చిన్నప్పట్నుండీ అన్నీ తానై చూసిన అమ్మ..
ఊపిరి ఆగేవరకూ మన అవసరాలు తీర్చుకునే యంత్రంగా ఉపయోగించుకోకుండా ఉండడమే.. అమ్మకు మనం ఇచ్చే గొప్ప గౌరవం!
మన బద్ధకాన్ని క్షమించేసి వద్దన్నా అమ్మ ఓపిక తెచ్చుకుని మనల్ని చక్కబెడుతుంది…
ఆ ప్రేమకు మురిసిపోయి.. ఆమెని కష్టపెట్టి మనం సుఖంగా బ్రతకడానికి కన్వీనియెంట్గా అలవాటు పడిపోవడం చేస్తే.. ఎన్ని మదర్స్ డేలు చేసుకునీ లాభమేముంది.. మెడలో ఓ దండేసి… ఆ తర్వాత దండీలు తీయించడం మనకు అలవాటేగా!
అమ్మ ఎప్పుడూ అలుసు కాకూడదు…
ఆమె ప్రేమ "పిచ్చి ప్రేమ"గా కేటగరైజ్ చేసి పడేసి… కాజువల్‌గా తీసుకోబడకూడదు…
కొందరంతే.. మన కోసం జీవితాలు త్యజిస్తారు… కానీ ఎవరికీ ముఖ్యమైన వారుగా అన్పించరు… అలాంటి కోవకు అమ్మని జమకట్టేయకండి ప్లీజ్…
నాకు జన్మనిచ్చిన దివంగతులు మా అమ్మ గారికీ, మాతృమూర్తులందరికీ మనసారా ప్రణమిల్లుతూ…
– నల్లమోతు శ్రీధర్
Leave a Reply