ఆలోచనల్లోనూ ఓ ముసలితనం ఉంటుంది…
పెద్దవాళ్లు లేటెస్ట్ ట్రెండ్లను అర్థం చేసుకోవట్లేదు… వాళ్లు వేస్ట్ అని తరచూ చాలామంది యూత్ కంప్లయింట్లు చేస్తుంటారు….
మరి యూత్ ఆలోచనల్లో ఉన్న ముసలితనం గురించి ఎవరూ మాట్లాడరు 🙂
చైనీస్ సినిమాల్లో యుద్ధవిద్యలు, విన్యాసాలు చేసే వారిని చూసి.. wow ఏం చేశారు…. అని చాలామంది యూత్ ఆశ్చర్యపోతారు… కొంతమందైతే “మన శరీరాలూ ఉన్నాయి… కనీసం క్రిందికి కూడా వంగలేం” అని లోపల్లోపల అనుకుంటూ కూడా ఉంటారు.
చైనీస్ తమ సంస్కృతికీ, తరతరాలుగా వస్తున్న విద్యలకు ఎంతో ప్రాధాన్యత ఇవ్వబట్టే ప్రతీ ఒక్కళ్లూ శారీరకంగా చాలా ఫిట్‌గా ఉంటున్నారు… ఒలింపిక్స్‌లో అగ్రస్థానంలో ఉండగలుగుతున్నారు.
చైనీయుల మాదిరిగానే మనకూ ఘనమైన నేపధ్యముంది… మన పూర్వీకుల నుండి తరతరాలుగా యోగా, పూర్తిగా మరుగున పడిపోయిన కొన్ని యుద్ధ విద్యలూ వంటివెన్నో మన దేశ చరిత్రలోనూ ఉన్నాయి..
మనకు ఫిట్నెస్ అంటే six pack బాడీనే! యోగా వల్ల ఫిట్నెస్ వస్తుంది అన్నది చాలామందికి రుచించదు… యోగా అంటే మన యూత్ యొక్క ముసలి ఆలోచనల ప్రకారం… అది రకరకాల జబ్బులతో కూడిన ముసలి వాళ్లకు మాత్రమే అని!
ఇక్కడ మీరు జిమ్‌కి వెళ్లి మజిల్ మాస్‌ని పెంచుకోవడం ద్వారా ఫిట్నెస్ తెచ్చుకోవడానికీ, యోగా ద్వారా సాధించే ఫిట్నెస్కీ చాలా వ్యత్యాసం ఉంది.
శరీరం యొక్క షేప్‌ని మెయింటైన్ చెయ్యడానికీ, ప్రదర్శించుకోవడానికి మాత్రమే జిమ్‌లకు వెళ్తుంటారు.. జిమ్‌లో వర్కవుట్ల ద్వారా మజిల్ మాస్ రావాలంటే దానికి తగినంత ప్రొటీన్లూ, కార్బోహైడ్రేట్లతో కూడిన ఆహారం కావాలి… ఇలా ఆహారాన్ని ఎక్కువ తీసుకోవడం ద్వారా కండలు ఖచ్చితంగా వస్తాయి… అవే కండలు ఓ నాలుగు రోజులు సరైన ఆహారం తీసుకోపోయినా, మానసికంగా డిప్రెషన్లో ఉన్నా అంతే వేగంగా కరిగిపోతాయి…
అంటే ప్రొటీన్ తీసుకుని.. శరీరంలో biceps, triceps, ఇతర భాగాలపై దృష్టి పెట్టి ఎక్కువ ఫిజికల్ ఏక్టివిటీ ద్వారా మనం శరీరాకృతిని సాధించి దాన్ని ఫిట్నెస్గా భావిస్తున్నాం… అందులో తప్పేం లేదూ అదీ ఓ రకమైన ఫిట్‌నెస్సే….
అయితే భారతీయులకు తరతరాలుగా వస్తున్న యోగాసనాలు అనేవి ఉన్న శారీరక నిర్మాణాన్ని పటిష్టం చేస్తాయి… అవి శరీరాన్నీ, మజిల్ మాస్‌నీ పెంచడానికి ఉపయోగపడవు.. కానీ అవి అంతర్గతంగా శరీరంలోని అన్ని అవయువాల్ని ధృడంగా చేస్తాయి, శారీరకంగా చాలా బలంగా ఉన్న అనుభూతిని లోనుచేస్తాయి, అలాగే అనేక మానసిక సమస్యల్ని ఎదుర్కొనే ధృఢచిత్తాన్నీ కలిగిస్తాయి…
చైనీయులు తమ పూర్వీకులు అందించిన రహస్యాల్ని అవి “ముసలి అలవాట్లు”గా కొట్టి పారేయకుండా చిన్న పిల్లల నుండి ప్రతీ ఒక్కరూ అనుసరిస్తున్నారు.. అందుకే వారి శరీరాల్లో యౌవ్వనం పెద్ద వయస్సులోనూ అలాగే కొనసాగుతూ ఉంటుంది…
మనం మాత్రం యోగాసనాలు అంటే జబ్బులు ఉన్న వాళ్లు చేసేవిగానూ, అదే జిమ్ ద్వారా చేసే వర్కవుట్లు…. ఫిట్నెస్ మెయింటైన్ చెయ్యడానికీ, అమ్మాయిల్ని పడేయడానికీ, రొమ్ములు విరుచుకుని బైక్ రైడ్ చెయ్యడానికీ.. కండలు చూపించుకోవడానికీ పనికొచ్చే చాలా గొప్ప ఎస్సెట్లుగానూ భావించి…. చిన్న వయస్సులోనే తెలీకుండానే ముసలివాళ్లుగా అవుతున్నాం.
గమనిక: ఇది ఎవరికైనా పనికొస్తుంది అన్పిస్తే ఇతరులకూ షేర్ చెయ్యగలరు.
ధన్యవాదాలు
– నల్లమోతు శ్రీధర్
Leave a Reply