జస్ట్ మైండ్‌లో వచ్చిన థాట్‌ని as it is రాస్తున్నానంతే.. తప్పుగా అర్థం చేసుకోవలసిన పనే లేదు.
సరే ప్రశ్నేంటంటే…
ఓ ఆర్నెల్లు కదలకుండా కూర్చుంటే మన ఒళ్లే మనకు ఒంగదు..
ఏళ్ల తరబడి సమాజంలో పేరుకుపోయిన సమస్యలన్నీ కొలిక్కి రావాలంటే ఒళ్లొంచి పనిచేయడమా పరిష్కారం.. కష్టపడకుండా బ్రెయిన్‌ని ఉపయోగించి ఆదేశాలు, సూచనలు, సలహాలూ జారీ చెయ్యడమా వర్కవుట్ అయ్యేది?
ఓ చిన్న ఉదాహరణ చెప్తాను.. పొలాల్లో రోజువారీ కూలీలుంటారు.. అలాగే వాళ్లకు డబ్బులిచ్చే రైతూ ఉంటాడు..
రైతు ఖద్దరు బట్టలు వేసుకుని.. "ఏరా ఏంటా పని… అలా చేయి.. ఇలా చేయి, ఎందుకు వస్తారురా పనిరాని వాళ్లంతా పనికి" అని గట్టు మీద నుండే అంటుంటాడు.
చేలో పనిచేసే కూలీకి కోపమొచ్చినా… "అలాగేనయ్యా" అనేసి ఆ రైతు ఇగోని శాటిస్ఫై చేసి అప్పటిదాకా బాగా పనిచేసిన వాడల్లా ఆ రైతు ఉచిత సలహాలకు మరింత కోపంతో పనిచేయడమే మానేసి పనిచేస్తున్నట్లు నటిస్తూ పోతాడు.
ఖద్దరు బట్టలు ధరించిన రైతులా ఉండి సమాజాన్ని మార్చడం కుదరని పని.. చిత్తశుద్ధితో పనిచేసే కూలీలా ఉంటే ఏం కావాలన్నా చేయొచ్చు.. అది మన ఒంటి సత్తువ కొద్దీ ఎంతకైనా ఓర్చుకుని సాధించే పూర్తిగా మన చేతుల్లో ఉన్న విషయం.
మనం ఖద్దరు బట్టలు ధరించొచ్చు తప్పులేదు.. మనకు సమాజంలో గౌరవం కావాలంటే కొన్నిసార్లు అవి వేసుకోవలసిందే. కానీ రోజంతా సామాజిక గౌరవం సాధించడానికే ఖద్దరు బట్టలు వేసుకుని కబుర్లు చెప్పుకుంటూ బ్రతకితే మనకు విజువల్ ఐడెంటిటీ వస్తుందేమో గానీ వర్క్ ఐడెంటిటీ రాదు.
పని ఉన్నప్పుడూ.. చేయాల్సిన పని ఖద్దరు బట్టలు మాసిపోవడం కన్నా ముఖ్యమైనది అనుకున్నప్పుడు చినిగిన బట్టలేసుకునైనా చిత్తశుద్ధితో పనిచేసే మనుషులు ఈ సొసైటీకి కావాలి తప్ప.. పని మానేసి బుద్ధితో నాలుగు మాటలు చెప్పుకుంటూ బ్రతికే జనాలు భూమికి భారమే.
ఈ మాటలు రాయడానికి నాకెంత అర్హత ఉందో తేల్చుకోవడం మీదే చాలామంది దృష్టి ఆగిపోవచ్చు 🙂 మీరూ ఆ కోవకు చెందినవారైతే.. ముందు నా దగ్గర తేల్చుకుని.. తర్వాత మీరు ఆచరించడం మొదలుపెట్టే రకం అయితే ఓ నాలుగు రోజులు నాతో స్పెండ్ చేసి నా వర్క్ స్టైల్ కన్ఫర్మ్ చేసుకున్నాకైనా నా మాటల్ని ఫాలో కావచ్చు.
ఒళ్లొంగని మనం సమాజపు ఒళ్లొంచాలని బద్ధకంగా వంగుతున్నాం. సమాజాన్ని ఏదేదో చేయాలనుకుంటున్నాం..
మన నుండి ఒక్క నూలుపోగంతైనా ఈ సమాజానికి ఉపయోగం లేనప్పుడు అస్సలు మన స్థాయేమిటి? ఆ నూలుపోగంతైనా ఉపయోగాన్ని సమాజానికి కల్పించి మాట్లాడే అర్హత సాధిస్తే బాగుంటుందేమో..
ధన్యవాదాలు
గమనిక: ఇది ఎవరికైనా ఉపయోగపడుతుందన్పిస్తే ఇతరులతో షేర్ చెయ్యగలరు
– నల్లమోతు శ్రీధర్
ఎడిటర్
కంప్యూటర్ ఎరా తెలుగు మేగజైన్
http://computerera.co.in
చాలా చక్కగా చెప్పారు. ఖద్దరు బట్టలు వేసుకుని సమాజాన్ని వుద్ధరించే పనిని భుజాల మీద వేసుకున్న రాజకీయనాయకులకి ఇది బాగా వర్తిస్తుంది.
bagundi. meru post chesavey vathi gurichi comment bagundi ani chapadum routine ga marandi. etv suman gurnichi me comment bagundi