తెలుగు బ్లాగ్లోకంలో మిత్రులు చేసే ఎన్నో అద్భుతమైన టపాలను చదివేటప్పుడు కొన్ని క్షణాలపాటు మనసులో ఏ మూలనో వెలితి మెలిపెడుతుంది. “సాంకేతికాలు”ని సక్రమంగా నిర్వహిస్తే చాల్లే అని అప్పటికప్పుడు సర్ధిచెప్పుకుని సాగిపోతూ ఉన్నాను. విభిన్న ఆలోచనలు మనసుని ముప్పిరిగొని అస్పష్టంగా కదలాడేటప్పుడు “వాటి ఘోషకి అక్షరరూపం ఇస్తే ఆ అలజడి శాంతిస్తుంది కదా” అని మళ్లీ మనసు మూలిగినా గొంతునొక్కిపెడుతూ వచ్చాను. ఈ నింయతృత్వపోకడలు చూసి మనసెక్కడ తిరగబడుతుందోనన్న భయంతో కంప్యూటర్ ఎరా మేగజైన్ లో సంపాదకీయాల్లో ఓ చిన్న వెసులుబాటు కల్పించుకుని నెలకోసారైనా గళాన్ని విప్పుతున్నాను. అయినా అసంతృప్తి తొలగడం లేదు. తెల్లారిలేచించి మొదలు ఆదమరిచి నిద్రపోయేవరకూ మనసులో ఎంతో భావసంఘర్షణ జరుగుతూ ఉంటోంది. ఎలాగైనా అప్పుడప్పుడు కొంత తీరుబడి చేసుకుని దానికి ఓ రూపం సంతరించి ఇవ్వకపోతే ఆ సంఘర్షణ మనసులో చిక్కుముడులుగా ముడిపడిపోతుందేమోనని.. ఎంతోకాలం ఊగిసలాటకు తెరదించి ఇన్నాళ్లకు “మనసులో..” పేరిట ఈ బ్లాగుకి శ్రీకారం చుట్టాను. అందరి ఆదరాభిమానాలు లభిస్తాయని ఆకాంక్షిస్తూ..
– నల్లమోతు శ్రీధర్
చాలా చక్కగా వుంది పేపర్ డిజైన్, లే అవుట్…
బాల్యం గుర్తు వస్తోది ఆ గీరల కాగితం చూస్తే చాలు…
ఇందులో రచయిత తన స్వంత దస్తూరి ఫోంటుతో రాయాలని నా కోరిక.
“మనసు …”ప్రారంభానికి నా శుభాభి వందనలు.
-కొండేపూడి నిర్మల
చాలా బాగా రాసారు శ్రీధర్ గారు. బ్లాగు డిజైన్ చాలా బాగుంది. మీ మనసులోతుల్లో చెలరేగే ఊసులకు, ఊహలకు, ఆ తెల్ల కాగితం ద్వారా అడుగులు నేర్పేసి, మీ భావ సంఘర్షణని బ్లాగు మిత్రులతో పంచుకొండి
మనసున నిండి పలుకగరాని తలపులున్నవి కొన్ని
తలపులున్నవి కొన్ని
అనుకుంటూ ఇంతకాలం కాలం గడిపేసారన్నమాట,
ఇప్పటికే మీ ఆలోచనలని కొంత పంచుకున్నా మనసు లోపలి ఆలోచనల్ని కూడా పంచుకునే అవకాశం వచ్చిందన్నమాట, ఆ క్షణాలకొసం ఎదరుచూస్తూ
మీ మిత్రుడు
శ్రీనివాస్ కర
జనాలు సెడిపోయినారు, సీదరా ఓ మాంచి బ్లోగు మొదలెట్టి నాలుగు మాటలు సెప్పవయ్యా అని ఎన్ని సూర్లడిగినా, మొహాన నాలుగు నవ్వులు పడేసి ఊరుకుండేటోడు ఇయ్యాల సీకారం సుట్టేసి సంఖం పూరించేసినాడంటే పేద్ద విసేసమే. నీ మనుసు లో సంగర్సన తెలుగు బ్లోగుల్లో ఓ కొత్త ఒవరడి తప్పక తెస్తదనే మా ఆస. మాకు సానా సంతోసంగా ఉంది.
caala baaraa saaraMDi
శుభారంభం.
మందుగా శ్రీధర్ గారికి శుభాభినందనలు.
‘మనసులో’ బ్లాగ్ నామకరణం ఎంతో బాగుంది. ‘మనసులో’తుల్లో ఉన్న భావాలను వ్యక్తపరచగలగటం, పంచుకోగలగటం ఎంతో అదృష్టం.
ఎంతొ మంది ‘మనసు(ల)లో’ ఈ బ్లాగ్ చెరగని ముద్రవేస్తూ కలకాలం నిలిచిపోవాలని నిండు మనసుతో కోరుకుంటూ . . . .
మీ
చిలకపాటి శివరామ ప్రసాద్
శుభం.
బ్లాగు డిజైన్ చాలా బావుంది.
“త్వరలో రిలీజ్ కాబోతున్న విశ్వనాధ్ సినిమా” అన్న వార్త విన్నంత ఆనందంగా వుందండీ
మనసు పేరుతో చాలా బ్లాగులు వున్నయికదా . వేరే ఏదైనా పేరుపెట్ట్లేకపొయారా?
చూడగానే తెలిసేలా .
sridharcera ante evaro anukunnnna
sridhar computer era ani anna maata deeni ardham
nenu blaags loki raaka munde mee gurinchi telusu sridhar gaaru
meeru chestunna krushi anirvachneeyam
mee ee blaag mee “mansulo” chelaregutunna sangharshana ki chakkani roopam ivvagaladani bhaavistunnnau
abhinandanalu
శ్రీధర్ గారు ,
చాలా సంతోషం.
ఇదివరలో చాలా సార్లు అనుకున్నా మీరెందుకు బ్లాగ్ రాయటంలేదో నని! మూడు పోస్టులు ఆరు కామెంట్లు గా మీ బ్లాగు వర్ధిల్లాలి.
@నిర్మల గారు, మీలాంటి గొప్ప రచయిత్రి మొదటి కామెంట్ రాయడం చాలా హాపీగా ఉంది.
@రమణి గారు ధన్యవాదాలు.
@శ్రీనివాస్ గారు, తప్పకుండా పంచుకుంటాను.
@గిరిచంద్ గారు, జనాలను బాగు చేసేటంత సత్తా నాకు లేదు కానీండి, తోచినది షేర్ చేసుకుంటూ ఉంటాను, చక్కని భాషలో కామెంట్ రాసినందుకు మరో చిరునవ్వు 🙂
@ అశ్విన్ గారు, విజయమోహన్ గారు, ప్రసాద్ గారు ధన్యవాదాలు. మొదటి నుండి ప్రోత్సహిస్తున్న మీకు మనస్పూర్తిగా ధన్యవాదాలు.
@ప్రతాప్ గారు, థాంక్యూ
@లలిత గారు విశ్వనాధ్ సినిమాతో నా బ్లాగుని పోలిస్తే ఆయన సినిమా డీగ్రేడ్ అవుతుందండీ. ఏమాటకామాటే చెప్పుకోవాలి మీ వ్యాఖ్య చాలా ఆనందాన్నిచ్చింది. “మనసులో” పేరుతో చాలానెలల క్రితమే ఈ బ్లాగు ప్రారంభించాను. అయితే రాయలేదు. ఆ పేరుని వదిలిపెట్టబుద్ధికాక అదే పెట్టేశాను.
@లచ్చిమి గారు మీ పేరుతో పాటే వివిధ బ్లాగుల్లో మీ కామెంట్లు, మీ పోస్టులు చదివి ఓ ప్రత్యేకమైన అభిప్రాయం ఏర్పడింది. ధన్యవాదాలు వ్యాఖ్యతో ప్రోత్సాహం అందించినందుకు.
@రమ్య గారు నిజంగా చాన్నాళ్లు ఊగిసలాటలో ఉన్నాను. ఆరు కామెంట్లు వచ్చినా రాకపోయినా పోస్టులు మాత్రం తప్పకుండా రాస్తుంటాను. ధన్యవాదాలండీ!
మీరెంత అదృష్ట వంతులండీ. కొండేపూడి నిర్మల గారి కామెంటును పొందారు. నాకు చాలా అసూయగా ఉంది. 🙁
మీ బ్లాగు బాగుంది.
బొల్లోజు బాబా
బాగుంది…
సాంకేతికాలే కాకుండా మనసులోని భావాలను కూడా అందరితో పంచుకోవడానికి మీరు మొదలుపెట్టిన ఈ బ్లాగు చక్కగా సాగాలని ఆశిస్తున్నాను.
శుభం. మీ ఈ బ్లాగు పేరు టెంప్లేటు రెండూ బాగున్నాయి, పేరుకు తగ్గట్టు ఉంది టెంప్లేట్. విషింగ్ యూ ఆల్ ద బెస్ట్.
lay out is good sir,rasevidanamlo niguda bavakudau kanapaduthunnadu
విన్నకోట ఆదిత్య గారు, ధన్యవాదాలు.
శ్రీధర్ గారు నేను మీ చిట్కాలను అనుసరించి నా బ్లాగు ప్రారంభించాను. అపుడే మీ బ్లాగు కోసం వెతికాను. మనసులో భావాలకు ప్రత్యేకంగా ఇలా అక్షర రూపం ఇచ్చేరన్నమాట. మీ నుండి ఇంకా ఎన్నో అద్భుతమైన టపాలను ఆశిస్తున్నాము. ప్రారంభమే ప్రత్యేకతను సంతరించుకుంది.ఇలాగే కొనసాగండి.
శ్రీధర్ గారూ.. మొన్న శనివారం ఈనాడు ఈతరం పేజ్ లో తెలుగు భాషగురించి వ్రాసిన అభిప్రాయాల్లో మీ “యువతకెన్ని మార్గాలో ” చూసా ..బావుంది..!