మనం సృష్టిలో చూసే పదార్థం (మేటర్) మొత్తం శబ్ధం, కాంతి, రూపం ఆధారంగా తయారవుతుంది. పాజిటివ్, నెగిటివ్, న్యూట్రల్ ఎనర్జీస్ ఒక త్రికోణంగా ఏర్పడ్డప్పుడు అది మేటర్‌గా మారుతుంది.
మనం చూస్తున్నది థర్డ్ డైమెన్షన్ ప్రపంచం అని చాలామందికి తెలిసిందే. ఏకత్వంలో ఒక బిందువుగా ఉన్న ఎనర్జీ (ఫస్ట్ డైమెన్షన్) తనని తాను వ్యక్తపరుచుకోవాలి అని ప్రయత్నించినప్పుడు అది పాజిటివ్, నెగిటివ్ ఎనర్జీస్గా సెకండ్ డైమెన్షన్‌లోకి మారిపోయింది. ప్రతీ శక్తీ ఇలా పాజిటివ్‌గానూ, నెగిటివ్‌గానూ కేంద్ర స్థానం నుండి విడిపోయి సుదూరంగా ప్రయాణించడం మొదలుపెట్టాయి. మనకు అర్థమయ్యే భాషలో చెప్పాలంటే ఫలానా విషయాలు మంచి, ఫలానా విషయాలు చెడూ అని వ్యక్తులు, విలువలు, సిద్ధాంతాలు ఇలా రకరకాల రూపాల్లో విశ్వం తనని తాను వేరు చేసుకుంటూ పోయింది.
ఇప్పుడు పాజిటివ్ ఎనర్జీ అని భావించబడేది నెగిటివ్ ఎనర్జీ ఒకటి ఉందని తెలుసుకోదు. తనలో తానే ఉండిపోతుంది. ఒకవేళ నెగిటివ్ ఎనర్జీ ఉందని తెలుసుకున్నా దానితో ఘర్షణకు గురవుతూ ఉంటుంది. అలాగే నెగిటివ్ ఎనర్జీ అనేది పాజిటివ్ ఎనర్జీతో ఇలా నిరంతరం ఘర్షణకు గురవుతూనే ఉంటుంది. ఇలా దేనికది వేరుపడి రకరకాల రూపాల్లోకి మారిపోయి ఒకదానితో మరొకటి సంబంధం లేని విధంగా పెనవేసుకుపోయిన ఈ పాజిటివ్, నెగిటివ్ అనే రెండు రకాల ఎనర్జీస్‌ని మధ్యలో ఉండే న్యూట్రాలిటీ తన వైపు లాక్కోవడం మొదలుపెట్టింది. వాస్తవానికి ఈ పాజిటివ్, నెగిటివ్ ఎనర్జీస్ ఎక్కడ నుండి మొదలయ్యాయి అంటే ఫస్ట్ డైమెన్షన్లో ఉన్న బిందువు ఆ న్యూట్రల్ ఎనర్జీ మాత్రమే. కాబట్టి సంబంధం లేకుండా దేనికది విడిపోయి దూరంగా వెళుతున్న పాజిటివ్, నెగిటివ్ ఎనర్జీస్‌ని కేంద్ర స్థానం బలంగా తన వైపు లాక్కోవడం మొదలుపెట్టినప్పుడు ఆ ఫోర్స్‌ని బట్టి దూరంగా ఉన్న స్థానం నుండి కేంద్రకం వైపు వచ్చే పాజిటివ్, నెగిటివ్ ఎనర్జీస్ తరంగాలుగా మారడం మొదలుపెట్టాయి. ఆ తరంగాలే అవి కేంద్ర స్థానం నుండి ఎంత దూరంలో ఉన్నాయి కేంద్ర స్థానానికి ఎప్పటికి చేరుకుంటాయి అన్న దాన్ని బట్టి సమయం (టైమ్) అనేది మొదలైంది.
ఇక్కడ మళ్లీ అర్థమయ్యే భాషలో చెబుతాను. మనుషులంతా మంచోళ్లు అని కొంతమంది భావిస్తారు.. వాళ్లు పాజిటివ్ ఎనర్జీ వైపు ఉన్నారు అనుకోండి. మనుషులంతా చెడ్డ వాళ్లు అని మరికొందరు భావిస్తారు. వీళ్లు నెగిటివ్ ఎనర్జీలో ఉన్నారు అనుకోండి. ఏ వ్యక్తి అయితే రెండు చివర్ల ఉన్న ఈ రెండు రకాల ఎనర్జీస్‌లో ఉండిపోకుండా త్రికోణంలో పై భాగం మాదిరిగా హైయ్యర్ కాన్షియస్నెస్కి చేరుకుని, న్యూట్రాలిటీకి చేరుకుని, మంచీ, చెడూ రెండు డైమెన్షన్స్ ఏమీ లేవు, రెండూ ఒకటే, రెండూ ఎనర్జీలోని రెండు రకాల వ్యక్తీకరణలే అని గ్రహిస్తాడో, పాజిటివ్నీ, నెగిటివ్నీ సమానంగా చూస్తాడో అతను ఆ త్రికోణాన్ని చేధించినట్లు లెక్క. మంచి వైపు కొంత ప్రయాణం చేసీ, చెడు వైపు కొంత ప్రయాణం చేసీ.. తన మానసిక శక్తులతో, మెడిటేషన్ వంటి అభ్యాసాలతో న్యూట్రాలిటీని సాధించడానికి కొంత వయస్సు, సమయం పడుతుంది కాబట్టి టైమ్ అనేది ఉనికిలోకి వచ్చింది. అన్నీ వేర్వేరు అనే స్థితి నుండి కాన్షియస్నెస్ అంతా ఒకటే అనే స్థితికి రావడానికి ఒక సోల్‌కి పట్టే సమయమే టైమ్. కొందరికి ఆ టైమ్ కుదించుకుపోతుంది, కొందరికి కొన్ని జీవిత కాలాలు అవసరం అవుతుంది. పాజిటివ్, నెగిటివ్ రెండు భిన్న దిక్కుల నుండి కేంద్ర స్థానం అయిన న్యూట్రాలిటీ వైపుకి చేరుకునేటప్పుడు ఎనర్జీలో ఏర్పడే వైబ్రేషన్స్నే టైమ్ అంటున్నాం కదా.. ఆ టైమ్ సముద్రంలో తరంగాల మాదిరిగా ఉంటుంది. ఎనర్జీ నెగిటివ్, పాజిటివ్‌ల నుండి న్యూట్రాలిటీ వైపు కదిలే కొద్దీ ప్రతీ కదలికా ఒక్కో విభిన్నమైన వైబ్రేషన్ కలిగి ఉంటుంది, అలలు ఎగుడు దిగుడులా ఎలా ఉంటాయో అలా! అంటే మనిషి భిన్నత్వం నుండి ఏకత్వం వైపు ప్రయాణించే కొద్దీ రకరకాల అనుభవాలు, పర్సెప్షన్స్, వాటికి తగ్గట్లు తన వైబ్రేషన్స్ మారిపోయి చివరకు గమ్యమైన న్యూట్రాలిటీకి చేరుకుంటాడు.
మరో భాగంలో మరింత వివరంగా రాస్తాను.
- Sridhar Nallamothu