వేవ్-పార్టికల్ డ్యూయాలిటీ అనే క్వాంటమ్ ఫిజిక్స్ కాన్సెప్ట్ గురించి ఇంతకు ముందు భాగంలో క్లుప్తంగా వివరించాను కదా! అంటే అప్పుడు చెప్పుకున్న ఉదాహరణ మళ్లీ చెబుతాను. మా ఊరు జమ్ములపాలెం చెరువులో నేను ఓ చిన్న పెంకుని విసిరేసినప్పుడు ఆ పెంకు అనే పార్టికల్ (పదార్థాన్ని) మీద దృష్టి పెడితే దానిలో ఉన్న వేవ్ రూపం నా దృష్టి పధంలో మాయమవుతుంది. అదే వేవ్ మీద దృష్టి పెడితే పదార్థం మీద నుండి దృష్టి వెళ్లిపోతుంది.
మనం నిశితంగా గమనిస్తే ఇది విశ్వంలో మిగతా అన్ని అంశాలోనూ కన్పిస్తుంది. మీరు Nallamothu Sridhar అనే నా అర్హతల మీద దృష్టి పెట్టారు అనుకోండి, నా నాలెడ్జ్ మీ perception నుండి మాయమవవుతుంది. నా నాలెడ్జ్ మీద దృష్టి పెట్టారు అనుకోండి.. నా అర్హతలు మీ దృష్టిలో ఉండవు. సూపర్ పవర్ ఏమీ లేదు, అంతా సైంటిఫిక్ ఎక్స్‌ప్రెషనే అనే దృష్టిలో ఉంటే సూపర్ పవర్ మాయమవుతుంది. సైన్స్ కన్నా సూపర్ పవరే నిజం అని నమ్మితే సూపర్ పవరే కన్పిస్తుంది. సైంటిఫిక్ పరిభాషలో చెప్పాలంటే మైండ్‌లో మన అవేర్నెస్ ఏ అంశం మీద ఉంటే, మన బ్రెయిన్లో దానికి సంబంధించిన న్యూరాన్ల మధ్య ఫైరింగ్ జరిగి ఆయా న్యూరల్ నెట్‌వర్క్‌లు బలోపేతం అయి, బ్రెయిన్లో ఉన్న మిగతా న్యూరాన్ల మధ్య కనెక్షన్లు బలహీనమవుతాయి.
సరే మెయిన్ టాపిక్‌కి వస్తాను. ఒకతను డాక్టర్. రాత్రింబవళ్ళు కష్టపడి బాగా చదువుకుని ఎలాంటి ఆరోగ్య సమస్యకైనా చికిత్సని అందించగలిగే నైపుణ్యాన్ని సంపాదించారు అనుకుందాం. ఆ డాక్టర్‌కి మానవ శరీరం మొత్తం మెటీరియల్‌గానే కన్పిస్తుంది. అనాటమీలో వివిధ అవయువాలు, వాటి పనితీరు, హార్మోన్లు, మెటబాలిజం, సెల్ స్థాయిలో ప్రొటీన్ సింథసిస్ వంటి అంశాలను మాత్రమే అతను నమ్ముతారు. కారణం ఆయనకి ఆ రంగంలో సంపూర్ణమైన అవగాహన ఉంది కాబట్టి! ముఖ్యంగా కళ్లకి కన్పించేేవి మాత్రమే నమ్మమని అతను చదువుకునేటప్పుడు వైద్యవృత్తిలో వివిధ సందర్భాలలో బలంగా చెప్పబడి ఉంటుంది కాబట్టి!
అలాంటి ఒక ఆర్థోపెడిక్ సర్జన్ ఉన్నాడు అనుకోండి. ఓ వ్యక్తి బైక్ యాక్సిడెంట్లో వెన్నుముకకి బలమైన గాయం అయి లేవలేని స్థితిలో ఉంటే, ఇ తీవ్రతను బట్టి ఆ డాక్టర్ జీవితాంతం బెడ్ రెస్ట్ తీసుకోవాలి, మొబిలిటీ (కదలిక) కావాలంటే రాడ్స్ వేసుకోవాలి, వాటిని జీవితాంతం వెన్నుకి సపోర్ట్‌గా ఉంచుకోవాలి అని రికమెండ్ చేయొచ్చు. కారణం అతని వృత్తి అతనికి క్వాంటమ్ ఫిజిక్స్ ప్రకారం వేవ్-పార్టికల్ డ్యూయాలిటీలో పార్టికల్ని (శరీరం అనే పదార్థాన్ని) చూడడం మాత్రమే నేర్పించింది. కాబట్టి అతను కళ్లకు కన్పించని ఎలక్ట్రో మ్యాగ్నెటిక్ ఎనర్జీ, సెల్ లెవల్ ఓల్టేజ్, వేవ్, ఫ్రీక్వెన్సీ వంటి వాటిని అస్సలు నమ్మరు. నమ్మినా లైట్ తీసుకుంటారు.
ఇప్పుడు అదే పేషెంట్ తన సంకల్పబలంతో మనస్సుని చాలా బలంగా చేసుకుని నిరంతరం మెడిటేషన్ చేసి, తన వైబ్రేషనల్ ఎనర్జీని పెంచుకుని, యూనివర్శల్ కాన్షియస్నెస్ నుండి హీలింగ్ ఇన్ఫర్మేషన్ పొంది తనని తాను హీల్ చేసుకున్నాడు అనుకోండి. ఇప్పుడు అదే డాక్టర్ దగ్గరకు వెళితే అంతా బాగైపోయి ఉంటుంది. ఇప్పుడు డాక్టర్ ఏం అంటారు? తెలుగు సినిమా లో చెప్పినట్లు “ఇట్స్ ఏ మెడికల్ మిరాకిల్, నమ్మశక్యంగా లేదు” అంటూ మెచ్చుకుంటారు. ఇలాంటి కేసులు ప్రపంచ వ్యాప్తంగా కొన్ని లక్షలు ఉన్నాయి.
మళ్లీ అసలు పాయింట్ కి వస్తాను. డాక్టర్ గానీ, మీరు గానీ, నేను గానీ శరీరాన్ని, శరీరంలోని అవయువాలను, వాటిలోని రోగాలను, కరోనా అనీ, జలుబు అనీ వాటికి పేర్లు పెట్టి వాటిని ఆబ్జెక్టిఫై చేసుకుని వాటి భౌతిక రూపాన్ని చూసినంత కాలం శరీరమూ, డిసీజే మిగులుతుంది. అదే అవగాహన మార్చుకుని, మన అటెన్షన్‌ని ఇంతకుముందు ఆర్టికల్‌లో నేను చెప్పినట్లు మన కణాల స్థాయి నుండి ఒకదానితో ఒకటి ఇచ్చిపుచ్చుకునే కళ్లకి కన్పించని బయోఫోటాన్స్ అనే కాంతి రూపాలుగా భావిస్తే, మన దృష్టి శరీరం స్థాయి నుండి వైబ్రేషన్ స్థాయికి వెళ్లిపోతుంది. అంటే వేవ్-పార్టికల్ డ్యూయాలిటీ ప్రకారం మనం మన వైబ్రేషన్‌ని మాత్రమే చూస్తున్నంత కాలం శరీరం అనే భౌతిక రూపం మన అటెన్షన్ నుండి మాయమవుతుంది.
దీన్ని న్యూరాలజీ పరిభాషలో చెబుతాను. 2016 నుండి న్యూరోసైన్స్ మీద పాషన్ కొద్దీ స్టడీ చేస్తున్నాను. మొదట్లో కేవలం మన బ్రెయిన్, మన మైండ్లు మాత్రమే రియాలిటీని సృష్టిస్తాయి అనే భావనలో ఉండే వాడిని. ఇప్పుడు అనేక విషయాలమీద క్లారిటీ పెరుగుతోంది. సరే ఇంతకు ముందు చెప్పినట్లు, మన దృష్టి మన శరీరం మీద ఉన్నప్పుడు మన ఆలోచనలు “నాకు అక్కడ పెయిన్ ఉంది, ఇక్కడ పెయిన్ ఉంది” అనే అంశం మీద కేంద్రీకరించబడతాయి కదా! మన అటెన్షన్ ఎక్కడ ఉంటే మన బ్రెయిన్లో న్యూరల్ యాక్టివిటీ అక్కడ జరుగుతుంది. అంటే అక్కడ న్యూరాన్లకి మధ్య ఫైరింగ్ జరిగి, అవి మనం చేసే ఆలోచనలకు తగ్గట్టు న్యూరో కెమికల్స్ విడుదల చేసి, సంబంధిత మార్పులను శరీరంలోనూ చేస్తాయి!
ఇప్పుడు మన ఆలోచన మన శరీరంలోని బాధ మీద ఉంటే.. ఆ బాధని అది హీల్ అయిపోతుంది అనే భావనకు బదులు “నాకే ఎందుకు ఈ కష్టం వచ్చింది” అనే ఆలోచనలతో బాధపడుతూ ఉంటాం. అంటే మనం మన బాధని హీల్ చేసుకోవడానికి బదులు మన ఆలోచనతో మరింత సఫర్ చేసుకుంటున్నాం. మానసిక ఒత్తిడికి గురవుతాం. ఇప్పుడు సఫరింగ్ ద్వారా, మానసిక ఒత్తిడి ద్వారా కార్టిజోల్ అనే స్ట్రెస్ హార్మోన్ శరీరంలో విడుదల అవుతుంది. అది శరీరంలో యాక్టివ్‌గా ఉన్నంతవరకు మన శరీరం “పోరాడు లేదా పరిగెత్తు” దృక్పధంలో ఉంటుంది. దీనివల్ల సెల్ రిపేర్ జరగదు. మెటబాలిజం సవ్యంగా ఉండదు. అంటే మనకు మనం తెలియకుండానే మన దృష్టిని వేవ్-పార్టికల్ డ్యూయాలిటీలో శరీరం మీద పెట్టుకోవడం ద్వారా మన సమస్యని పెంచి పోషించుకుంటూ ఉంటాం అన్నమాట.
ఇక్కడ ఏం జరుగుతోంది అంటే మీ డాక్టర్ మాట్లాడేదీ శరీరం అనే పార్టికల్ గురించే… మీరు ఆలోచించేదీ ఆ శరీరంలోని బాధ గురించే! అంటే మీరు శరీరాన్ని నమ్మినంత కాలం మీ దృష్టిలో నుండి aura, chakras వంటి ఎనర్జీ సెంటర్స్ కళ్లకి కన్పించవు కాబట్టి, మీరు నమ్మరు కాబట్టి మాయమవుతాయి. కెమికల్ రూపంలో మెడిసిన్స్ వాడుతూ,ఆ కెమికల్ ఎలిమెంట్ కూడా మీరు “నాకు జబ్బు తగ్గుతుంది” అనే బలమైన నమ్మకం కలిగి ఉంటేనే జబ్బు తగ్గేలా తయారవుతుంది. కేవలం కెమికల్ వల్ల జబ్బు తగ్గేది అయితే, కరోనా వల్ల ప్రపంచవ్యాప్తంగా ఇంత ప్రాణ నష్టం ఉండేది కాదు. శరీరాన్ని మాత్రమే పరిగణనలోకి తీసుకున్నంత కాలం, శరీరం చుట్టూనే ఆలోచనలు ఉన్నంత కాలం, శరీరంలో జబ్బు తగ్గదనే అపనమ్మకంతో మన ఇమ్యూనిటీ తగ్గించుకున్నంత కాలం రోగాలు కొనసాగుతూనే ఉంటాయి, ప్రాణాలు తీస్తూనే ఉంటాయి.
ఇప్పుడు మరో ఉదాహరణ చెబుతాను. ఒకతను మెడిటేటర్. రోజూ మెడిటేషన్ చేస్తారు. అతనికి శరీరం అనే భౌతిక రూపం కన్నా, నా ఆలోచనలు నా వాస్తవాన్ని మారుస్తాయి, నా ఆలోచనలు నా వైబ్రేషన్‌ని మారుస్తాయి, ఆ వైబ్రేషన్ యూనిర్శల్ కాన్షియస్నెస్కి నన్ను కనెక్ట్ చేస్తుంది, అది నన్ను హీల్ చేస్తుంది అనే నమ్మకం ఉంది అనుకోండి. మిగతా వారికి చెబితే “పోపోవోయ్ వైబ్రేషన్ అంట, యూనివర్శల్ కాన్షియస్నెస్ అంట, ఏదీ కళ్లకి చూపించు, చెప్పొచ్చావులే” అని కొట్టి పారేస్తారు. కానీ అతను బలంగా నమ్ముతాడు. అతను తన రోగాన్ని హీల్ చేసుకున్న సంఘటనలూ ప్రపంచవ్యాప్తంగా లక్షలాది ఉన్నాయి. అంతెందుకు, స్వయంగా డాక్టర్లు మెడిటేషన్ చెయ్యమని సలహాలు ఎందుకు ఇస్తారు? వాళ్లకి వాళ్లు కూడా ఎందుకు చేస్తారు? ఇదంతా అబద్ధమైనప్పుడు? అందుకే కళ్లకి కనిపించేది మాత్రమే వాస్తవం కాదు, కళ్లకి కన్పించని చాలా నిగూఢ విషయాలు ఈ విశ్వంలో ఉన్నాయి. విశ్వానికి సరెండర్ అయినవాడికి అర్థమవుతాయి. తలెగరేసే వాడికి అర్థం కావు.
కాబట్టి మన దృష్టి మన శరీరం మీద కాకుండా మన వైబ్రేషన్ మీదా, మన ఎనర్జీ మీదా, చక్రాస్ మీద, మన ప్రవర్తనలో మార్పుల మీదా, ఆలోచనలో పరిపక్వత మీదా ఉండాలి. ఈరోజు (ఆదివారం 6-9 PM) ముంబాయికి చెందిన త్రిషా షా అనే కౌన్సెలింగ్ సైక్రియాట్రిస్ట్ చేత అద్భుతమైన aura, chakras ఉచిత జూమ్ సెషన్ ప్లాన్ చేశాను, ఎవరైనా జాయిన్ కావచ్చు. అవగాహన పెంచుకోవచ్చు. మీ మిత్రులకీ షేర్ చేయొచ్చు.
Join Zoom Meeting invited By Sridhar Nallamothu
https://us02web.zoom.us/j/84231228916?pwd=Q1ZRSkRCaXJ4ZUU3WTVjSkFHTER2UT09
Meeting ID: 842 3122 8916
Passcode: 276741
ఈ అంశం మీద మరింత వివరంగా మరో ఆర్టికల్‌లో వివరిస్తాను.
- Sridhar Nallamothu