశాతం మంది పిల్లలు, ముఖ్యంగా అబ్బాయిలు సంఘ విద్రోహ శక్తులుగా తయారవుతున్నారు.
అమ్మాయిలది తప్పు లేదా అని మీరు అనొచ్చు అదీ చెబుతాను. ఓపిగ్గా మొత్తం చదవండి.
ప్రేమ Aspect గురించి చెబుతాను.
టీనేజ్‌లో దాదాపు ప్రతీ అమ్మాయి, అబ్బాయి శరీరంలో హార్మొనల్ మార్పుల వల్ల ఎవరినో ఒకర్ని ప్రేమించడమో, కనీసం మనస్సులో ఇతరుల పట్ల క్రష్ ఉండడమో సహజం. చరిత్రలో ఎన్నో గొప్ప ప్రేమ కధలు ఉన్నాయి. అంతెందుకు ప్రేమించి పెళ్లి చేసుకుని షష్టిపూర్తిలు పూర్తి చేసుకుంటున్న వయో వృద్ధులూ ఉన్నారు. కానీ ప్రేమ ఇద్దరి హృదయాలకు సంబంధించినది అనే బేసిక్ అండర్ స్టాండింగ్ నుండి ప్రేమ అంటే సెక్స్ కోరికలు తీర్చుకోవడమే అనే స్థితికి సమాజాన్ని దిగజార్చాం. దీనికి సినిమాలు మొదలు, ఫేస్బుక్లో కన్పించిన వాళ్లకల్లా “మీరు బ్యూటిఫుల్‌గా ఉన్నారు, ఇంతందం మీకే స్వంతం” వంటి మానసిక వ్యభిచారంతో వలవేసే పురుషులు, మగువల వరకూ ప్రతీ ఒక్కరి హృదయంలో ఉన్నది ప్రేమ కాదు, కేవలం శారీరక మోజు.
మరి అలాంటిది ఫేస్బుక్లో ప్రగల్భాలు చెప్పే గొప్పోళ్లకే ప్రేమకీ, శారీరక వ్యామోహానికీ తేడా తెలీకపోతే ఇంకా టీనేజ్ యువతరానికి ఎలా అర్థమవుతుంది? ఒక మనిషి పట్ల ప్రేమ ఉంటే వాళ్లని అస్సలు టచ్ చెయ్యకుండా కూడా ఆరాధించవచ్చు అన్నది ఈ యువతరానికి చెప్పే వాళ్లెవరు?
సరిగ్గా ఇక్కడే ఇద్దరు ప్రేమగా ఉండాల్సిన యువత, వాళ్ల జీవితం పట్ల ఒకరికొకరు బాధ్యత కలిగి ఉండి, మంచిగా సెటిల్ అయి ఒకరినొకరు ప్రోత్సహించుకుంటూ, పెద్దలను కన్విన్స్ చేసుకుని ఉండాల్సిన యువత ఏ బలహీన క్షణమో శారీరక వాంఛలు తీర్చుకుంటూ, ఇంకా దాన్ని కొంతమంది సినిమా తారలమన్నట్లు వీడియోల్లో బంధించుకుంటూ, ఆ వీడియోలను పోర్న్ సైట్లలో గర్వంగా పెట్టుకుంటూ.. ఎంత దిగజారుడుతనం?
అసలు ఓ అమ్మాయిని ప్రేమించిన ఏ మగాడైనా ఆమె ఆత్మ గౌరవాన్ని కాపాడే బాధ్యత లేదా? “ఆమె నా girl” అనే ఫీలింగే ఉంటే, ఆమె ఎలాంటి ఇబ్బందీ లేకుండా, ఎవరి దగ్గరా చులకన అవకుండా గొప్పగా ఉండాలి అనే భావన ఉంటే ఆమె పరువును బజార్లో పెడతారా? ఎంత సిగ్గుచేటు?
ఒకమ్మాయి ప్రేమిస్తే ఒకడినే ప్రేమిస్తుంది. కొంతమంది ఉండొచ్చు.. ఒకేసారి పలువురు అబ్బాయిలను ప్రేమిస్తూ, వాడుకుంటూ బ్రతికేవాళ్లు. కానీ 90 శాతం ఒకమ్మాయి ప్రేమిస్తే ఒకడినే ప్రేమిస్తుంది. ప్రేమించే వరకే కాస్త జాగ్రత్తగా, బెట్టుగా ఉంటుంది. ప్రేమించాక ఇక అతనే సర్వస్యం అనుకుంటుంది. తనని తాను కోల్పోతుంది. కానీ ఒకబ్బాయి ప్రేమ చాలా సందర్భాల్లో మోజు తీరాక డైల్యూట్ అవడం చూస్తున్నాం. సరిగ్గా ఇదే పరిస్థితిలో.. ఈ మధ్య టీనేజ్ యువతరం కొంతమంది తన girlని తన స్నేహితులతో పంచుకోవడానికి కూడా వెనుకాడడం లేదంటే, ఆమె మాట వినకపోతే రేప్ కూడా చేస్తున్నారంటే అస్సలు ఏంటిది? నిన్ను నమ్మి నీతో ఉన్న అమ్మాయిని నీ స్నేహితులతో పంచుకోవాలని భావిస్తున్నావు చూశావా.. నువ్వు మనిషివా పశువ్వా?
తల్లీ, తండ్రీ ఏ లోటూ లేకుండా అల్లారు ముద్దుగా పెంచుకున్న ఆ అమ్మాయిని మార్చి మార్చి ఎవరో పశువులు రేప్ చేస్తున్నారంటే తల్లిదండ్రులకు ఆ ఊహే ఎంత దారణంగా ఉంటుంది?
ఇలాంటి క్యారెక్టర్ లెస్ యువతకి పేరెంట్స్ కాకుండా ఇంకెవరు క్యారెక్టర్ నేర్పుతారు? కని పారేసి, డబ్బులు సంపాదించేసి, కాస్ట్లీ బైక్‌లు కొనిపెట్టేసి, ఇంకా కావాలంటే కార్లు కొనిపెట్టేసి “మా వాడు చాలా రాయల్‌గా బ్రతుకుతాడు” అని గర్వపడితే ఎంత సిగ్గుచేటు? ఇదా పేరెంటింగ్. పిల్లల్ని కనిపెట్టుకుని ఉండాల్సిన పనిలేదా?
అమ్మాయిలది తప్పులేదా.. అనొచ్చు. యెస్.. చాలామంది అమ్మాయిలదీ తప్పు ఉంది. అమీర్‌పేట, కూకట్పల్లి వంటి చాలాచోట్ల హాస్టల్స్‌లో బరితెగించి బ్రతికే ఎంతోమంది అమ్మాయిలను ఆ చుట్టు పక్కన పనుల మీద వెళ్లినప్పుడు కళ్లారా చూశాను. రోడ్ల మీద రొమాన్స్ చేసే వాళ్లని! అలాగే అబ్బాయిలను వాడుకుని వాళ్ల ఫీలింగ్స్, ఎమోషన్స్‌తో ఆడుకునే వాళ్లని! బట్ ఇక్కడ అస్సలు పాయింట్ మర్చిపోతున్నాం.. నేను అమ్మాయిల పక్షానో, మీరు అబ్బాయిల పక్షానో చీలిపోయి “వాళ్లది తప్పంటే, కాదు వీళ్లది తప్పు” అని వాదించుకోవడంలో ఆరితేరిపోయాం గానీ అస్సలు పైన నేను చెప్పిన విషయాలు ఎంతమంది ఇంత లోతుగా ఆలోచిస్తున్నారు?
Spend quality time with your children. జీవితంలో ప్రేమ దొరక్కపోతే ఆ బాధ అర్థం చేసుకునే పరిపక్వత కూడా లేని పేరెంట్స్‌ని చూస్తున్నాం. ఫీలింగ్స్, ఎమోషన్స్ చచ్చిపోయి మెషీన్స్గా బ్రతికేస్తున్న పేరెంట్స్‌కి పిల్లలు ప్రేమ కోసం ఎంతగా పరితపిస్తున్నారో ఎలా అర్థమవుతుంది? మీ పిల్లల్ని ఉన్నతంగా, గొప్ప ఆలోచనలతో, జీవితం పట్ల మంచి దృక్పధం ఏర్పడేలా పెంచండి. నాలుగు మంచి మాటలు చెప్పండి, దిశానిర్దేశం చెయ్యండి. కొంతమంది మా పిల్లలు వినట్లేదు అంటారు. వినట్లేదు అని లేబుల్ వేసి, వాళ్ల ఖర్మకి వాళ్లే పోతారు అని పక్కకుపోతే ఎలా?
మనం చెప్పే పద్ధతి సరిగ్గా లేకపోతే స్ట్రేటజీ మార్చుకుని వేరే పద్ధతిలో చెప్పాలి. చెప్పడంలో నువ్వు పేరెంట్‌గా ఫెయిల్ అవుతున్నావు, దాన్ని మార్చుకో. ఇలాంటి టాపిక్స్ చాలామంది రాస్తారు, మరి మిత్రులు నాకు కనెక్ట్ అవుతారు అంటే ఎందుకు? అది నా గొప్ప కాదు. ప్రతీ aspectలో పార్టియాలిటీ లేకుండా బ్యాలెన్స్డ్గా, సొల్యూషన్ ఓరియంటెడ్‌గా నేను రాసే విధానం. సో పిల్లలతో కమ్యూనికేట్ చెయ్యడం మొదట నేర్చుకోండి. డబ్బులు సంపాదించుకునేది తర్వాత!!
- Sridhar Nallamothu