కళ్లెదురు ఒకటే ఉంది..
కసి.. లక్ష్యం..
కొన్ని వందలసార్లు ఈ మాటలు express చేసి ఉంటాను.. అయినా ఎప్పుడూ అదే fireతో వస్తాయి నా మనస్సులో నుండి ఈ మాటలు.. ఏదో అల్లాటప్పాగా, ఆషామాషీగా బ్రతకడానికి పుట్టలేదు ఈ భూమ్మీద నేను. నేను చేసే ప్రతీ పనీ ఓ పాషన్‌తో కూడుకున్నదే.. యధాలాపంగా పనులు చెయ్యడం జీవితంలో ఏ దశలోనూ తెలీదు.
నాకే కాదు.. ఎవరికైనా.. ఈ లైఫ్ ఓ అద్భుతమైన platform. కాళ్లూ, చేతులూ, మనం బ్రెయిన్లో ఓ థాట్ ఆలోచించగానే దానికి తగ్గట్లు శరీరమంతా రియాక్టయ్యే ఓ అద్భుతమైన మెకానిజం.. సర్వేంద్రియాలనూ ఫోకస్ చెయ్యగల బ్రెయిన్.. మన బ్రతుకేదో మనకు తప్ప ఎవరి జోలికీ వెళ్లని ఓ స్పష్టమైన జీవన శైలీ.. ఇంతకన్నా ఏం కావాలి.. జీవితంలో కావలసినంత సాధించడానికి?
చాలా అంటే చాలా ఫిజికల్, మెంటల్ రిసోర్సెస్ వేస్ట్ అయిపోతున్నాయి ప్రతీ ఒక్కరివీ. మనం వృధాగా కాలక్షేపం చేసే ప్రతీ పనికీ ఓ రీజన్ సృష్టించుకుని ఎలాగోలా లేస్తూ.. నిద్రపోతూ.. నథింగ్‌గా ఎస్కేప్ అయిపోయి బ్రతికేయడానికి అలవాటు పడిపోయాం.
నావరకూ నాకు కొన్నిసార్లు ఎనర్జీ సరిపోవట్లేదు.. టైమ్ సరిపోవట్లేదు.. లేదంటే నాలో ఉన్న కసి ఇంకెంత విస్తృతంగా ఈ ప్రపంచం మీద పరిచేవాడినో.. వేస్టయిపోతున్న అందరి ఎనర్జీ పట్టుదల ఉన్న వ్యక్తులకు ట్రాన్స్ఫర్ చెయ్యబడితే ఎంత బాగుణ్ణో..
రిలాక్స్డ్గా బ్రతికింది చాలు… కనీసం ఇప్పటికైనా ఏం చెయ్యాలో, మనదైన ముద్ర ఈ ప్రపంచం మీద ఎలా వెయ్యాలో ఆలోచిద్దాం… ఏళ్లకు ఏళ్లు గడిచిపోతున్నాయి… ఏదో ఒక క్షణం చచ్చిపోతాం.. చచ్చేలోపు బ్రతుకంటే ఏంటో మీనింగ్ తెలుసుకునీ.. ప్రపంచానికి తెలిపీ మరణిద్దాం…
- నల్లమోతు శ్రీధర్