ఎందుకు చదవట్లేదు…?
ఏమిటా బయట తిరుగుళ్లు..?
ఎప్పుడూ ఆ కంప్యూటర్ ముందేమిటి….?
న్యూస్ చూసేటప్పుడు disturb చెయ్యొద్దని ఎన్నిసార్లు చెప్పాలి…?
లాస్ట్ మూమెంట్లో హడావుడెందుకు… అదేదో కాస్త ముందే రెడీ అవ్వొచ్చుగా….?
——————————————-
ప్రశ్నలు.. ప్రశ్నలు… ప్రశ్నలు…
బ్రతికుండగా సరైన సమాధానాలు దొరకని రొటీన్ ప్రశ్నలూ…. బుల్లెట్లా క్షణాల్లో తిరిగొచ్చే చిరాకైన బదుళ్లు…!!
ఎవరి దారి వారిది… ప్రశ్న ఎదురైతే ఎవరి తీరు వారిది…..
సమాధానం రాలేదని మొహం చిన్నబుచ్చుకోవడం తప్ప…. లోపల్లోపల అసహనం, ద్వేషం పెంచుకోవడం తప్ప no use.
అందరూ, అందర్నీ సమయం, సందర్భం లేకుండా ప్రశ్నించడం మొదలెట్టాక… ప్రశ్న ఎప్పుడో విలువ కోల్పోయింది…. అలాంటి విలువ లేని ప్రశ్నలకు ఏం సమాధానాలొస్తాయని చెవులు రిక్కించుకుని ఆశపడడం…?
ఒకటికి పదిసార్లు ఒకటే ప్రశ్న వేస్తే….. సరిగ్గా ప్రతీసారీ ఆ విషయాన్ని అలాగే ప్రశ్నించడమూ అలవాటైపోతుంది… సరిగ్గా ఆ విషయానికి ప్లాన్డ్గా ఒకేలా రెస్పాండ్ అవడమూ అలవాటైపోతుంది….. జీవితాల తరబడి కలవని రైలు పట్టాల్లాంటివిగా మిగిలిపోతాయి….
ప్రతీ ఇంట్లో, ప్రతీ రిలేషన్లో అణిచిపెట్టుకున్నవీ, ఉండబట్టలేక బయట పెట్టేవీ వందల ప్రశ్నలు….. కొన్ని సరిచేయచూసేవీ, కొన్ని అనుకూలంగా మసలుకోమని హెచ్చరించేవీ, మరికొన్ని అనుమానంతో ఆరా తీసేవీ…
మనం అడిగీ అడిగీ…. రిటర్న్ ఎలాంటి బదులొస్తుందో ముందే ఠక్కున చెప్పేటంత అలవాటైపోయీ… కూడా అడగడం మాత్రం మానం…. రొటీన్‌గా కాకుండా క్రియేటివ్‌గా సిట్యుయేషన్స్‌ని హ్యాండిల్ చేసే తెలివితేటలూ, ఓపికా, టైమూ మనకు ఎప్పుడు వస్తాయో…..
ప్రశ్నించడానికి అర్హత ఉండాలి…. సమాధానం చెప్పడానికి బాధ్యత ఉండాలి…..
అర్హత లేని వ్యక్తి ప్రశ్నించినా సమాధానం రాదు….
బాధ్యత లేని వ్యక్తి నుండి అస్సలే సమాధానం రాదు….
"నన్ను క్వశ్చన్ చెయ్యడానికి ఏం అర్హత ఉందని" కొందరూ… "సమాధానం చెప్పాల్సిన బాధ్యత లేదా" అని మరికొందరూ ఒకర్నొకరు చులకన చేసుకోవడం మాత్రం షరా మామూలే….
క్వశ్చన్ చేయడం అవసరం, ఆన్సర్ ఇవ్వడమూ అవసరమే…. ఇవన్నీ ఇగోల మధ్య చిక్కుకుపోనంత వరకూ ఏ పేచీ లేదు….. ఒక్కరోజు కూడా బయటకు తీసుకెళ్లని పేరెంట్స్ నన్ను క్వశ్చన్ చెయ్యడానికి ఏం అర్హత ఉందని పిల్లలు అనుకునే దాకా విషయం వచ్చినా…. నిండా పదీ, పదిహేనేళ్లు లేవు… ఎలా ఎదురు తిరుగుతున్నాడో చూడు…. అంటూ ఇగో ఫీలైనా జీవితాంతం కొరుకుడుపడని జఠిల ప్రశ్నలుగానే మిగిలిపోతాయి ఇలాంటి సంబంధాలన్నీ!!
చివరగా ఒక్క మాట…. మనకూ, మన బాధ్యతలకూ ఎదురయ్యే ప్రశ్నలకు సమాధానాలు చెప్పే పెద్ద మనస్సు ఉంటేనే ఎవర్నైనా ప్రశ్నించే అర్హత పొందగలం…. మనం మాత్రమే ప్రశ్నించాలి, మనం ఎవరికీ జవాబుదారీగా ఉండం అంటే కుదరనే కుదరదు. అలాంటప్పుడే పాలిటిక్స్, అడ్మినిస్ట్రేషన్, సొసైటీ, ఆర్గనైజేషన్, ఫ్యామిలీ, ఫ్రెండ్స్, లైఫ్ పార్టనర్స్.. ఇలా ప్రతీచోటా చిక్కులు వస్తూనే ఉంటాయి.
గమనిక: ఇది ఎవరికైనా ఉపయోగపడుతుంది అన్పిస్తే ఇతరులకూ షేర్ చెయ్యగలరు.
ధన్యవాదాలు
– – నల్లమోతు శ్రీధర్
ఎడిటర్
కంప్యూటర్ ఎరా తెలుగు మేగజైన్
http://computerera.co.in
http://youtube.com/nallamothu
http://nallamothusridhar.com
Leave a Reply