“Whatever it may be… వస్తే వస్తుంది.. లేదంటే లేదు.. మన ప్రయత్నం మనం చేయడమే”….
ఒకింత ఓవర్ కాన్ఫిడెన్స్‌తో కూడిన ఇలాంటి డైలాగులు మనం తరచూ వాడుతుంటాం.
పాజిటివ్ ఎనర్జీ అనేది ఓ mental state. అనేక పరిస్థితులు అనుకూలించబట్టి మనం చాలా కాన్ఫిడెంట్‌గా మాట్లాడగలుగుతున్నాం… చాలా ధైర్యంగా కన్పిస్తున్నాం…
లైఫ్‌లో కొన్ని డిప్రెస్డ్ మూమెంట్స్ పలకరిస్తూనే ఉంటాయి.. అనేక పరిస్థితులు అనుకూలించవు.
పూర్తిగా కాన్ఫిడెన్స్ పోతుంది…
అగాధంలోకి కూరుకుపోతూ మనుషుల్లోనో, పనుల్లోనో, వ్యాపకాల్లోనో ఎక్కడోచోట కాస్తంత గ్రిప్ కోసం నిస్సహాయంగా చూస్తుంటాం…
మనం సంతోషంలో ఉన్నప్పుడు మన చుట్టూ ఉన్న మనుషులు మన దీనమైన ఫేసులు చూసి తామూ డల్ అవలేక మొహం చాటేస్తూ ఉంటారు. ఏ పనులు చేయాలన్నా నెగిటివ్ ఆలోచనలు విపరీతంగా డామినేట్ చేస్తుంటాయి…
ఇంత దారుణమైన స్థితిలో మనం మొదట్లో మాట్లాడినంత కాన్ఫిడెంట్‌గా అస్సలు ఉండలేం…
————————————————
దీన్నిబట్టి ఒక్క fact చాలా స్పష్టంగా అర్థమవుతుంది… మన గాంభీర్యాలూ, మన గొప్ప మాటలూ, గొప్ప ఛేష్టలూ వంటివన్నీ పరిస్థితులు అనుకూలించినప్పుడే వర్కవుట్ అవుతాయి, అలాగే అందరూ చుట్టుముట్టి మనల్ని ఓ పాజిటివ్ ఫీల్‌లో ఎంటర్టైన్ చేస్తున్నప్పుడే మనమూ వాళ్లని ఎంటర్టైన్ చేస్తుంటాం.. సంతోషంగానూ ఉంటాం… ఫార్ములాలో ఏమాత్రం తేడా వచ్చినా మన అడ్రస్ గల్లంతే!!
———————————————
“దమ్ముంటే చూస్కుందాం..” అని చాలాసార్లు చాలామంది అంటుంటారు… మజిల్ పవరో, మెంటల్ పవరో, సోషల్ పవరో ఏదో ఒకటి తలకెక్కి మాట్లాడించే మాటలు అవి…
ఒక్కసారి అదే మనిషి డిప్రెషన్లోకి కూరుకుపోతే తట్టుకోగలిగే “దమ్ము” అణువంతైనా ఉండదు. అలాంటి డిప్రెషన్లలో ఆత్యహత్యలకు పాల్పడే వారెందరో!
———————–
లైఫ్ ఎప్పుడూ ఒకేలా ఉండదు. చాలానే చూడాల్సి వస్తుంది…. వాటన్నింటినీ ఫేస్ చేసే ధైర్యమున్నప్పుడే జీవితం మీనింగ్‌ఫుల్‌గా ఉంటుంది…. ఏ మూమెంట్లో అయితే మన పట్ల మనం కాన్ఫిడెన్స్ కోల్పోతామో ఆ క్షణం నుండి చచ్చిన శవంతో సమానం..
——————————-
అన్నీ అనుకూలించినప్పుడు “గట్టిగా మాట్లాడగలుగుతున్నాం” అని గర్వపడడం కాదు.. ఏదీ అనుకూలించనప్పుడు కరుచుకుపోయిన నోటిని పెకిలించి మాటని అగాధాల్నుండి వెలుపలికి తీసుకు రావడమే అసలైన ధీరత్వం…
అప్పుడే మనిషి బ్రతికినా, చచ్చినా కాస్తంత విలువ!!
– నల్లమోతు శ్రీధర్
ఎడిటర్
కంప్యూటర్ ఎరా తెలుగు మేగజైన్
Leave a Reply