ఆడవాళ్లు.. కేవలం “ఆడవాళ్లు మాత్రమే” అని ఓ సెక్సువల్ దృక్పధంలో ఇరికించేస్తున్నాం…
సున్నితత్వం చచ్చిపోయిన తరానికి వారిలోని సున్నితపు ఆలోచనలు తలకెక్కవు..
వారి థాట్ ప్రాసెస్‌లోని కాంప్లెక్సిటీ అర్థమే కాదు…
వారు తలుచుకుంటే ఏ పర్సనాలిటీ డెవలప్మెంట్ ట్రైనర్ వారికి సరిరారు… యెస్ ఎందరో జీవితాల్ని ఇన్స్పైర్ చేసిన ఆడవాళ్లని నేను చూశాను.. తమ స్వార్థం పక్కనపెట్టి తాము అభిమానించే ఫ్యామిలీ మెంబర్స్ కోసం కావచ్చు… ఫ్రెండ్స్ కోసం కావచ్చు… చాలానే ఆలోచించే.. స్థైర్యాన్నిచ్చే వాళ్లున్నారు…..
కానీ మన ఇరుకు ఆలోచనలతో Male, Female అనే జెండర్ల మధ్య ఓన్లీ సెక్సువల్ ఆలోచనలు మాత్రమే ఎక్కువ ఎస్టాబ్లిష్ చేసి పారేస్తున్నాం.. దాంతో తమ సహజసిద్ధమైన సున్నితత్వాన్నీ, ఎవరికీ అర్థం కాని సంక్లిష్టమైన భావాల్నీ తొక్కిపెట్టుకుంటూ డిఫెన్స్‌లో బ్రతికేస్తున్న వాళ్లెందరో ఉన్నారు…
——————-
ఇప్పటితరపు ఆలోచనలైతే అపోజిట్ సెక్స్ పట్ల ఉంటే ప్రేమా, లేదంటే ద్వేషం తప్పించి ఇంకేమీ మిగలనంతగా పొల్యూట్ అయిపోతున్నాయి… అయితే extreme ప్రేమించడం.. లేదంటే అమ్మాయిలను అబ్బాయిలూ, అబ్బాయిలను అమ్మాయిలూ ఇష్టమొచ్చినట్లు అవకాశవాదంగా వాడేసుకోవడం…. crucial essence of relationships మిస్ అవుతున్నాయి….
సెన్సిటివ్‌గా ఉండడం అంటే కామెడీ మన కొత్త తరాలకు! కామెడీ చేసి పారేసుకుంటారు… తాము చాలా ఫాస్ట్ అన్న గర్వం ప్రతీ ఒక్కరికీ… సో రిలేషన్లలో ఏ ఒక్క సెన్సిటివ్ ఫీలూ ఎలివేట్ కాదు… ఒకరి సెన్సిటివ్ ఫీలింగ్స్‌ని మరొకరు గుర్తించరు.. బ్లైండ్‌గా కొట్టి పారేస్తారు… దాంతో అవతలి వ్యక్తిలోని సెన్సిటివిటీ కూడా చచ్చిపోతుంది…
—————–
ఓ చిన్న కన్నీటి చుక్కని కూడా, ఓ చిన్న దిగులుని కూడా భరించలేనంత అసహనం మనకు ఇప్పుడు!!
సెన్సిటివ్‌గా, సెంటిమెంటల్‌గా ఉండడం అంటే పాత చింతకాయ పచ్చడిలా మిగిలి పోయిన రోజుల్లో ఎవరి మొహాల్లోని దిగులూ, concern, కేరింగ్, ఇన్స్పిరేషన్ ఎవరికీ అర్థం కావట్లా.. ఏదో గుడ్డిగా బ్రతికేస్తున్నారు.
బేసికల్‌గా ఒకప్పుడు సున్నితత్వానికి కేరాఫ్ అడ్రస్‌గా ఉండే female జెండర్ సైతం వ్యక్తిత్వం పేరుతో అవసరం లేని చోట కూడా మొండితనాన్ని పుణికి పుచ్చుకుంటోంది..
దాంతో ఎక్కడ చూసినా కట్ చేసినా తెగని కోహినూర్ వజ్రాలే కన్పిస్తున్నాయి తప్పించి మాటలకూ, చూపులకూ కరిగిపోయే మనస్సులు మిగలకుండా పోతున్నాయి….
——————-
జెండర్ స్పెసిఫిక్‌గా ఓ జెండర్‌ని సెక్సువల్ దృక్పధంతోనే చూడడం… కొన్నిచోట్ల అణిచేయడం కొన్ని తరాల పాటు సాగిన తర్వాత…. ఆ పర్టిక్యులర్ జెండర్ సైతం తన సహజసిద్ధ ఆభరణాలను పక్కనపెట్టి యుద్ధంలో పోటీపడే రీతిలో తయారవుతున్న నేపధ్యంలో.. మనుషుల మధ్య ఏర్పడుతున్న విచిత్రమైన స్థితికీ… ఇంకా చెప్పాలంటే ఓ నిర్లిప్త స్థితికీ ప్రతినిధులుగా మిగిలిపోయాం!!
– నల్లమోతు శ్రీధర్
Leave a Reply