సినిమాల్లో, సీరియళ్లలో, స్టేజ్ షోలలో కొన్ని ఎస్టాబ్లిషింగ్ shots ఉంటాయి..
ఒక డైలాగ్ ఓ ఆర్టిస్ట్ చాలా పవర్‌ఫుల్‌గా చెప్తాడు… మనం డైలాగ్ ఎంజాయ్ చేస్తాం కానీ ఇంకా ఏదో వెలితి ఉంటుంది.. అంతలో డైరెక్టర్ హీరోయిన్ వైపో, విలన్ వైపో… లేదా ఓ క్యారెక్టర్ ఆర్టిస్ట్ అడ్మైరింగ్ ఫేస్ వైపో క్లోజప్ షాట్ వేస్తాడు… ఆ ఎక్స్ప్రెషన్ చూడడం ఆలస్యం.. మన ఫీల్ పీక్‌కి చేరుకుంటుంది.
హీరో పవర్‌ఫుల్‌గా కన్పించాలంటే విలన్ అంతకన్నా పవర్‌పుల్‌గా ఉండాలన్నది ఓ బేసిక్ సినిమా రూల్! ఇక్కడ లాజిక్ ప్రతినాయకుడి రియాక్షన్లని బట్టి క్యారెక్టర్ బలంగా తయారవుతుందన్నది!
ఇది ఎందుకు ప్రస్తావిస్తున్నానంటే..
మన లైఫ్‌లోనూ జనాల రియాక్షన్లని బట్టే మన క్యారెక్టర్ ప్రభావితం చెయ్యబడుతూ ఉంటుంది.
మనం ఎంత శక్తివంతులమైనా, ఎవరో వచ్చి భుజం తట్టినప్పుడు వచ్చే కిక్కే వేరు.. అలాగే ప్రేమికుల మధ్య ఎంత ప్రేమ ఉన్నా… లవ్ సీన్ల ద్వారా ఒకర్నొకరు ఐడెంటిఫై చేసుకుని ఓ భ్రాంతిలోకి చేరుకోవడమే చాలా థ్రిల్లింగ్‌గా ఉంటుంది..
ఇక్కడ ఓ చిన్న ఉదాహరణ…..
———————————-
నలుగురు వ్యక్తులు ఓ చోట కబుర్లు చెప్పుకుంటున్నారనుకుందాం… ఆ నలుగురిలో ఓ వ్యక్తి మరో వ్యక్తిని బాగా ఇష్టపడుతున్నారనుకుందాం. మిగతా ఇద్దర్నీ పెద్దగా పట్టించుకోకుండా.. చాలా చీటికీ మాటికీ తనకి ఇష్టమైన వ్యక్తి రియాక్షన్లని గమనిస్తూ… ఆ రియాక్షన్లకు తగ్గట్లు విపరీతంగా నవ్వడమో, ముడుచుకుపోవడమో మనం చాలా గేదరింగ్స్‌లో గమనిస్తుంటాం 🙂
అంటే మనుషుల రిలేషన్లు అన్నీ రియాక్షన్ల మీదనే ఆధారపడి ఉన్నాయి.. కానీ పాపం జనాభా ఈ మధ్య కాలంలో చాలా least expressiveగానూ, more boringగానూ ప్రవర్తించడం అలవాటు చేసుకుంటున్నారు. రిలేషన్లు బలంగా తయారవ్వకపోవడానికి ఈ కమ్యూనికేషన్ గ్యాపే కారణం.
మన నవ్వుని చూసి, మన ఆనందాన్ని చూసి… మన కేరింగ్ నేచర్నీ, హెల్పింగ్ నేచర్నీ చూసి.. సంతోషపడాలనుకుంటున్న జనాభా మన చుట్టూ చాలామందే ఉన్నారు.
ఎప్పుడూ అలా చిరాకు, బోరింగ్ ఫేస్ పెట్టుకోకండి… మిమ్మల్ని చూసి మిగతా వాళ్లూ, మిగతా వాళ్లని చూసి మరికొంతమందీ చిరాకుగా తయారైపోయి.. చివరకు నవ్వడం, సంతోషంగా ఉండడం ఓ పెద్ద పాపం అన్నంత పరిస్థితి రావొచ్చు 🙂
– నల్లమోతు శ్రీధర్
రావచ్చునేమో ఏంటండి….దారిలో ఉంది 🙂
పద్మార్పిత గారు హహహహ 🙂