హృదయాలైతే ఉన్నాయి గానీ పాపం ఊపిరాడక ఉక్కిరిబిక్కిరవుతూ అవస్థలు పడేస్తున్నాయి.. ఏ హృదయం ఏ హృదయంతో ముడిపడాలో తేల్చుకోలేక..!
అనుక్షణం కళ్లతో, ఆలోచనలతో, అంచనాలతో స్కానింగులూ, క్వాలిటీ ఛెకింగ్లూ, మిస్ మాఛింగ్లూ.. ఏం కావాలో తెలీకా.. ఏం ఉండాలో తేల్చుకోలేకా.. ఎలాగుండాలో అర్థమూ కాకా… ఆ అసంతృప్తినంతా మనుషులపైకి నెట్టేస్తూ..
ఎందుకు పుట్టుకొచ్చిందో హృదయంలో ఇంత వెలితి… నింపుకోవడానికీ మనిషీ దొరకనీ వ్యధ…
నివురుగప్పిన అసంతృప్తులన్నీ అంతర్లీనంగా బుసలుకొడుతుంటే పైకి సంతృప్తికరమైన నవ్వుని పులుముకుని… రగిలే హృదయం లోలోపలా… అర్థం లేని నటన పైపైనా.. మొత్తానికి దశా, దిశా ఎరుగని ప్రయాణమే…
పోయేవరకూ హృదయం శాంతించదు… కాసేపు ఎగిరెగిరిపడుతూ, కాసేపు ఎడారిలా మారిపోతూ… ఏది నిజమో ఏది అబద్ధమో అర్థం కాక పిచ్చెక్కిస్తూ… మొత్తానికి అద్భుతమైన లైఫ్!!
– నల్లమోతు శ్రీధర్
Leave a Reply