“అయినా మనుషులు మారరు” – చాలా ఫ్రీక్వెంట్‌గా విన్పించే మాటిది. కొన్నిసార్లు నేను ఏవైనా నాలుగు మంచి మాటలు రాసినప్పుడు.. క్రింద కామెంట్లలో మిస్ అవకుండా “మీరెన్ని చెప్పినా మనుషులు మారరు” అనే మాట విన్పిస్తుంటుంది.
అసలు మారడం అనేది అప్పటికప్పుడు instantగా జరుగుతుందా? మారడం అంటే మనకున్న perception ఏంటి?
ఇప్పటిదాకా ఓ విధంగా ఆలోచించిన వ్యక్తి ఇప్పటి నుండి కంప్లీట్ మారిపోతే.. అది మన దృష్టిలో మార్పా? అలాంటి రాత్రికి రాత్రి మార్పులు ఆశించడం కరెక్టేనా?
హ్యూమన్ బ్రెయిన్ కొన్ని ఫంక్షన్లు నిర్వర్తిస్తుంటుంది. చూడడం, వినడం, గ్రహించడం, ఆలోచించడం, మానసిక సంఘర్షణకి గురవ్వడం, ఉన్న అభిప్రాయాలు, ఆలోచనలు, నడవడిక మెల్లగా మార్చుకోవడం.. ఇలా ఇదంతా ఓ సైకిల్. ఈ సైకిల్‌కి మనం respect ఇవ్వాలి. “ఇది మంచిది..” అని మనం చెప్పినంత మాత్రాన వెంటనే అవతలి వాళ్లు ఆచరించాలని లేదు. కొన్నిసార్లు ఆ థాట్‌కి వెంటనే ఐడెంటిఫై అయితే వెంటనే ఫాలో అవుతారు. కొన్నిసార్లు వినీ, తమకి తాము ఆలోచించి, ఆల్రెడీ తమ పాత్‌తో కంపేర్ చేసుకుని.. ఏది మంచో, ఏది చెడో తమంతట తాము ఓ కంక్లూజన్‌కి వచ్చి ఆ తర్వాత మెల్లగా మారతారు. ఈ మారడం కూడా మెల్లగా జరుగుతుంది.
ఈ సమాజంలో ఓపిక తక్కువ. రాత్రికి రాత్రి మనుషులు మారాలి.. వ్యవస్థ మారాలి.. ప్రజలు అజ్ఞానం పోగొట్టుకోవాలి.. ఇవన్నీ జరగకపోతే మనకు ఫ్రస్టేషన్ వస్తుంది.. అసలు ఓ పెద్ద వ్యవస్థని ప్రభావితం చెయ్యడానికి, విభిన్నమైన ఆలోచనలు కలిగిన జనసమూహాన్ని కొత్తగా ఆలోచింపజెయ్యడానికి ఎంత శక్తి పెట్టాలో మనకు తెలుసా.. దానికన్నా ఎంత ఓపికగా వేచిచూడాలో తెలుసా.. అంత ఓపిక ఉందా?
ప్రతీ మనిషీ మారతాడు.. అది ఇవ్వాళ జరగొచ్చు… ఓ పదేళ్ల తర్వాత జరగొచ్చు.. లేదా చచ్చేలోపు ఎప్పుడైనా ఆ మార్పు సంభవించవచ్చు.. మనం చెయ్యాల్సింది మన ప్రయత్నమే. ఓ చిన్న ఆలోచన కలిగించడమే ప్రతీ మనిషీ కర్తవ్యం. అంతకన్నా ఎక్కువ expect చెయ్యకూడదు. అలా instant results కోసం expect చేస్తే డిజప్పాయింట్మెంటే మిగులుతుంది 🙂
– నల్లమోతు శ్రీధర్
good, keep it up
ఎంతటి వారు అయిన ఏదో ఒక రోజు మారతారు – ధన్యవాదాలు సార్