మనం తినడం ఆపం…
అలా తినడం వల్ల శక్తి వస్తుంది…
అలా వచ్చిన శక్తిని శారీరక శ్రమతో ఖర్చుపెట్టడం ఎప్పుడో మర్చిపోయాం…
సో.. శక్తి శరీరం మొత్తానికీ distribute అవ్వాల్సింది కాస్తా.. బ్రెయిన్‌కి ఎక్కువ pump చెయ్యబడుతూ ఉంది…
తత్ఫలితంగా.. నిర్జీవ శరీరాలూ, అమోఘమైన మేధస్సు కలిగిన బ్రెయిన్స్ కాంబినేషన్‌గా మనం మిగులుతున్నాం…
ఒళ్లొంచి కష్టపడేవాడికి బ్రెయిన్లో పెద్దగా ఆలోచనలు ఉండవు… మనబోటి వాళ్లం కూర్చోబెట్టి.. ఆ సోదీ.. ఈసోదీ చెప్పబోతున్నా… ఓ చిరాకు ఎక్స్ప్రెషన్ పెట్టేసి… వెళ్లి హాయిగా నిద్రపోతాడు…
అదే బుర్ర నిండా ఆలోచనలు ఉన్న వాడికి ఓ నాలుగు అడుగులు లేని మంచి నీళ్లు తాగాలన్నా బద్ధకమే….!
————————————-
సో ఫార్ములా ఏంటంటే…
కడుపునిండా తింటే… తిన్న దాని ద్వారా వచ్చే కేలరీలు ఖర్చవ్వాలంటే శరీరమైనా పనిచేయాలి, బ్రెయిన్ అయినా పనిచేయాలి.
మనకు శరీరాలు పనిచేయడం లేదు కాబట్టి… ఆర్గ్యుమెంట్లు, లాజిక్లూ, గొడవలూ, కొట్లాటలూ, తేల్చుకోవడాలూ… వంటి అనేక అంతర్జాతీయ సమస్యలతో బ్రెయిన్‌తో పనిచేస్తున్నాం…
ఒకవేళ శరీరాలూ పనిచెయ్యకా, బ్రెయినూ పనిచెయ్యని జనాలు కొందరు ఉంటారు… వాళ్లకు అస్సలు తినడానికి అన్నం కూడా సహించకపోవడం మీరు ప్రాక్టికల్‌గా చూడొచ్చు.
నా అబ్జర్వేషన్లో తేలిన విషయం ఇది.
సో శక్తి ఖర్చుపెట్టబడడం కోసం… వచ్చే ఆలోచనలూ, మేధస్సే తప్ప… ఓ పూట తినకపోతే… ఆకలితో కడుపు మండి… నీరసించిపోతే… లేదా ఆరోగ్యం బాలేకపోతే… మన మేధస్సుూ, లాజిక్లూ… అన్నీ హుష్‌కాకి అయిపోతాయి… 😛
– నల్లమోతు శ్రీధర్
super.
wow…. 🙂
ఆలోచిస్తోంటే అర్థమౌతోంది, మీరు చెప్పింది నిజమే. ఇకనుండీ రెండింటినీ బాలెన్స్ చేయడానికి ప్రయత్నిస్తాను. ఏమౌతుందో చుద్దాం.
“ఓ పూట తినకపోతే… ఆకలితో కడుపు మండి… నీరసించిపోతే… లేదా ఆరోగ్యం బాలేకపోతే… మన మేధస్సుూ, లాజిక్లూ… అన్నీ హుష్‌కాకి అయిపోతాయి”—ఇది బాగుందండీ.