క్యారెక్టర్ ఎంట్రీ..
పెర్ఫార్మెన్స్…
Exit అంతే లైఫ్…!!
ఎంట్రీకీ, Exitకీ మధ్యనే లైఫ్ ఎలాగుండాలన్నది డిజైన్ చేసుకోవలసింది…
నాకు ఊహ తెలిశాక, కొద్దిగా ఆలోచనంటూ సంతరించుకున్నాక ప్రతీ బర్త్‌డేకీ తప్పనిసరిగా గుర్తుంచుకునే Fact ఇది….
మరోసారి ఈ సత్యాన్ని బలంగా మనస్సులోకి తీసుకోవలసిన సమయం వచ్చింది…. కొన్ని గంటల్లో!!
———————–
"మీరు ఇలాగే ఎందుకుంటారూ.. ఎప్పుడూ సీరియస్ విషయాలే మాట్లాడతారూ, రాస్తారూ.. లైఫ్ ఎంజాయ్ చేయడం తెలీదా…" అని చాలామంది నా గురించి పై పైన తెలిసిన వాళ్లు అనుకోవడం నాకు తెలుసు… 🙂 సమాధానం ఇదే నవ్వు…. ఎప్పుడు దేన్ని, ఎలా ఎంజాయ్ చేయాలో తెలిస్తే చాలు…. ప్లస్ సీరియస్ విషయాలు మాట్లాడేటంత మాత్రాన మనిషి సీరియస్ మనిషైపోరు…. ఒక్కసారి స్వయంగా చూసిన వాళ్లకు అర్థమవుతుంది నా ఛైల్డిష్ నేచర్…
నేను ఎందుకు సీరియస్ విషయాలు మాత్రమే రాస్తుంటానంటే….. సమాధానం పై 3 లైన్లలోనే ఉంది…
సుఖంగా బ్రతకడానికి గోల్డెన్ స్ఫూన్ లైఫ్ నాకు ఇవ్వబడలేదు…
రకరకాల కష్టాలూ, అడ్డంకులూ ముందు పెట్టి… ముళ్లు తప్పించుకుంటూ ముందుకు ఎలా వెళతావో చూస్తానంటూ…. ఛాలెంజింగ్‌గా ఇవ్వబడింది నా లైఫ్. అలాగని భగవంతుడు నన్ను వదిలేయలేదు… నేను కష్టపడ్డానూ, ప్రతీ కష్టంలోనూ ఆదుకుంటూనే ఉన్నాడు, నేను పడ్డ కష్టానికి తగ్గ ఆలోచననీ, జ్ఞానాన్నీ… జీవితం అంటే ఏమిటో ఓ స్పష్టమైన అవగాహననీ భగవంతుడు ప్రసాదించాడు….
పొలం పనులు చేసినా, డ్రగ్స్‌కి రెండేళ్లు అలవాటు పడిపోయినా… అనేకసార్లు సూయిసైడ్ ఎటెమ్ట్లు చేసుకున్నా… బయటపడి కెరీర్ మలుచుకున్నా… సొసైటీకి ఏదో ఒకటి చేయాలన్న కసిని పెంచుకున్నా…. ఓ లక్ష్యాన్ని నిర్దేశించుకుని… మొండిగా దాని కోసం పనిచేసుకుంటూ వెళ్తున్నా… సినిమా ఫీల్డ్‌లో అందరు పెద్ద పెద్ద హీరోలను ఇంటర్వ్యూలు చేసినా… మొట్టమొదటి తెలుగు సాంకేతిక సాహిత్యపు రచయితగా గుర్తింపు పొందినా.. టివి ప్రోగ్రాములు చేస్తున్నా… సెమినార్లు, టెక్నికల్ వీడియోలూ చేస్తున్నా…. అన్నీ అనుకోని మజిలీలే….
ఇంత విభిన్నమైన జీవితశైలిని పొందడానికి మించిన థ్రిల్ నాకు ఏ అతి సాధారణ కాఫీడే మీట్లలోనూ కన్పించదు…. అయినా దాన్నీ నేను ఎంజాయ్ చెయ్యగలను… బికాజ్ ఎంజాయ్మెంట్ సోర్స్ కోడ్‌తో నా మైండ్‌లో ప్రోగ్రామ్ ఎప్పుడో చేసేసుకున్నాను… అందు వల్లనే శూన్యంలో నుండి ఎన్నోసార్లు ఆశనీ సృష్టించుకోగలిగాను…. ఇదంతా నా గొప్పదనం కాదు… భగవంతుడు నా ముందు పెట్టిన పెక్యులియర్ లైఫ్ గొప్పదనం… భగవంతుడి గొప్పదనం!
మళ్లీ అస్సలు విషయంలోకి వెళితే… నేను స్వయంగా నా లైఫ్‌ని ఎంత ఎంజాయ్ చేస్తున్నా… నాకంటూ ఓ సోషల్ రెస్పాన్సిబులిటీ ఉంది… నా లక్ష్యం ఆ సోషల్ రెస్పాన్సిబులిటీ చుట్టూనే define చేసుకోబడింది…
చిన్నప్పుడు.. క్లాసులో ప్రతీ మనిషికీ లక్ష్యాలు ఉండాలని చదువుకునేటప్పుడు… లక్ష్యమంటే ఏమిటో తెలీక ఇదెక్కడి గోల అన్పించేది…. తర్వాతర్వాత దాని బలమూ, మన లక్ష్యం మనల్ని ఎంత కష్టపెడుతుందీ, ఎంత ఉన్నతంగా మలుస్తుందీ అనుభవపూర్వకంగా తెలుసుకుంటూ వచ్చాక.. నాకు లక్ష్యమంటే చాలా గౌరవం ఏర్పడింది…
పదిరోజులు కొత్త మోజు కొద్దీ ఫ్రెండ్షిప్ చేసి.. మోజు తీరిపోయి మానేసేటంత బలహీనమైనది కాదు లక్ష్యమంటే….!!
ఏరోజునైతే నేను ఈ సమాజంచే బాధించబడ్డానో ఆరోజే డిసైడ్ అయ్యాను… ఈ సమాజానికి ఏదైనా చేయాలి… నా కసి అలా ప్రొడక్టివ్గానైనా తీరాలి" అని! అందుకే 16 సంవత్సరాలుగా అదే పట్టుదలతో పనిచేస్తున్నా…..
కొన్ని కష్టాలూ, నష్టాలూ, విచారాలూ… మామూలే అనుకుంటే….
"నిజంగా ఈరోజు నా జీవితం మీద నాకు చాలా చాలా గౌరవం ఏర్పడింది… లక్షమందిలో ఒక్కరికైనా ఉపయోగపడ్డాను, పడుతున్నానన్న సంతృప్తి దక్కుతోంది…."
ఎన్ని సెలబ్రేషన్లు చేసుకుంటే ఇంత సంతోషాన్ని… వెనక్కి తిరిగి చూసుకుంటే జీవితం పట్ల మరింత పెరిగిన గౌరవాన్నీ…. ఫిజికల్ సెన్స్‌లో వ్యక్తపరచగలం?
నిజ్జంగా ఇలాంటి విభిన్నమైన జీవితం దక్కినందుకు గర్వంగా అన్పిస్తోంది….
ధన్యవాదాలు
– నల్లమోతు శ్రీధర్
ఎడిటర్
కంప్యూటర్ ఎరా తెలుగు మేగజైన్
Leave a Reply