సాంఖ్య శాస్త్రం ప్రకారం ఒక కర్మ పలు దశలుగా సాగుతుంది.
1. జ్ఞానేంద్రియాలైన కన్ను, ముక్కు, చెవులు వంటి వాటి ద్వారా సమాచారాన్ని సేకరించడం. అంటే ఏదైనా చూడడం, వినడం లాంటివి.
2. బ్రెయిన్‌కి ఆ సమాచారం చేరిన తర్వాత బ్రెయిన్లోని సంబంధిత విజువల్, ఆడిటరీ న్యూరాన్లకి ఆ సమాచారం అందించబడి అది మైండ్ చేత డీకోడ్ చెయ్యబడడం. (కారు రూపాన్ని చూస్తే.. ఇది ఆడి కారు, ఇది ఫలానా కారు అని గుర్తు పట్టడం ఈ కోవకు వస్తుంది. లేదా ఫలానా ఆకారాన్ని చూడగానే ఇతని పేరు ఇది అని గుర్తించడం కూడా)
3. ఇలా ఐడెంటిఫికేషన్ అయ్యాక.. మూడవ దశలో మనిషి తన జీవితానుభవంతో సాధించిన ఇంటెలిజెన్స్‌ని ఉపయోగించి ఆ చదివిన, చూసిన, విన్న సమాచారాన్ని ఏ దృష్టిలో చూస్తున్నాడు అన్నది ఆధారపడి ఉంటుంది. అంటే మూడవ దశ ఇంటెలిజెన్స్ అన్నమాట. ఈ ఇంటెలిజెన్స్ సరిగా లేకపోతే, ఎమోషనల్ బ్యాలెన్స్ తప్పి ఇంటెలిజెన్స్ దానివల్ల ప్రభావితం అయితే విషయాలను మనం చూసే perception మారిపోతుంది.
4. నాలుగు దశలో చూసిన, చదివిన, విన్న విషయం మన ఇగోకి (అహానికి) ఏమైనా హాని చేస్తుందా, మేలు చేస్తుందా అన్న దృష్టితో విశ్లేషించుకుని దాన్ని బట్టి రియాక్ట్ అవడం జరుగుతుంది. అంటే కూర వండేటప్పుడు దానికి ఫ్లేవర్ కోసం మసాలా జత చెయ్యడం లాంటిది అన్నమాట ఇది. ఇంటెలిజెన్స్ అద్భుతంగా ఉన్నా ఇగో నియంత్రణలో లేకపోతే మనం విషయాలను చూసే దృష్టి మారిపోతూ ఉంటుంది.
5. చివరిగా నైతికత (మోరల్) అనేది జత చెయ్యబడుతుంది. అంటే మీరు ఓ పిల్లాడు ఏడుస్తుంటే పట్టించుకోని తల్లిని చూశారు అనుకోండి. “తల్లి అయి ఉండి పిల్లాడిని పట్టించుకోకపోతే ఎలా” అనే నైతిక సూత్రాన్ని గుర్తు తెచ్చుకుని ఆ విషయానికి మీ దృష్టిని అలా add చేస్తారు. సమాజం చెప్పే, చిన్నప్పటి నుండి విన్నవీ అన్ని నైతిక సూత్రాలు ఇలా మన perceptionని ప్రభావితం చేస్తుంటాయి.
ఈ ఐదు దశల్లో ఎక్కడైనా మన అభిప్రాయాలు మారిపోవచ్చు. సరిగా కళ్లు కనిపించకపోతే ఒక వ్యక్తిని మరో వ్యక్తి అనుకుని పొరబడవచ్చు. సరైన ఇంటెలిజెన్స్ లేకపోతే అపార్థాలు చేసుకోవచ్చు. నాలుగవది అయిన ఇగో ఉంటే అన్నీ మనకు హాని చేస్తాయనే ఇన్ సెక్యూరిటీతో మన పర్సెప్షన్ పరిమితంగా తయారు కావచ్చు.
ఇవన్నీ కలిసి ఒక విషయానికి మనం ఎలా రియాక్ట్ అవుతామో ప్రభావితం చేసి వాటిని కొత్త కర్మలుగా మారుస్తుంటాయి.
– Sridhar Nallamothu
#nSridharWritings