“ఫలానా వస్తువుంటే.. ఎంత బాగుంటుంది..” ఇంకా హాపీగా పనిచేయగలుగుతాం అని కొన్నేళ్ల క్రితం మనకు అన్పించేది…
అంటే మనం కష్టపడే వాళ్లం.. అలా కష్టపడ్డందుకు చిన్న చిన్న కోరికలు తీర్చుకుని సంతృప్తి చెందే వాళ్లం…
ఇప్పుడు చిన్న చిన్నవేమిటి.. చాలా పెద్ద పెద్దవి కూడా కోరికలు క్షణాల్లో తీరిపోతున్నాయి… కానీ మునుపటిలా సంతోషమే మిగలట్లేదు..!
వచ్చిన తేడా ఒక్కటే.. మనం కష్టపడకుండా కోరికలు మాత్రం తీర్చుకోవడం!
ఓ చిన్న ఉదాహరణ చెప్తాను…
మేగజైన్ వర్క్ చేస్తూ ఇష్టమైన పాటలన్నీ playlistలో పెట్టుకుని వినడం నాకు అలవాటు..
2000 టైమ్లో 2 స్పీకర్లు చాలా బాగున్నాయనిపించేవి… 2006లో 5.1 స్పీకర్ సిస్టమ్ అయితే ఇంకా బాగా పాటలు ఎంజాయ్ చేస్తూ పనిచేసుకోవచ్చు కదా అన్పించింది… చాలా ఉత్సాహంగా కొన్నాను…
ఆడియో క్వాలిటీ అయితే పెరిగింది గానీ… కష్టపడడం తగ్గడం వల్ల ఆడియో క్వాలిటీ ఉన్నా పాటల్ని ఆస్వాదించలేకపోతూ ఉన్నాను…
——————————————————-
డబ్బు మనకు ఆనందాన్ని ఇస్తుందనుకుంటున్నాం…
వాస్తవానికి ఆ డబ్బే మన ఆనందాన్ని లాక్కెళుతోంది..
డబ్బుంటే ప్రతీదీ క్షణాల్లో తీరిపోతుంది…. అలా క్షణాల్లో తీర్చుకోవడం వల్ల అస్సలైన థ్రిల్ ఏమీ ఉండదు…
అదే “కష్టపడితే డబ్బొస్తుంది…. ఆ డబ్బుతో కొద్దికొద్దిగా కోరికలు తీర్చుకోవచ్చు” అనే పరిస్థితే ఉంటే.. కనీసం ఆ కోరికలు తీర్చుకోవడం కోసం అయినా కష్టపడే వాళ్లం.. ఆ కష్టం మనకు చాలా సంతృప్తిని ఇచ్చేది.. చివరకు మనం అనుకున్న కోరికా తీరాక మరింత సంతోషంగానూ ఉండేది!
అందుకే వీలైనంత వరకూ ప్రపంచాన్ని డబ్బుతో చూడకండి….. ప్రపంచం కొనగలిగేదిగానే కన్పిస్తుంది!
ప్రపంచాన్ని కొనేయగలరు గానీ.. చిన్న చిన్న ఆనందాల్ని కొనడానికి మన జీవితం సరిపోదు..!!
– నల్లమోతు శ్రీధర్
u r correct Sridhr Garu…