“ఎందుకు రిలేషన్లు ఆర్టిఫీషియల్‌గా తయారవుతున్నాయంటూ..” చాలామంది ఆవేదన వ్యక్తం చేస్తుంటారు. రెండే రెండు ప్రధానమైన కారణాలు..
1. అవసరాల కోసమో, సర్కిల్ మెయింటైన్ చెయ్యడానికో మొహాన నవ్వు పులుముకుని.. “హాయ్.. బాగున్నారా.. మీరు చాలా గ్రేటండీ..” అనే పళ్లికిలించేసి.. పక్కకెళ్లి “వెధవ.. ఓ నవ్వు నవ్వితే, ఓ పొగడ్త పొగిడితే చాలు ఫ్లాట్ అయిపోతాడు.. హమ్మయ్య వాడి ఇగో శాటిస్ఫై చేశాం.. ఇంకెప్పుడైనా పనికొస్తాడు..” అని అనుకునే బాపతు జనాలూ! ఇలాంటి వాళ్లని చూసీ చూసీ జనాలందరూ ఇంతేనని కేటగరైజ్ చేసే మనమూ!!
2. రిలేషన్‌ని ప్రాణంగా భావిస్తూ కూడా.. దాన్ని express చెయ్యడం చేతకాకా.. “హాయ్, బై” వంటి కాజువల్ రిలేషన్లు మెయింటైన్ చెయ్యడం ఇష్టం లేకా.. అలాగని మనస్ఫూర్తిగా ప్రాణప్రదంగా గడిపే సమయం వారికీ, వారు స్నేహం చేసేవారికీ లేక.. సమాదైపోతున్న విలువైన బంధాలు.
—————–
వీటిల్లో మొదటి రకం రిలేషన్లు లేకపోయినా నష్టం లేదు. రెండవ రకం రిలేషన్లు మాత్రం ఏళ్ల తరబడి మాట్లాడుకునే వీలు చిక్కకపోయినా.. అపార్థాలు చేసుకుని దూరం చేసుకోకండి.. మీ ప్రాణాలు మీ దగ్గర ఉన్నాయనుకుంటున్నారు.. ఇలాంటి ఆత్మీయుల ఆలోచనల్లో పదిలంగా ఉన్నాయి మీ ప్రాణాలు.
మాటలు లేనంత మాత్రానా, సమయం చిక్కనంత మాత్రానా మనిషి మనస్సు ఎక్కడికీ పోదు.. మన చుట్టూ ఏ చిన్ని ఆలోచనతోనో బలమైన బంధం అల్లేస్తూ ఉంటుంది.
– నల్లమోతు శ్రీధర్
Nice one:-):-)