ఎదగడం చాలా సులువనుకుంటారు లౌక్యం తెలిసిన చాలామంది… నిజాయితీగా మనల్ని మనం మాత్రమే నమ్ముకుని ఎదగడం చాలా చాలా కష్టం.
పబ్లిక్ రిలేషన్లూ మెయింటైన్ చేస్తూ.. పేరున్న వాళ్లందరి దగ్గరా అక్కడో మాటా ఇక్కడో మాటా చెప్పేసి.. వాళ్ల ఇగోల్ని సంతృప్తిపరిచేసీ… అర్హత లేకపోయినా అవకాశాలు దక్కించుకునే బాపతు జనం మనందరి చుట్టూ చాలామందే ఉంటారు.. వారిలో ఎదుగుదల కన్పిస్తుంది గానీ వారి పట్ల మనకు గౌరవం మిస్ అవుతుంది… అలాంటి గౌరవం లేని ఎదుగుదల ఉన్నా ఒకటే లేకపోయినా ఒకటే.
రచయితలూ, ఆర్టిస్టులూ, మీడియా, ఇతరత్రా క్రియేటివిటీ రంగాల్లో ఈ తరహా పోకడలు ఎక్కువ. ఆయా రంగాల్లో కొందరు సూపర్ పవర్స్ ఉంటారు… వాళ్లు ఆకాశమంత స్థానానికి చేరిపోయారు కాబట్టి.. ఆకాశమంత ఇగోనీ పోగేసుకుని ఉంటారు.. ఆ సూపర్ పవర్స్ ప్రాపపం సంపాదించడం కోసం వారి ఇగోని శాటిస్ఫై చేసి.. “అబ్బా మనలో ఎంత లౌక్యం ఉందో..” అని లోపల్లోపల సంబరపడిపోతూ 0 నుండి ఉన్న ఫళాన హీరోహీరోయిన్లైపోయే జనాలెందరో…
వారిని చూసి అసూయపడడం కన్నా జాలిపడడం ఉత్తమం.
కష్టాన్ని నమ్ముకున్న వాడికి సంతృప్తి ఉంటుంది… ఎదిగినా ఎదగకపోయినా! కానీ లౌక్యాన్ని నమ్ముకున్న వాడికి ఎంత ఎదిగినా లోపల తెలీని లోటుతో అసహనంగా రగిలిపోతుంటారు పైకి నవ్వు కన్పిస్తున్నా!
అర్హత లేని స్థానాన్ని కోరుకోవద్దు… అది జీర్ణం అవదు.. ఆ స్థానానికి తగ్గ విలువ నిరంతరం ముల్లులా గుచ్చుకుంటూనే ఉంటుంది… స్థిమితంగా కూర్చోలేరు..
———–
నాకు తెలిసీ, నా కళ్లెదుట ఏమాత్రం శక్తిసామర్థ్యాలు లేకపోయినా ఇలా అడ్డగోలుగా ఎదిగిపోయిన వాళ్లు చాలామందే ఉన్నారు. పొట్టకోస్తే అక్షరంముక్క రాని వాళ్లు కూడా అపర మేధావులుగా, చాలా గొప్ప వాళ్లుగా చలామణి అవుతున్న వాళ్లెందరో. ఇది వారి పట్ల చిన్నచూపుతో మాట్లాడుతున్న మాటలు కాదు… టాపిక్ అర్థం కావడం కోసం వాస్తవం వాస్తవంలా చెప్పుకోక తప్పదు. 0గా ఉన్నప్పుడు ఎంతో ఒద్దికగా ఉన్నోళ్లు కాస్తా ఈరోజు హీరో హీరోయిన్లైపోయాక… మొహంలో నవ్వునీ చాలా పొదుపుగా వాడేస్తూ…. ఎవరి దగ్గర నవ్వాలో, ఎవరి దగ్గర నవ్వకూడదో స్థాయీబేధాలు పాటిస్తూ.. చాలా గంభీరంగా తలలు పంకిస్తుంటే…. హహహహహ 🙂 భలే నవ్వొస్తుంది… ఎందుకు ఇంత పిచ్చి శ్రమ? బ్రతికేది మహా అయితే ఇంకో 30-40 ఏళ్లు! ఆ తర్వాత గోతి తవ్వి పూడ్చేస్తారు… లేదా కట్టెల మీద పెట్టి కాల్చేస్తారు.. ఈ మాత్రానికేనా అంత మిడిసిపాటు?
———-
ఉన్నత స్థానానికి ఎదగడం గొప్ప కాదు…! ఉన్నతమైన భావాలు గల వ్యక్తిగా ఎదగడం గొప్ప..!! అది మన జీవితానికీ సంతృప్తినిస్తుంది… మన చుట్టూ సమాజానికీ సంతృప్తినిస్తుంది…
అలాగే అడ్డదిడ్డంగా ఎదగాలని కోరుకోవద్దు.. ఎదగడం నీ లక్ష్యమైతే ఆ ఎదగడానికి కావలసిన అర్హతలు సంపాదించి నీకు నీవుగా ఎదుగు… లౌక్యాన్ని నమ్ముకుని మాటలు చెప్పి… అసమర్థపు వ్యవస్థనూ, అసమర్థపు, ఇగోయిస్టిక్ మనుషులనూ తాడుగా చేసుకుని పైకి ఎదగడం… అలా పైకెక్కి మనిషిగా క్రిందకు దూకి ఆత్మహత్య చేసుకున్న దానితో సమానం!!
– నల్లమోతు శ్రీధర్
Very Well Said……. Kaani, ivi anni itlanti articles chadhivina koncham sepu ae gurthu untai… smashaana vairaagyam lantivi.. malli mana routine life lo ivanni cheyaka thappani paristithi.. 🙁
Hello sir,
By mistake my phone got falled and after that my memory card is not working i checked via pc also but it is not showing anything i tried in nokia phone it is showing but it is locked when i tried opening it using 1357 password it says operation failed please help me how to get data backup from that