ఇంతకు ముందు భాగంలో చెప్పుకున్నట్లు DNAలో ఉండే లైట్ పార్టికల్స్ మనిషి శరీరంలోని ఇతర సెల్స్‌తో సమర్థవంతంగా కమ్యూనికేట్ చేస్తూ ఉంటాయి. ఈ చర్య వల్ల ఆ మనిషి ఆరోగ్యం ప్రభావితం చెందుతుంది.
DNAలో ఉండే బయో ఫోటాన్స్గా పిలవబడే ఈ లైట్ పార్టికల్స్ ప్రసారాన్ని క్యాప్చర్ చెయ్యడానికి అత్యంత శక్తివంతమైన కెమెరాను వాడతారు. DNA నుండి ఎంత బలంగా ఈ బయో ఫోటాన్స్ ప్రసారం జరిగితే అంత బాగా శరీరంలోని కణాల మధ్య కమ్యూనికేషన్ జరిగి మనిషి శరీరం ఆరోగ్యంగా ఉంటుంది.
మన శరీరం ప్రాణాన్ని, ఆరోగ్యాన్ని కలిగి ఉండటం కోసం శరీరంలోని వివిధ కణాలు కాంతికి చెందిన వివిధ ఫ్రీక్వెన్సీల్లో ఒకదానితో మరొకటి కీలకమైన సమాచారాన్ని ఇచ్చిపుచ్చుకుంటూ ఉంటాయి. ఇంటర్నేషనల్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ బయో ఫిజిక్స్‌ని స్థాపించిన “పాప్” అనే పరిశోధకుడు దీనికి భిన్నంగా కూడా జరుగుతుందని గుర్తించారు.
అదేంటంటే మన శరీరంలోని ఏదైనా కణం ఒక క్రమ పద్ధతిలో లేని, పొందిక లేని ఎలక్ట్రో మ్యాగ్నెటిక్ శక్తిని వెలువరించకపోతే ఆ కణం అనారోగ్యకరంగా మారుతుంది. దాంతో అది మిగతా కణాలతో సక్రమంగా సమాచారాన్ని ఇచ్చి పుచ్చుకోలేదు. దాంతో ఇతర కణాల నుండి కూడా దానికి సరైన సమాచారం రాదు. దాంతో అది తన శక్తిని కోల్పోతుంది.
ఇప్పుడు అసలు విషయానికి వద్దాం. ఒక మనిషి శరీరంలోని కణం స్థాయిలోనే ఎలక్ట్రో మ్యాగ్నెటిక్ ఎనర్జీగా ఉండే బయో ఫోటాన్స్ అనబడే కాంతి తరంగాలు అత్యంత ముఖ్యమైనవి అన్న విషయం తెలిసింది కదా! మనిషి శరీరాన్ని మనం భౌతికంగా మేటర్ (పైకి కన్పించే కండలు, శరీరం లోపల ఉండే మాంసపు ముద్దలు లాంటి గుండె, లివర్, కిడ్నీలు వంటి భౌతిక అవయువాలు) అని భావించే మన శరీరం బయో ఫోటాన్స్ అనే కాంతి ద్వారా ఏర్పడింది. ఇది కేవలం మన అంతర్గత అవయువాల్లోని టిస్యూలు, కణాల స్థాయిలోనే కాదు, మన చుట్టూ aura రూపంలో మన ఎనర్జీ బయో ఫోటాన్స్తో కాంతి రూపంలో విస్తరించి ఉంటుంది.
మన శరీరం అని గుర్తు రాగానే మాంసపు ముద్దని ఎందుకు పరిగణనలోకి తీసుకోకూడదో చూద్దాం. నేను కొద్దికాలంగా క్వాంటమ్ ఫిజిక్స్ ఓ విద్యార్థిలా చదువుకుంటున్నాను. దానికి కారణం స్పిరిట్యువాలిటీకీ, సైన్స్‌కీ అవినాభావ సంబంధం ఉంది అన్నది తెలుసు కాబట్టి దాన్ని ఆధారాలతో నిరూపించడం కోసం! అలాగే మన ఆలోచనలు మన భౌతిక శరీరాన్ని, చుట్టూ విశ్వాన్ని ఎలా ప్రభావితం చేస్తాయో అర్థమయ్యేలా వివరించడం కోసం! త్వరలో ఖమ్మంకి చెందిన కెమిస్ట్రీ లెక్చరర్ శర్మ గారి మిత్రులు శ్రీధర్ గారు అనే వ్యక్తి ద్వారా క్వాంటమ్ ఫిజిక్స్ మీద సపరేట్ క్లాసులు పెట్టించుకుంటున్నాను. క్వాంటమ్ ఫిజిక్స్‌లో వేవ్-పార్టికల్ డ్యూయాలిటీ అనేది అత్యంత కీలకమైన విషయం. దీని ప్రకారం కుర్చీ, సెల్‌ఫోన్ వంటి ఒక వస్తువులోని అణువు గానీ, మానవ శరీరంలోని కణం గానీ, విశ్వంలో ఉన్న ఏ క్వాంటమ్ యూనిట్ అయినా పార్టికల్గానూ (భౌతిక రూపంలో) వ్యక్తీకరించబడుతుంది. అంతలోనే ఎనర్జీ తరంగంగానూ కన్పిస్తూ ఉంటుంది.
ఇక్కడ చిన్న ఉదాహరణ చెబుతాను. చిన్నప్పుడు మనం ఓ చిన్న పెంకుని వాటంగా పెట్టి చెరువులోకి విసిరేసే వాళ్లం. ఇప్పుడు ఉన్న తరానికి ఆ అనుభవం ఉందో లేదో గానీ మా చెరువు జమ్ములపాలెం ఊరి చెరువులో నేను అలా ఆడుకునే వాడిని. అలా విసిరేసినప్పుడు మనం కైనెటిక్ ఎనర్జీని ఆ వస్తువులోకి బదిలీ చేస్తున్నాం. ఆ ఎనర్జీ కాస్తా నీటిలో పడగానే నీటిలో తరంగాలుగా విస్తరిస్తుంది కదా! అంటే ఇక్కడ కేవలం “పెంకు” అనే భౌతిక రూపాన్ని, వస్తువునే చూస్తే అది ఎందుకు తరంగాలను సృష్టించాలి? నీటిలో ఎలాంటి తరంగాలను సృష్టించకుండా కామ్‌గా వెళ్లి పడిపోవచ్చు కదా!
అలాగని మేటర్ (వస్తువు) లేదా అంటే మన కళ్లకి మేటర్ కన్పిస్తోంది కదా!అంటే పెంకు కన్పిస్తోంది కదా! సరిగ్గా అలాగే మన శరీరం కూడా! మన శరీరంలోని కణాల స్థాయికి వెళితే అవి బయో ఫోటాన్స్ రూపంలో ఎలా ఎనర్జీని ఒకదానితో మరొకటి ఇచ్చి పుచ్చుకుంటాయో, అవన్నీ ప్రొటీన్ ఉత్పత్తి చేసి, శరీరంలోని వివిధ టిస్క్యూలను, ఆర్గాన్లని ఏర్పరిచి మనకు అలాగే భౌతిక రూపాన్ని ఇచ్చాయి కదా!
ఇక్కడ అర్థం చేసుకోవాల్సింది.. మోడ్రర్న్ సైన్స్, మెడికల్ సైన్స్ కేవలం భౌతిక రూపంలో ఉన్న కణాన్ని మాత్రమే వాస్తవమైన రూపంగా భావిస్తుంది. ఆ కణాలలో జరిగే శక్తి చలనాన్ని అర్థం చేసుకోలేదు. సరిగ్గా సైన్స్ సైన్స్ అని, మెడికల్ నాలెడ్జ్ అని మనం ఎంతసేపూ కణం యొక్క భౌతిక రూపంపై, మన శరీరంలోని అవయువాలపై దృష్టి పెట్టినంత కాలం సహజంగా కళ్లకి కన్పించని ఎనర్జీ మన కళ్లకూ కన్పించదు. ఇంతకు ముందు నేను చెప్పినట్లు ప్రత్యేకమైన శక్తివంతమైన కెమెరాలు వాడినప్పుడు మాత్రమే DNA నుండి వెలువడే బయో ఫోటాన్స్ని క్యాప్చర్ చెయ్యడానికి అవుతున్నప్పుడు మన కళ్లకి ఆ ఎనర్జీ ఎలా కన్పిస్తుంది. ఆ మధ్య నేను aura గురించి ఓ పోస్ట్ రాస్తే ఓ వ్యక్తి “Nallamothu Sridhar ఆరా గురించి కారా కిళ్లీ తిన్నంత ఈజీగా చెబుతుంటాడు” అంటూ అపహాస్యంగా ఏదో రేషనలిస్టిక్ గ్రూపుల్లో రాసుకున్నారు. నవ్వి ఊరుకోవడం తప్పించి చెయ్యగలిగిందేమీ లేదు. మన కళ్లకి మన చుట్టూ ఉన్న ఎనర్జీ ఫీల్డ్ కన్పించనంత మాత్రాన అది అసత్యం అయిపోదు. ఎవరైనా క్వాంటమ్ ఫిజిక్స్ నేర్చుకోవచ్చు, అవగాహన పెంచుకోవచ్చు.
సరే అసలు విషయానికి వస్తాను. మనం భౌతిక రూపం మీద, అవయువాల మీద మన ప్రధానమైన ఫోకస్ ఉన్నంత కాలం ఎనర్జీ రూపంలో మన ఎక్స్ప్రెషన్ తగ్గిపోతుంది. అది క్వాంటమ్ ఫిజిక్స్ సహజ సిద్ధాంతం. మనం మేటర్ని చూస్తే మేటరే కన్పిస్తుంది, ఎనర్జీని చూస్తే ఎనర్జీనే కన్పిస్తుంది. “ఎనర్జీ కళ్లకి కన్పించదు కదా” అని మళ్లీ పాత కాలం ప్యాట్రర్న్ థింకింగ్‌లోకి వెళితే మేటర్ని చూసినంత కాలం శరీరం, అవయువాలు, వాటిలోని రుగ్మతలు స్థాయిలోనే మన ఆలోచనలు సాగుతాయి. మన వైబ్రేషన్ పెంచుకుంటే మన ఆరోగ్యం బాగుపడుతుంది అన్నది ఎప్పటికీ అర్థం కాదు.
దీనికి కొనసాగింపు మరో ఆర్టికల్‌లో!
- Sridhar Nallamothu