పనిని నమ్ముకోవడం మానేసి పనిని అమ్ముకోవడం మొదలుపెట్టిన క్షణమే అసంతృప్తి మొదలైపోతుంది….
చేసే పనికీ, వచ్చే ఫలితానికీ బేరం కుదరడం లేదన్న అసంతృప్తితో నిరంతరం సంఘర్షణకు గురయ్యే జీవితాలెన్నో…
గంటకింత చొప్పున లెక్కేసుకుని సంపాదించే జీవితాల్ని చూసి చాలామంది అసూయ పడుతుంటారు… ఆ జీవితాల్లో ఏ గంటలోనూ సంతృప్తి మిగిలి ఉండదన్నది ఎవరూ గ్రహించలేరు..
పని ముఖ్యం… పని ద్వారా వచ్చే ఆనందం ముఖ్యం.. ఆ ఆనందానికి ఏ డబ్బూ సరితూగదు….
అవసరాలు తీర్చడానికే డబ్బు ఉపయోగపడుతుంది…. విలాసాలను అవసరాలుగా భ్రమించుకుని వాటినీ తీర్చుకోవాలనుకుంటే… జీవితం విలాసాల మధ్య విలపించే నరకమే అవుతుంది…!!
డబ్బుని నమ్ముకున్న వాళ్లు మహా అయితే 50-60 ఏళ్లు బ్రతుకుతారేమో….. అదీ రకరకాల అసంతృప్తులతో!
అదే పనిని నమ్ముకుని దాన్ని ఆస్వాదించే వారు పూర్తి సంతృప్తి వల్ల పెరిగే ఆయుష్షుతో నిండు నూరేళ్లూ బ్రతికే వాళ్లని మన పూర్వీకులను గుర్తు తెచ్చుకుంటే అర్థమవుతుంది…..
వైద్య ప్రమాణాలు పెరుగుతున్నా ఆయుష్షు పెరగాల్సింది పోయి మనిషి ఆయుష్షు క్షీణించడం వెనుక మనిషిలో పెరిగిపోతున్న స్వార్థం, అసంతృప్తే అస్సలు కారణం…
అందుకే బ్రతికినన్నాళ్లు డబ్బు పట్ల వల్లమాలిన వ్యామోహాన్నీ వదిలేసి… చేసే పనిలో సంతృప్తిని వెదుక్కుంటే… ఏ ఏటికాఏడు ఆయుష్షు పెరుగుతూనే ఉంటుంది… మొహంలో తేజస్సు కొట్టొచ్చినట్లు వస్తుంది…!!
గమనిక: ఇది ఎవరికైనా పనికొస్తుంది అన్పిస్తే ఇతరులకూ షేర్ చెయ్యగలరు.
ధన్యవాదాలు
– నల్లమోతు శ్రీధర్
ఎడిటర్
కంప్యూటర్ ఎరా తెలుగు మేగజైన్
Wonderful!!! This is very well suited to people working as IT Consultants in the western countries. Kudos to Sridhar!