"చదువు అయిపోయింది…."
………
ఫినిష్డ్.. లైఫ్‌లో ఓ బోరింగ్ ఎపిసోడ్ పూర్తయినంత ఆనందం… అవీ ఇవీ తంటాలు పడి ఉద్యోగం సంపాదిస్తే చాలు…
….
మనందరం దీన్ని క్రాస్ చేసిన వాళ్లమే, చేయబోతున్న వాళ్లమే…
ఎడ్యుకేషన్ అనేది స్కూల్ ఎక్సర్‌సైజులతో, కాలేజ్ బోరింగ్ లెక్చర్లతో పూర్తయిందనిపించే ఓ ట్రాజిక్ ఫేజ్ మనకు లైఫ్‌లో! చచ్చీ చెడీ ఒకసారి దాన్ని ఫినిష్ చేస్తే చాలు ఇక లైఫంతా చాలా ప్రశాంతంగా ఉండొచ్చన్న బండ బరువు చదువంటే 🙂
ఒక్కసారి దాన్ని దాటొచ్చాక… లైఫ్‌లో ఎప్పుడైనా ఖాళీ టైమ్‌లో ఏదైనా కోర్స్ చేద్దామన్న థాటే రాదు… వచ్చినా ఒళ్లు విరుచుకుని.. పెదాలు విరిచేసి ఆముదం తాగిన ఫేస్ పెట్టేస్తాం 🙂
మళ్లీ చదవాలంటే మనకు ఓ బలమైన కారణం కావాలి… మరింత సేలరీ వచ్చే అవకాశమైనా ఉండాలి, లేదా మరిన్ని అవకాశాలు సృష్టించబడేలా అయినా అయి ఉండాలి…. ఇలాంటి ఏ కారణం లేకపోతే "ఎందుకు చదవాలి" అని మొండిగానే అనేస్తాం కూడా!! 🙂
మేథ్స్, ఫిజిక్స్, కెమిస్ట్రీ, ఇంగ్లీష్, డ్రాయింగ్, పెయింటింగ్ వంటివి స్కూళ్లల్లో, కాలేజీల్లో ఎందుకు నేర్చుకున్నామో తెలీదు, అవి నిజ జీవితానికి ఎలా పనికొస్తాయో కూడా తెలీదు.. బలవంతంగా స్కూల్లో, కాలేజీల్లో చేర్పించారు కాబట్టి ముక్కీ మూలిగీ చదవక తప్పలేదు.
ఇప్పుడు మాత్రం "ఏ సబ్జెక్ట్ అయినా ఎందుకు నేర్చుకోవాలి?", "అస్సలు మళ్లీ చదవాల్సిన ఖర్మేం పట్టింది" అని ఖచ్చితంగా అన్పిస్తుంది… బికాజ్ మన లైఫ్ ఇప్పుడు మన కంట్రోల్లో ఉంది… సో చదవకపోయినా అడిగే వాళ్లేం లేరు, తిట్టే వాళ్లేం లేరు.
అకడమిక్ చదువులు పక్కనబెడితే… హాపీగా డ్యాన్స్ నేర్చుకోవచ్చు, కరాటే నేర్చుకోవచ్చు… స్పోకెన్ ఇంగ్లీష్ క్లాసులకు వెళ్లొచ్చు, కంప్యూటర్ నేర్చుకోవచ్చు… చాలానే చేయొచ్చు.. బట్ మనకు నామోషీ! ఇంత వయస్సు వచ్చీ పెన్నూ, పుస్తకం పట్టుకుని ఎక్కడికో వెళ్లేదేమిటన్న చిన్నచూపు, క్లాసులో చిన్న వయస్సు వాళ్లతో కలిసిపోలేమన్న బిడియమూ!
"మీరు కంప్యూటర్ క్లాసులేమైనా పెడితే బాగుణ్ణు శ్రీధర్ గారు… వచ్చి నేర్చుకుంటాం.." అని ఈ ఐదారేళ్లలో కొన్ని వందల మంది గృహిణులు, రిటైర్డ్ ఉద్యోగులూ అడిగిన వారున్నారు.. వారందరి సమస్యా పైన చెప్పిందే!
ఇలా కాస్తో కూస్తో ఇంట్రెస్ట్ ఉన్న వాళ్లని పక్కన బెడితే 90% మందికి ఒక్కటే ఫీలింగ్.. "లైఫ్ అయిపోయింది"…. అని! 🙂 అరే బాబా…. ఏం చూశామని లైఫ్ అయిపోయిందనుకుంటున్నామో అర్థం కాదు… వెధవ రొటీన్ షెడ్యూల్స్‌తో బోరింగ్‌గా లైఫ్‌ని లీడ్ చెయ్యకపోతే కాస్తంత కొత్త విషయాలు నేర్చుకుంటూ ఎందుకు లైఫ్‌ని ఎంజాయ్ చెయ్యకూడదు?
బ్రెయిన్‌కి తాళాలు వేసుకుని.. నాకు ఇంకేం వద్దు… అని కూర్చుంటే ఎవరొచ్చి మన బ్రతుకుని ఉల్లాసంగా ఉండేలా మార్చగలుగుతారు?
చదవడానికి బద్ధకం… ఆడడానికి ఒళ్లొంగదు… పనులు చేయడానికి కందిపోతాం…. ఇంకెందుకో అర్థం కావు… పనిలేక క్షీణించిపోయే కణజాలంతో శల్యమవుతున్న ఈ జీవితాలు!!
గమనిక: ఇంతా రాసి నేను ఫాలో అవుతున్నానా అని కొందరు మొదటే డౌట్ పడొచ్చు…. 🙂 నా వరకూ నేను పూర్తయిన నా ICWAIతో పాటు CS, CA కూడా చేద్దామన్న ఆలోచనలో ఉన్నాను, అలాగే కొన్ని హాబీ ఏక్టివిటీస్ కల్టివేట్ చేసుకునే పనిలో ఉన్నాను.
గమనిక: ఇది ఎవరికైనా పనికొస్తుంది అన్పిస్తే ఇతరులతోనూ షేర్ చెయ్యగలరు.
ధన్యవాదాలు
– నల్లమోతు శ్రీధర్
ఎడిటర్
కంప్యూటర్ ఎరా తెలుగు మేగజైన్
http://computerera.co.in
http://youtube.com/nallamothu
http://nallamothusridhar.com
good one. నేను ఇంటర్ మధ్యలో ఆపినదానిని ఓ మిత్రుడి ప్రోద్బలంతో ప్రైవేటుగా ప్రాక్టికల్స్‌తో సహా పూర్తి చేసి , తరువాత్ డిస్టన్స్ ఎడ్యుకేషన్‌లో బీ.ఏ పూర్తి చేశాను. ఇంటిదగ్గరే ఉండి కంప్యూటర్ నేర్చుకున్నాను. నిట్ వారి బుక్స్ గురువుగా చేసుకుని. వీలయితే ఎం.ఏ చేయాలనుంది. ఇంగ్లీషు నేరుచుకోవాలనుంది. మన విద్యా విధానం లో మార్పుకోసం పోరాడాలి. ఈ లోగా అందరూ చదువు అంటే ఉద్యోగం కోసమని కాకుండా, ఏ వయసులో అయినా చదవడం , వీలైనవన్నీ నేర్చుకోవడం చేయాలి. మంచి ఆర్టికల్ శ్రీధర్ గారు.
ha ha 🙂