1998 – 2000 మధ్య ప్రాంతం..
పంజాగుట్ట కాలనీ రోడ్‌కి ఆనుకునే ఉండే దుర్గాభవాని గుడి ఎదురుగా 9/2RT అనే ఇల్లు అది…
9/2 RTని ప్రధాన కధాంశంగా పెట్టి ఓ సినిమా తీయొచ్చు 🙂 అంత గొప్ప హిస్టరీ కలిగి ఉందది.
ప్రస్తుతం కాంగ్రెస్ పార్టీ ఆంధ్రప్రదేశ్ వ్యవహారాలకు సంబంధించి ఢిల్లీలో ఉంటున్న నా క్లోజ్ ఫ్రెండ్ విజయ్ వర్మ అప్పట్లో రెంట్‌కి తీసుకుని.. Distance Education కోర్సులూ, ఇతర రాష్ట్రాల ఇంజనీరింగ్, మెడికల్, ఫార్మసీ కాలేజీల్లో అడ్మిషన్లూ చూసేవాడు.
నేను PACE కంప్యూటర్ ఎడ్యుకేషన్ వెంకటరెడ్డి గారు ప్రారంభించిన "కంప్యూటర్ వరల్డ్" పత్రికకు ఎడిటర్‌గా మేగజైన్ ప్రిపరేషన్ etc మొత్తం అక్కడే చూసేవాడిని.
నాకు సినిమా ఇండస్ట్రీలో ఉన్నప్పటి నుండి ఆత్మీయులైన అప్పటి Indian Express గ్రూప్‌లో వస్తున్న ఆంధ్రప్రభ వార పత్రిక ఎడిటర్ వల్లూరి రాఘవరావు.. అక్కడే కలిసేవారు. ఆంధ్రప్రభలో అప్పట్లో సక్సెస్ స్టోరీస్ అని నావి రెగ్యులర్ ఆర్టికల్స్ వస్తుండేవి.. వల్లూరి గొడవపెట్టి రాయి శ్రీధర్.. ఇలాంటివి రాయడానికి నీకన్నా అర్హులెవరు అని వెంటపడబట్టి. యండమూరి గారి కాలమ్ నావీ పక్క పక్క పేజీల్లో వచ్చేవి. యండమూరి గారు చాలా బాగా రాస్తున్నారని వల్లూరి గారితో అనే వారట. ఆ నేపధ్యంలో వల్లూరి గారూ, యండమూరి గారూ, సినిమా ఏక్టర్ బెనర్జీ గారు, కాదంబరి కిరణ్ కుమార్ గారు.. యండమూరి గారి గెస్ట్ హౌస్‌లో పలుమార్లు పిచ్చాపాటీగా కలుస్తూ ఉండేవాళ్లం.
మీలో చాలామంది నంది అవార్డుల ఫంక్షన్లు, ఇతర పెద్ద సినిమా, కల్చరల్ ఫంక్షన్లలోనూ గమనిస్తే.. తెల్లగా, చూడడానికి చాలా బాగుండే మురళీకృష్ణ గారనే వ్యాఖ్యాతని గమనించొచ్చు. ఆల్ ఇండియా రేడియో అనౌన్సర్ ఆయన.. నాకు బ్రదర్ లాంటివారు.. ఆయనా నేనూ అదే 9/2RTలో కలుసుకునేవాళ్లం.
నల్లకుంటలోని శివమ్ రోడ్లో CA ప్రిపేర్ అయ్యే వారి కోసం కామరాజ్ గారని బి.వి. పట్టాభిరాం గారి రెలెటివ్ అకాడమీ ఒకరిది చాలామందికి సుపరిచితం. కామరాజ్ చూసుకునేలా ఆ అకాడమీ ఫస్ట్ మొదలుపెట్టింది 9/2 RTలోనే. కామరాజ్ గారూ, నేనూ ఎప్పటికీ మర్చిపోలేని మిత్రులం.
ఇకపోతే అప్పట్లో "వైఫ్" అని ఓ సినిమా వచ్చింది.. మంజుల కూతురు హీరోయిన్గా. ఆ సినిమా 9/2RTల్లో మా మిత్రులందరి సమక్షంలో రూపకల్పన జరిగిందే. సిటీ అకాడమీ రావిపల్లి రాంబాబు గారు దాని డైరెక్టర్. ఆయనా మా ఫ్రెండ్స్ గ్రూప్‌లో ఒకరు.
ఆర్.బి. అంకం గారని ప్రస్తుతం కూకట్‌పల్లిలో ప్రెసిడెన్సీ కాలేజీ నిర్వహిస్తున్న మిత్రులు అప్పట్లో పరిఛయస్థులే.
అలాగే సీనియర్ కాంగ్రెస్ నాయకులు మల్లు రవి, రమేష్ గార్లతో పరిచయమూ అప్పుడే జరిగింది.
ఇకపోతే రకరకాల యూనివర్శిటీల నుండి "స్కాలర్షిప్ లు పొందడం ఎలా" అనే బుక్ అప్పట్లో నేను రాస్తే విజయ్‌వర్మ పబ్లిష్ చేశాడు. దాని కోసం ఇప్పుడు అందరికీ సుపరిచితమైన మందకృష్ణ మాదిగ వచ్చి కాసేపు ఇంకా హెల్ప్ కావాలి శ్రీధర్ గారు అంటూ ఓ గంటకుపైగా గడిపి వెళ్లారు.
అప్పట్లో పరిచయమైన ఇంకా చాలామంది ధిగ్గజాల వివరాలు లెంగ్తీ అవడం వల్ల పంచుకోవట్లేదు.
ఇదంతా ఈరోజు రాయడానికి కారణమైన లింగబాబు గురించీ రాయాలి. ప్రస్తుతంసశేషం, రైల్వేస్టేషన్ వంటి సినిమాలకు కెమెరామెన్‌గా పనిచేస్తూ, మధ్యలో సంబంరం సినిమా టైమ్‌లో దశరధ్ వంటి దర్శకుడి వద్ద పనిచేసిన వ్యక్తి లింగబాబు.
ఒక అతి సాధారణ వ్యక్తి కష్టపడితే ఎంత మంచి స్థానంలో ఉండొచ్చు అనడానికి ఓ ఉదాహరణ తను.
అప్పట్లో మా రూమ్‌లో అసిస్టెంట్‌గా మా అందరి ఆకలి తీరుస్తూ.. అందరితోనూ అటాచ్డ్ గా ఉండేవాడు లింగబాబు.
ఫేస్బుక్ ద్వారా వెదికి పట్టుకుని నిన్న జర్నీలో ఉంటే మెసేజ్ పెట్టాడు.. "శ్రీధర్ సర్ ఎలా ఉన్నారు.. అస్సలు ఎంత హాపీగా ఉందో మిమ్మల్ని మళ్లీ కలవడం అంటూ".
ఇంతకుముందే కాల్ చేసి మాట్లాడా.. ఒక్కటే మాటన్నాడు.. "మీ మొహంలో ఆ చిన్నపిల్లాడి కల్మషం లేని తత్వం, మీ మంచితనం అలాగే ఉన్నాయి సర్" అంటూ.
లింగబాబు చాలా మంచి పొజిషన్‌కి వెళ్తాడని ఎప్పుడూ చెప్తుండే వాడిని.. నా బ్రదర్ వల్లూరి రాఘవరావు గారూ చాలా ఎంకరేజ్ చేస్తుండే వాళ్లు.
నేను సినిమా రంగంలో చెన్నైలో ఉన్నప్పటి అనుభవాలు చాలానే ఉన్నాయి. ఈరోజు లింగబాబుతో మాట్లాడబట్టి ఓసారి నాకూ రీకాల్లా ఇవంతా రాద్దామన్పించింది.
ఒక్కటే అన్పిస్తోంది.. అప్పుడు అందరం చాలా ఫ్రెండ్లీగా ఉండే వాళ్లం.. కష్టపడే వాళ్లం.. ఎవరం ఎక్కడ తేలతామో… ఏ స్థాయికి వెళ్తామో ఊహకు చిక్కేది కాదు. ఇప్పుడు అందరూ మంచి మంచి పొజిషన్స్‌లో ఉన్నారు.
సో ఫ్రెండ్స్ లైఫ్ పట్ల భయాలు అవసరం లేదు. కష్టాన్ని నమ్ముకుందాం. కష్టపడడం చేతకాని రోజునే లైఫ్ పట్ల భయపడాలి.
ధన్యవాదాలు
– నల్లమోతు శ్రీధర్
ఎడిటర్
కంప్యూటర్ ఎరా తెలుగు మేగజైన్
మీ ముఖంలో కనిపించే పసిపిల్లగానివాని తత్వం మీతో మాట్ళాడిన ఎవరికైనా మీస్నేహం వదులుకోబుధ్ధి కాదు. జైశ్రీరాం
దుర్గేశ్వరరావు గారు ధన్యవాదాలండీ
నా స్వభావాన్ని నాకన్నా బాగా అర్థం చేసుకున్నారు.. 🙂