“నేను ఇలా ఉండకూడదు, మారాలి..”
“సమాజం సరిగా లేదు, సొసైటీలో చాలా మార్పు రావాలి..”
“నా చుట్టూ ఉన్న వాళ్లు ఇలా బిహేవ్ చేస్తున్నారేంటి.. నాకు నచ్చట్లేదు”
“నేను చేస్తున్న జాబ్‌లో శాటిస్ఫేక్షన్ లేదు, నేను ఓ సినిమా హీరోనైపోయినా లైఫ్‌ని ఎంజాయ్ చేసే వాడిని”
“నా పిల్లలు చదువుకోమన్నా బుద్ధిగా చదువుకోవట్లేదు.. వాళ్లనెలా మార్చాలో తెలీట్లేదు”
What you are doing always? What is the pattern of your internal struggle and resistance?
ఇక్కడ సరిగ్గా.. ఇక్కడ… మీరు అలసిపోతున్నారు.
మీరు పర్ఫెక్ట్గా ఉన్నారు.. మీలో మార్చాల్సిందేమీ లేదు.. మీలో ఏదో మార్చాలని ప్రయత్నించడం మొదలుపెట్టిన తర్వాత అసలైన సంఘర్షణ మొదలవుతుంది… “ఇప్పుడెలా ఉన్నాను, ఎలా మారాలి.. ఇప్పుడు ఉన్న దానికన్నా ఇంకెంత మారాలి” ఇలా బలమైన సంఘర్షణ. మీరు వెనక్కి వెళ్లి గుర్తు తెచ్చుకుంటే మీ జీవితం మొత్తం ఇలా మిమ్మల్ని ఏదోలా మార్చుకోవడానికి స్ట్రగుల్ అవుతూనే ఉన్నారు. అసలు ఎలా ఉండే వారు, ఎలా మారాలని ప్రయత్నించారు, నిజంగా మారారా అని కాసేపు కూర్చుని గుర్తు తెచ్చుకోండి. మీరు ఒకప్పుడు ఎలా ఉండే వారో, ఇప్పుడూ అలాగే ఉన్నారు. కానీ మీ మైండే మిమ్మల్ని నిరంతరం ఒరిపిడికి గురిచేసి ఈ క్షణంలో ఉన్నది ఉన్నట్లు సంతృప్తిగా ఉండకుండా ఎలాగో మారాలని వత్తిడి తెస్తూ మిమ్మల్ని వాస్తవం నుండి దూరం చేసింది.
అరుణాచలంలో రమణ మహర్షి ధ్యానం చేసుకునేటప్పుడు ఆయన మనస్సుకి చాలా పర్ఫెక్ట్గా ప్రశాంతంగా ఉన్న సమాజం.. మీకెలా చెత్తగా అనిపిస్తోంది? కారణం అసంతృప్తి, మోరల్ వేల్యూస్, ప్రతీదీ జడ్జ్ చేసే స్వభావం వంటి కొన్ని ఫిల్టర్స్ పెట్టుకుని నువ్వు సమాజాన్ని చూస్తున్నావు కాబట్టి నీకు అది నచ్చట్లేదు. ఏం చెయ్యాల్సిన పనిలేదు… సింపుల్‌గా అన్నీ accept చేస్తూ వెళ్లు. నీకు సమాజం చాలా బాగుంటుంది.
కోరికలు ఉండకూడదా అంటే.. you can set your goals. బాగా సబ్జెక్ట్ నాలెడ్జ్ పెంచుకోవడం, కష్టపడి పనిచెయ్యడం మీద దృష్టి పెట్టవచ్చు. అవే నీకు తెలీని గొప్ప డెస్టినేషన్స్‌కి చేరుస్తాయి.
ఓ చిన్న ఉదాహరణ చెబుతాను.. ఇద్దరు ఉద్యోగులు ఉన్నారు. ఒకతను మంచి ఇల్లు కొనాలన్న గోల్ పెట్టుకుని మూడేళ్లు కష్టపడి మొత్తానికి ఇల్లు కొన్నాడు. ఆ మూడేళ్లు అతని ఫోకస్ అంతా ఇంటి గురించే!
మరో ఉద్యోగికి ఎలాంటి గోల్ లేదు.. కానీ కష్టాన్ని నమ్ముకున్నాడు, నాలెడ్జ్ పెంచుకున్నాడు, అందరితో ప్రేమగా ఉంటూ, ఎలాంటి ఫిల్టర్స్ లేకుండా అన్ కండిషనల్‌గా అందరినీ కలుపుకుపోతూ ఒక సోల్ యొక్క నేచురల్ టెండెన్సీలో లైఫ్ లీడ్ చేశాడు. అతనికి ఏడాది తిరిగే లోపు విపరీతంగా సంపద వచ్చింది. మంచి అవకాశాలు వచ్చాయి.. నాలుగైదు ఇల్లు కొన్నాడు, రెండు కార్లు కొన్నాడు.. కొంత అమౌంట్ ఇన్వెస్ట్‌మెంట్స్‌లో పెట్టాడు. సో ఇక్కడ కారు కోసం తెగ తపనపడి రాత్రింబవళ్లు కష్టపడ్డ వ్యక్తిది గెలుపా.. లేక తన సహజసిద్ధమైన ప్రవర్తనతో కేవలం కోర్ వేల్యూస్‌ని మాత్రమే కాపాడుకున్న వ్యక్తిది విజయమా అంటే రెండో వ్యక్తిదే విజయం.
నీలో ఉన్నది, నువ్వు ఇప్పుడు ఉన్న జీవితం నచ్చక దాన్ని అసహ్యించుకుంటూ ఏవో కోరికలు పెట్టుకుని వాటి కోసం తెగ ఆరాటపడి కష్టపడుతూ వెళితే నీ జీవితకాలంలో ఒక దాని తర్వాత మరొక కోరిక తీర్చుకుంటూ మహా అయితే 50 ఏళ్లపాటు 50 కోరికలు మాత్రమే తీర్చుకోగలుగుతావేమో! కానీ నిన్ను నువ్వు ఉన్న ఫళంగా ఇష్టపడుతూ చేసే పని పట్ల శ్రద్ధతో కర్మయోగిలా ఎలాంటి ఫలితం ఆశించకుండా, అందరితో ప్రేమగా ఉంటూ ఓ ప్యూర్ సోల్‌గా ఉంటే నువ్వు ఊహించని ఎన్నో గొప్ప విషయాలు నీ జీవితంలో సాధ్యపడతాయి. ఒకటికి పదిసార్లయినా ఈ ఆర్టికల్ చదివి ఈ సత్యాన్ని గ్రహించిన వారికి లైఫ్ చాలా మారిపోతుంది.
- Sridhar Nallamothu