
కొంతమందితో మళ్లీ మళ్లీ గడపాలి అనిపిస్తుంది. దీనికి ప్రధాన కారణం వారు మనకు ఇచ్చే వేల్యూ. కొన్ని టెక్నిక్స్ ఫాలో అవడం ద్వారా ప్రతీ ఒక్కరూ మన కంపెనీ ఇష్టపడే విధంగా చేసుకోవచ్చు.
ఇంపార్టెన్స్
ఒక వ్యక్తితో మీరు మాట్లాడేటప్పుడు వారికి నూటికి నూరు శాతం ఇంపార్టెన్స్ ఇవ్వండి. మీకు ఏదైనా ఫోన్ కాల్ వస్తుంది, బాగా అర్జంట్ కాల్ అవకపోతే, కాల్ లిఫ్ట్ చేసి ” ఒక ఇంపార్టెంట్ మీటింగ్‌లో ఉన్నాను, ఒక 10 నిమిషాలు ఆగి కాల్ చేస్తాను” అంటూ చెప్పండి. దీంతో మీ ఎదురుగా ఉన్న వ్యక్తి చాలా సంతోష పడతాడు. తనని ఇంపార్టెంట్‌గా ఫీల్ అయినందుకు హాపీగా ఉంటాడు. అదే సమయంలో తనకు మీరు ఇచ్చిన సమయం పది నిమిషాలు మాత్రమే అన్న విషయం కూడా అతని సబ్ కాన్షస్ మైండ్ లో చెప్పినట్లవుతుంది. చాలా ఆచితూచి ముఖ్యమైన విషయాలు మాత్రమే మాట్లాడతాడు.
అటెన్షన్
అవతలి వారు ఏదైనా చెప్పేటప్పుడు అటూ ఇటూ దిక్కులు చూస్తూ వినడం, లేదా ఫోన్ చేతిలో పట్టుకొని, సోషల్ మీడియా ఛెక్ చేసుకుంటూ వినడం మీ రిలేషన్‌ని దెబ్బతీస్తుంది. కాబట్టి పూర్తిగా వారి కళ్ళల్లోకి కళ్ళు పెట్టి చూస్తూ, వారు చెప్పే విషయాలను నిశితంగా ఫాలో అవుతూ, ఏదైనా ఆశ్చర్యకరమైన విషయం విన్నప్పుడు కళ్లు ఎగరవేస్తూ.. మధ్యలో స్పందిస్తూ ఉంటే ఖచ్చితంగా వారు చాలా కంఫర్టబుల్ గా ఫీల్ అవుతారు.
మెచ్చుకోవడం
మధ్యలో అవతలి వ్యక్తి క్వాలిటీస్‌ని మెచ్చుకోండి. చాలామంది తమ అనుభవాలు, తాము సాధించిన విజయాలు చెప్పుకోడానికి చాలా ఆసక్తి చూపిస్తారు. అలాంటి వాటిని చాలా ఉత్సాహంగా వినండి. మొహం మీద పాజిటివ్ ఫీల్ ఉండేలా కాపాడుకోండి. మీ గురించి అవతలి వ్యక్తి అడిగితే తప్పించి ఎక్కువగా చెప్పకండి.. ఎదుటి వ్యక్తి జీవితానికి సంబంధించి మీకు చాలా ఆసక్తి ఉన్నట్లు అవసరాన్ని బట్టి మధ్యమధ్యలో ప్రశ్నలు వేయటం వల్ల, వారి టాలెంట్‌ని మెచ్చుకోవడం ద్వారా వారు చాలా సంతోష పడతారు.
గట్టిగా వాదించకండి
అవతలి వారు చెప్పిన ఏదైనా విషయం తప్పని తెలిసినా కూడా.. ” మీరు మాట్లాడింది తప్పు” అని కరాఖండిగా చెప్పటానికి బదులుగా “అది అలా అయ్యుండొచ్చేమో, అయినా నాకు అంత పెద్దగా తెలియదు” అంటూ మీకు వారి కన్నా పెద్దగా ఏమీ తెలీదు అన్న అర్థం ధ్వనించేలా మాట్లాడండి. ఏది నిజమైనా, ఏది అబద్ధమైనా ఎవరికి బాగా తెలుసు అన్నది కాదు మనకు ముఖ్యం, అవతలి వ్యక్తి తో రిలేషన్ ముఖ్యం.
“నేను నాలానే ఉంటాను.. ఇలాంటివి ఫాలో అవను” అంటే దాన్ని rigidity అంటారు. మనల్ని మనం మార్చుకోకపోతే ఎవరు మారుస్తారు.