అదృష్టమో దురదృష్టమో కానీ ఎందరో మనసులోతులూ, ఆ మనసుల్లో గూడుకట్టుకున్న అంతులేని వేదనా నా దృష్టికి వస్తోంది.
భౌతిక ప్రపంచంలో గానీ, వర్చ్యువల్ వరల్డ్‌లో గానీ నాకెందరో ఆత్మీయులు ఉన్నారు.. ఏ ఒక్కరి వ్యక్తిగత విషయాలూ వేరొకరితో పంచుకోను, అలాగే దుర్వినియోగం చేసే వక్రబుధ్దీ లేదు.
నాతో ఉన్న ప్రపంచం ప్రతీ క్షణం ఆనందంగా ఉండాలని కోరుకునే నేను నా చుట్టుపక్కల ఉండే అందరి మనస్సుల్లోని వ
నిజమే జీవితం ఎన్నో సవాళ్లని ముందు పెడుతుంది!
సమస్యలూ, భిన్న మనస్థత్వాల వ్యక్తులూ, వారు సృష్టించే నరకమూ, మన నియంత్రణలో లేని పరిస్థితులూ… అన్నీ కలగలిపి నిండు జీవితాల్ని మొండిబరుస్తూనే ఉంటాయి.
…..
……
కానీ జీవితం ఆ సమస్యలే కాదు, ఆ పాత జ్ఞాపకాలే కాదు, లేదా ఈ క్షణమూ మెలిపెడుతున్న బాధాకరమైన పరిస్థితులే కాదు.
ఎంత బాధలో ఉన్నా మనస్సులో ఆనందాన్ని నింపుకోగలిగే ప్రజ్ఞ ఎప్పటికి సాధించగలం? బాధల్ని మోయడం తప్ప ఇంకా జీవితంలో మిగిలిందేం లేదా?
జీవితాంతం గడిచిపోయినవో, ఇప్పటివో బాధలే మోస్తూ ఉండాలంటే నా తోటి స్నేహితుల్లాగే నేనూ ఎంత బాధపడుతూ కూర్చోవాలో!
అవును… నిజం చెప్తున్నాను… నేను బాధపడడానికి వంద కారణాలు ఇప్పటికీ నాకున్నాయి!! కానీ అవేమీ నన్ను full extent బాధించలేకపోతున్నాయి. కారణం సమస్యల నుండి మనస్సుని detach చెయ్యడం భగవంతుడి దయో, నా ప్రాక్టీస్ వల్లనో సాధ్యపడింది.
మనందరికీ సామాజికపరమైనవో, ఆర్థికపరమైనవో, కెరీర్లోనో, వైవాహిక సంబంధాల్లోనో, కుటుంబాల్లోనో, స్నేహితుల మధ్యలో.. ఎన్నో ఎన్నో వందల నిరంతరం చుట్టుముడుతూనే ఉంటాయి.
చిన్నదైనా, పెద్దదైనా ప్రతీ సమస్యనీ మనస్సులోకి లోతుగా తీసుకుంటూ మనల్ని మనం ఎంత వేదనలో కుంగదీసుకున్నామో ఆలోచించండి!
నా దృష్టిలో ఆనందం అనేది.. స్విచ్ ఆన్, ఆఫ్ లాంటిది. ఇదే థీరీని నేను కొన్నేళ్లుగా నమ్ముతున్నాను. ఈ థీరీ కరెక్టే కాదో టెస్ట్ చేసుకుందామని చాలా బాధాకరమైన సందర్భాల్లోనూ మనస్సులో ఆనందాన్ని నింపుకుని సక్సెస్ అయ్యాను.
అంతే అర్థమైపోయింది.. జీవితం మనం ఎలా బ్రతకదలుచుకుంటే అలాగే ఉంటుందని!
బాధపడుతూ కూర్చున్నందువల్ల బాధలు తగ్గవు, సో మరి బాధపడడమెందుకు ఆనందంగానే ఉండొచ్చు కదా మనం? పుట్టెడన్ని బాధలు పెట్టుకుని మనం ఆనందంగా ఉంటే చూసే జనాలు విచిత్రంగా చూస్తారనా మన భయం? 🙂 పోనీయండి.. జనాల సింపతీ కోసం మనం బాధపడుతూ కూర్చోవాలా?
పెద్ద వయస్సు వచ్చిన వాళ్లు చనిపోయినప్పుడు సీన్లు గుర్తుతెచ్చుకోండి.. వాళ్లు పోయినందుకు ఆనందపడుతూనే ఉంటారు.. కానీ పైకి ఏడుస్తూ ఉంటారు సొసైటీ కోసం! సరే అప్పుడంటే ఎమోషనల్ డ్రామా తప్పదు కాబట్టి నటిస్తున్నామనుకోండి. మామూలుగా బ్రతికేటప్పుడూ మనం ఆనందంగా ఉండే ఛాన్స్ ఉండి కూడా.. జనాల సింపతీ కోసం బాధపడుతూ కూర్చుంటామా?
ఈ క్షణం నా ఆలోచన ఇలా సాగుతోంది అనుకుందాం.. "ఎందుకు నీ లైఫ్ ఇలాగైపోయింది… ఎన్ని కష్టాలొచ్చాయి.. అస్సలు నీ లైఫే ఎందుకు ఇలాగుండాలి.." ఇలా రకరకాల ఆలోచనలు వస్తున్నాయి. అవే అలోచనలు రిపీటెడ్‌గా మైండ్‌లో తిరుగుతున్నాయనుకుందాం. నా మానసిక స్థితి పుట్టెడు కష్టాల్లో కాక గంపెడు ఆనందంలో ఉంటుందా? 🙂
అదే ఈ క్షణం నాకు పెద్ద బాధ పెట్టుకుని కూడా "ఇవన్నీ కాజువలే… ఇవి నన్నేం చెయ్యగలవు" అనుకుంటూ చాలా కూల్‌గా ఉన్నాననుకుందాం. ఆ బాధ నా ఆనందాన్ని నాకు దూరం చెయ్యగలదా?
మనస్సులో ఆనందాల్ని కల్టివేట్ చేసుకోవాలి గానీ బాధల్ని కల్టివేట్ చేసుకోవడమేమిటి మరీ చేజేతులా జీవితాల్ని నాశనం చేసుకోవడం కాకపోతే!!
యెస్.. నేనెప్పుడూ ఆనందంగానే ఉంటాను.. నా చుట్టూ ఉన్న వాళ్లూ ఆనందంగా ఉండాలని కోరుకుంటున్నాను.. ప్రయత్నిస్తే సాధ్యం కాదా ఇది? ప్రయత్నించి చూడండి నా మీద నమ్మకం ఉన్న మిత్రులు.
– నల్లమోతు శ్రీధర్
ఎడిటర్
కంప్యూటర్ ఎరా తెలుగు మేగజైన్
Leave a Reply