ఎంతైనా వాళ్ల వాళ్లంటే ఎంత ఎఫెక్షనో… అని ఎవరో ఒకర్ని point out చేస్తూ ఒకింత అసూయతో ఎప్పుడోసారి మాట్లాడేస్తూనే ఉంటాం 🙂
చూపుల్లో ఆరానీ, మెదడులో ఆలోచననీ కట్టిపెట్టి కాజువల్‌గా చూస్తే.. ఏముంది తప్పు అందులో?
తీగ చూపిస్తే లతలు అల్లుకోవడం ఎంత కామనో.. మనుషులకు బంధాలు అల్లుకోవడమూ అంత కామన్.
"వాళ్ల నేచర్ తెలీక గుడ్డిగా నమ్ముతున్నారు… ఎప్పుడోసారి బోర్లాపడతారు" అని కూడా అనేసుకుంటాం ఉండబట్టలేక!!
నేచర్ కన్నా నమ్మకం ఎక్కువ పనిచేస్తుంది రిలేషన్లు నిలబడడానికి… కావాలంటే ఎక్కడైనా ఈ fact టెస్ట్ చేసుకోండి!!
మనిషి అతి చెడ్డవాడు అని తెలిసినా.. నమ్మకం కొద్దీ చుట్టూ మూగే జనాలు ఎందరో! గుడ్డిగా అల్లుకునే ఏ రిలేషనూ మంచి చెడ్డల గురించి పెద్దగా పట్టించుకోదు. మంచో చెడో తనకనవసరం… తనవరకూ ఎలాంటి లోటు లేకుండా ఉంటే చాలు!!
అందుకే కొరుకుడు పడని క్యారెక్టర్లున్న ఫ్యామిలీ మెంబర్ల దగ్గరా ఏమీ తెలీని పిల్లలు చాలా comfortbleగానే ఉంటారు… ఎటొచ్చీ సమస్యల్లా అన్నీ ఆలోచించే మన బుర్రతోనే!
మన మనిషి అనుకున్న మనిషి.. మనల్ని విడిచి నలుగురితో కలిసిపోయి గడిపేస్తుంటే ఏదో మూల ఒంటరితనం అలుముకునే బేల హృదయాలే అందరివీ!
ఆ ఒక్క పొసెసివ్నెస్నే మనుషుల్ని దగ్గరా చేస్తోంది.. దూరమూ చేస్తోంది..
మన మనస్సే మన ఆధీనంలో ఉండదు… ఈ క్షణం మనం ఆలోచించినది మరుక్షణం మారిపోతుంది… అలాంటిది ఏకంగా ఒక మనిషి తన ఉనికి వదులుకుని పూర్తిగా మన కనుసన్నల్లో మెలగాలంటే అత్యాశే కదా! ఈ అత్యాశకు లోనయ్యే అనుక్షణం ప్రత్యక్ష నరకం చూసే భార్యాభర్తలు ఉంటున్నారు… వారి భవిష్యత్ గురించి దిగులు కన్నా ఎక్కడ తమ మాట వినకుండా పోతారోనన్న భయంతో పిల్లల్ని కట్టుదిట్టం చేసే పేరెంట్స్ ఉంటున్నారు… వేరే ఫ్రెండ్స్‌తో మూవ్ అవుతుంటే కుళ్లుకునే ఫ్రెండ్సూ ఉంటున్నారు…
ఎవరి జీవితం వారిది.. ఎవరికి జీవితాన్ని ఎవరికి నచ్చినట్లు వాళ్లు జీవించే స్వేచ్ఛ బ్రహ్మలిఖితం. మనమెవ్వరిమి…. బంధనాలతో బంధాలను మన ఒళ్లోనే కట్టిపడెయ్యాలని తాపత్రయపడడానికి…? పిచ్చి తాపత్రయం కాదూ!!
మన కళ్లెదుట ఓ మనిషి ఉన్నంతసేపే వారి ఉనికి మన జీవితంలో! మన ఆలోచనల్లో ఒక మనిషి ఉన్నంత వరకే వాళ్ల గురించి మమకారం మనకు మనస్సులో!
కళ్లెదుట జీవితాంతం ఉంచుకోలేక ఆలోచనల్లో ఎఫెక్షన్ పెంచేసుకుంటూ పోతే.. దాన్ని త్యాగంగా, ఎవరూ అందించలేని ప్రేమగా పేర్లు పెట్టేసుకుంటే…
హహహహ 🙂 అవతలి వారికి అస్సలు అవసరం లేని ఈ పిచ్చి ప్రేమలు ఎవరికి కావాలి? కళ్లమ్మట నీళ్లు తెచ్చుకోవడానికి ఓ కారణంగా మిలగడం తప్ప!
కళ్లెదుట సాగిపోనీండి మనుషుల్నీ, ఆలోచనల్లో కదలాడనీయండి వారి జాడల్ని… ఎవరెలా పోయినా.. ఎవరెవరితో అల్లుకుపోతున్నా… ఓ చెరగని నవ్వుని నమ్ముకుంటే అంతకన్నా విశాల హృదయం ఏముంది ఈ జీవితంలో!!
గమనిక: ఇది ఎవరిలోనైనా ఆలోచనలు రేకెత్తిస్తుంది అనుకుంటే ఇతరులకూ షేర్ చెయ్యగలరు.
ధన్యవాదాలు
– నల్లమోతు శ్రీధర్
ఎడిటర్
కంప్యూటర్ ఎరా తెలుగు మేగజైన్
http://computerera.co.in
http://youtube.com/nallamothu
http://nallamothusridhar.com
Leave a Reply