నేను ఇప్పుడు మాట్లాడబోతున్నది చాలా చాలా మందికి అస్సలు అర్థం కాదు… అర్థమైనా రుచించదు… సో అనవసరమైన వాదనలకు మాత్రం నేను దిగను, కామెంట్లని ఎంటర్ టైన్ చెయ్యను.. నాకు కలిగిన ఆలోచనని వ్యక్తపరుస్తానంతే…
"వందల మందిని పొట్టనబెట్టుకున్న వాడికి ఈ శిక్ష ఎప్పుడో పడాల్సిందే" ఇది మనందరి కామన్ ఫీలింగ్.
The Alchemist, The Secret వంటి పుస్తకాలూ, సినిమాలూ చూసి మనం చాలా ఇన్ స్పైర్ అవుతాం.
ఇన్ స్పిరేషన్ అనేది ఓ గాఢమైన మానసిక ప్రక్రియ. దానికి మతాలూ, దేశాలతో సంబంధం లేదు.
ఇక్కడ కసబ్ కూడా ఇన్ స్పైర్ అయ్యాడు.. కాకపోతే కరడుగట్టిన తీవ్రవాదంచే..!!
కసబ్ స్థానంలో మనమూ ఉంటే.. ఆర్థికంగా సరైన అవకాశాలు లేకపోతే, ఆ అవకాశాలు లేకపోవడాన్ని తీవ్రవాద సంస్థలు ఆసరాగా చేసుకుని చేరదీస్తే, మతం పట్లా, దేశం పట్లా అవసరానికి మించి అభిమానం ఉంటే.. మనమూ కసబ్ లా ప్రవర్తించే వాళ్లమేమో… ఇవ్వాళ ఉరి తీయబడే వాళ్లమేమో..
"చంపేయండి… నరికేయండి… ఇలాంటోళ్లు బ్రతకడానికి వీల్లేదు.." ఈ మధ్య ఈ మాటలు చాలా చాలా తరచుగా వింటున్నాం, మాట్లాడుతున్నాం. దీన్నేమనాలి పైశాచికత్వం అనుకోవాలా మూర్తీభవించిన మంచితనం అనుకోవాలా? అందర్నీ చంపేయమంటూ కూడా మనం మంచివాళ్లగానే చెప్పుకుంటున్నాం.
ఒక మనిషిని టెర్మినేట్ చేయడమే సమస్యకు పరిష్కారమా?
ఈరోజు మనలో చాలామంది రకరకాల కరడుగట్టిన భావాలకు ప్రభావితులై ఇతరులకు హాని చెయ్యడానికి కూడా వెనుకాడలేనంతగా ఇన్ స్పైర్ అయిపోతున్నారు… మరి అందర్నీ చంపేసుకుంటూ పోతే మనల్నీ చంపేయాలి కదా…
కసబ్ చనిపోవడం భారతదేశం కోరిక కావచ్చు… యావత్ భారతీయుల కోరిక కావచ్చు… కానీ కసబ్ కన్నా మనలో బలపడుతున్న క్రూయాలిటీని చంపేయడం చాలా చాలా అత్యవసరం.
కసబ్ మనుషుల్ని చంపేశాడు.. మరి మనం మన నెగిటివ్ థాట్స్ తో ఎంతమంది మనస్సుల్ని చంపేస్తున్నాం? వీటికి ఉరి శిక్షలుండవా?
ఇక్కడ కసబ్ గురించి కాసేపు పక్కనబెడదాం. తప్పు దారులు పట్టిన మనుషుల్ని కౌన్సిలింగ్ చేసి.. ఆలోచనలు సరిచేస్తే మన కన్నా అద్భుతమైన మానవతామూర్తులుగా మారతారు. ఇది నేను ప్రాక్టికల్‌గా ఒకరిద్దరి విషయంలో చూశాను. కానీ ఆ కొద్దిపాటి ఓపికే మనకు ఉండట్లేదు.
మనుషుల్లో ద్వేషం విపరీతంగా పెంచేయబడుతోంది… మానవత్వాన్ని హైలైట్ చేసే ఒక్క మీడియా సంస్థని చూపించండి…. ద్వేషం, ఆగ్రహం లాంటి నెగిటివ్ ఎమోషన్లని చాలా త్వరగా మోసుకుతిరుగుతాం అని అందరికీ మీడియా సంస్థలకు బాగా తెలుసు. ఈరోజు మనం వివిధ విషయాలపై ప్రదర్శిస్తున్న కోపం కొన్నేళ్ల క్రితం ఇంతగా లేదు. అకస్మాత్తుగా మన కోపం కట్టలు తెచ్చుకోవడానికి కారణం హైపర్ సెన్సిటివిటీ…. ఈ హైపర్ సెన్సిటివిటీని పెంచడంలో మీడియా చాలా రోల్ ప్లే చేస్తోంది…
మనుషుల్ని సరిచేసే మెచ్యూరిటీని.. మనుషుల్ని అక్కున చేర్చుకునే మంచితనాన్నీ సమాజానికి నేర్పించాలి తప్ప మనుషుల్ని "చంపేయమనేటంత ఆగ్రహం కట్టలు తెంచుకునే" ఎమోషన్లని ప్రేరేపించకూడదు. ఈ ఎమోషన్లు రేపు మనల్ని చంపేయడానికీ వెనుకాడవు.
గమనిక: ఇందులో కసబ్ గురించి నాకు ప్రత్యేకమైన concern లేదు, జనరలైజ్డ్ గా హ్యూమన్ బిహేవియర్ లో వస్తున్న మార్పుల్ని రాశాను.
– నల్లమోతు శ్రీధర్
ఎడిటర్
కంప్యూటర్ ఎరా తెలుగు మేగజైన్
Well said Sridhar garu. Kasab was just a tool . We have tons of tools like kasab not in the perspective of terrorism but in many negative aspects around and among us .
Well said sir… @ DD days we thought that private media Can show us the reality in news but these new channels are behaving like they don’t have any responsibility.