ఒక వ్యక్తి మనతో కఠినంగా ఉంటే, మోసం చేస్తుంటే మనమూ అలాగే గట్టిగా సమాధానం చెప్పాలి అని చాలామంది భావిస్తుంటారు.
క్వాంటమ్ ఫీల్డ్‌లో ఎనర్జీస్ ఎలా మేనిఫెస్ట్ అవుతాయో తెలిసిన వారెవరూ ఎదుటి వ్యక్తి ఎనర్జీని మ్యాచ్ చేసేలా తమ ఎనర్జీనీ, కాన్షియస్నెస్నీ ప్రభావితం చేసుకోరు. తమ కాన్షియస్నెస్ నిరంతరం హైయ్యర్ వేవ్‌లెంగ్త్‌లో ఉండేలా కాపాడుకుంటారు.
ఉదా.కి.. ఒక వ్యక్తి మిమ్మల్ని మోసం చెయ్యాలి అనే ఆలోచనలో ఉన్నాడు అనుకోండి. అప్పటి వరకూ ప్రపంచంలో ప్రతీ మనిషీ చాలా మంచి వాళ్లు, అందర్నీ ప్రేమించాలి.. అన్ కండిషనల్‌గా ఉండాలి అనే ఫ్రీక్వెన్సీలో మీరు ఉన్నారు అనుకోండి.
ఇప్పుడు అతను మిమ్మల్ని మేనిప్యులేట్ చేస్తున్నాడు అన్న డౌట్ వచ్చిన వెంటనే మన బ్రెయిన్లో లింబిక్ సిస్టమ్‌లో న్యూరల్ యాక్టివిటీ జరిగి, అన్ కాన్షియస్ టెండెన్సీలో “ఇంత మంచిగా ఉన్న నన్నే మోసం చేస్తాడా, అతని సంగతి చూస్తాను” అని ఆవేశంగా రెస్పాండ్ అవుతుంది.
అలా ఆవేశంగా వచ్చే ఆలోచనా (ఎలక్ట్రిక్) + దానితో పాటు శరీరంలో పెరిగే స్ట్రెస్ హార్మోన్ (మేగ్నటిక్) + అతని గురించి కోపంగా మనం మాట్లాడే మాటలు (Actions) ఈ మూడు కలిసి క్వాంటమ్ ఫీల్డ్‌లోకి మీ యొక్క ప్రొజెక్షన్స్గా వెదజల్లబడతాయి.
ఈ తరహా రెస్పాన్స్ వల్ల అప్పటి వరకూ అన్ కండిషనల్ లవ్‌తో అదే రకమైన మ్యాచింగ్ ఎనర్జీతో అందరితో ప్రేమగా ఉంటూ, అందరి ప్రేమని పొందుతూ వస్తున్న మీరు.. అప్పటి నుండి మీరు ప్రొజెక్ట్ చేస్తున్న కోపం, ద్వేషం అనే మ్యాచింగ్ ఎనర్జీని ఆకర్షించడం మొదలుపెడతారు. దీంతో చిరాకు పెట్టే సంఘటనలు పెరగడం మొదలవుతాయి.
అందుకే ఎన్విరాన్మెంట్ ఎలా ఉన్నా, అందులో ఇతరుల ప్రవర్తన ద్వారా రకరకాల ట్రిగ్గరింగ్ ఫ్యాక్టర్స్ ఉన్నా వాటిని స్వీకరించి మీ అంతర్గత ప్రపంచాన్ని అశాంతిగా మార్చుకుని, ఆ వైబ్రేషన్స్‌ని విశ్వంలోకి వెదజల్లి అదే అశాంతితో కూడిన ఫలితాలను మూటగట్టుకోకండి. ఎప్పుడూ హృదయంలో చిరునవ్వు చెరగనీయకండి. మోసం చేసే వ్యక్తి మేనిప్యులేటెడ్ థాట్స్ అతని వైబ్రేషన్, అది అతనికి ఏదో రూపంలో మేనిఫెస్ట్ అవకుండా పోదు. దాని గురించి అస్సలు మీకు ఆలోచన కూడా అవసరం లేదు. జస్ట్ అతనికి దూరంగా ఉంటే చాలు. హృదయంలో స్వచ్ఛమైన చిరునవ్వు అట్టిపెట్టుకోండి అంతే!
– Sridhar Nallamothu