పిచ్చివాళ్లం.. ఈ క్షణం ఈ జీవితం ఉంది అంటే… అది ఎంత అదృష్టమో నేను కళ్లారా చూస్తున్నాను…
ఈ ప్రపంచంలో మనకంటూ చోటు దక్కడం ఎంత అదృష్టమో గత కొన్ని రోజులుగా నేను గమనిస్తున్న పరిణామాలను బట్టి మరింత స్పష్టంగా అర్థమవుతోంది…
మెటర్నిటీ హాస్పిటల్లో లేబర్ వార్డ్‌లో తల్లులు పడుతున్న ప్రసవ వేదనని చూస్తే… మా అమ్మ గారిపై నాకు వ్యక్తపరచలేనంత గౌరవం పెరిగిపోయింది..
కొద్దిగా వయస్సూ, ఆలోచనా, బుద్ధీ రాగానే…….
విర్రవీగుతున్నాం………………………………
మనమంటూ ఈ ప్రపంచంలోకి ఊడిపడడం యాక్సిడెంటల్ కాదూ, సైన్సూ కాదు… ఖచ్చితంగా అదృష్టం.
తన ప్రాణాన్ని ఫణంగా పెట్టి తల్లి చేసే పోరాట ఫలితమే మన జీవితం….
తన వల్ల కాదనుకుంటే… తల్లి ఏ క్షణమైనా మనల్ని తుంచేయవచ్చు… అయినా ఆ మహాతల్లుల గొప్ప ఓర్పుకి వరంగా మనకు జీవమూ, జీవితమూ ఏర్పడుతోంది… జీవిత కాలంలో ఒక్క రోజైనా ఈ విషయం మనస్సు పెట్టి ఆలోచించలేని ఏ మానవ జీవితమైనా నిరర్థకమైనది…
"అయ్యో.. భగవంతుడా" అని తల్లులు పురుటి నొప్పులతో అరిచే ప్రతీ అరుపూ ఎలాంటి మనిషినైనా కదిలించి వేస్తుంది…. వారి రుణం ఏమిచ్చీ తీర్చుకోలేం….
నా వరకూ నాకు ఈ జీవితం ఎంత గొప్ప భగవత్ ప్రసాదమో చాలా చాలా చాలా స్పష్టంగా అర్థమైంది…. అలా అర్థమైన క్షణం జీవితంపై బాధ్యత, ప్రేమా మరింత పెరిగింది…..
జీవితాన్ని ఏదో కాజువల్‌గా గడిపేయడం కాదు… ఈ చిన్న జీవితాన్ని అండర్లైన్ చేసుకోవాలి… అని ఎప్పటి నుండో నేను నమ్మే సిద్ధాంతానికి మరింత బలం చేకూరింది…!!!
భగవంతుడికీ, భగవత్ స్వరూపులైన తల్లులకూ ప్రణామాలతో…
– నల్లమోతు శ్రీధర్
ఎడిటర్
కంప్యూటర్ ఎరా తెలుగు మేగజైన్
http://computerera.co.in
http://youtube.com/nallamothu
http://nallamothusridhar.com
యాదేవీ సర్వభూతేషు మాతృరూపేణ సంస్థితా
నమస్తస్యై నమస్తస్యై నమస్తస్యై నమోనమః
chala chakkaga chepperu