ఈ సింపుల్ ఫార్ములా జీవితాంతం గుర్తు పెట్టుకోండి.
థాట్స్+ఎమోషన్స్+యాక్షన్స్ = మేనిఫెస్టెడ్ రియాలిటీ!
చిన్న ఉదాహరణ:
- “అందరూ బాగుండాలి” అనే స్వచ్ఛమైన ఆలోచన +
- “అందరితో తాను బాగున్నప్పుడు కలిగే సంతృప్తితో కూడిన ఎమోషన్ +
- ఎవరైనా వ్యక్తి ఎదురు పడినప్పుడు మనస్ఫూర్తిగా నవ్వే చిరునవ్వు అనే యాక్షన్ = ఈ మూడు కలిసినప్పుడు మన చుట్టూ ప్రపంచం చాలా పాజిటివ్‌గా మారిపోతుంది.
మరో చిన్న ఉదాహరణ:
- “నా ఆరోగ్యం సహకరించదు” అనే ఆలోచన +
- “చిన్న చిన్న నొప్పులకి కూడా మానసికంగా కుంగిపోతూ కలిగే ఎమోషన్ +
- “ఎక్కువ సేపు ఊరికే పడుకుండిపోవడం అనే యాక్షన్ = ఈ మూడు కలిసి ఒక మనిషి ఆరోగ్యాన్ని నిజంగానే కుంగదీస్తాయి.
అందుకే ప్రతీ క్షణం మీ ఆలోచనలు, మీ ఎమోషన్స్, మీ యాక్షన్స్ ఎలా ఉన్నాయో పరిశీలించుకుంటూ ఉండండి. అవే మీ రియాలిటీగా మారిపోతాయి.
- Sridhar Nallamothu