ఎన్నయినా చెప్పండి… మనం చేసింది మంచైతే మంచీ, చెడైతే చెడూ ఇవ్వాళో రేపో ఏదో ఓ రూపంలో కాపాడతాయీ, వెంటాయతాయీ!!
మన తోటి మనుషులకు మంచి చేయడం వల్ల తక్షణ ఫలితంగా బాధ లభిస్తే.. ఆ బాధ కన్నా ఎన్నో రెట్ల ఆనందం జీవితంలో ఏ మూలనో ఖచ్చితంగా పలకరిస్తుంది.
మన తోటి మనుషులకు చెడు చేయడం వల్ల తక్షణ ఫలితంగా పైశాచికానందం కలిగితే అంతకు కొన్ని రెట్ల కష్టమూ తరిమి తరిమి వెంటాడకపోదు.
"ఇదంతా ట్రాష్… అందర్నీ బాధపెట్టిన వాడు ఎంత సుఖపడిపోవట్లేదూ" అని పెదవి విరిచేస్తారు కొందరు. సుఖమూ, ఆనందమూ, బాధా మనకు పైకి కన్పించేవి కాదు.. చెప్పుకోలేని బాధల్ని కూడా దిగమింగుకుని నవ్వు నటించే జీవితాలు మనవి.
"ఏది మంచో ఏది చెడో మనమెలా చెప్పగలం.." అంటూ మంచీ, చెడుల classification వద్దే క్లారిటీ కోల్పోయే వాళ్లు కొందరు… అంత కన్ ఫ్యూజన్ అవసరం లేదు.. మనస్సుల్ని సంతోషపెట్టేది మంచీ.. మనస్సుల్ని గాయపరిచేది చెడూ! మనం చేసే ప్రతీ పనీ ఈ రెండు కోవల్లో ఏ కోవకు చెందుతుందో ఎప్పటికప్పుడు confirm చేసుకుంటే చాలు… అదే క్లారిటీ వస్తుంది.
ఈ మంచీ చెడుల గురించి ప్రస్తావనల్నీ, వాటి పర్యవసానాల్నీ కర్మ సిద్ధాంతం అని పేరు పెట్టేసుకుంటారు కొందరు… నా వరకూ దీన్ని తప్పించుకోలేని ప్రకృతి నియమంగానే భావిస్తాను.
– నల్లమోతు శ్రీధర్
ఎడిటర్
కంప్యూటర్ ఎరా తెలుగు మేగజైన్
http://computerera.co.in
http://youtube.com/nallamothu
http://nallamothusridhar.com
sir, i am shiva prasad , from kurnool, i’m one your followers in fb and you tube. your videos and stats are very helpful to almost every one. i have some doubts but i dont know how to contact you. my doubt is regarding part time jobs on internet. nenu inter 2nd year chaduvuthunnanu . chala varaku naa snehitthulu, naa lage money avasarm vacho leka samayam vrudha avuthundano summer holidays lo part time jobs cheyalani anukunnam. andu kasam internet lo search chesi chusanu, kani upayogam ledu. online jobs cheyalante konni sites registration fee adugu thunnayi . alage chala varaku online part time jobs spam ani konni web sites lo chadivanu . ee vishayam pai mee amulya maina salaha koruthunnanu, veelithe youtube lo video kuda pettandi, adi naa lanti yuvatha ku chala upayoga paduthundi……
thank you.