ఇప్పుడే చూసొచ్చాను…
…………
"ఎవరి బ్రతుకు వారిది… ఎవరి కోపం వాళ్లది…"
మట్టి తవ్వుకుపోతున్నారని ఎల్బీ శ్రీరామ్ పిచ్చోడిలా మట్టిని దాచిపెడుతున్నా…
పోలీసుద్యోగి మైనింగ్ మాఫియా లీడర్ ఇంటి చుట్టూ ప్రదక్షిణాలు చేస్తున్నా…. ఎవరు బ్రతుకు వారిదే!!
నయనతార అన్నట్లు మనదాకా రానంత వరకూ ఎవరి దారి వారిదిగానే కన్పిస్తుంది…
"కృష్ణం వందే జగద్గురుమ్" ఓ సగటు మనిషి మనస్థత్వాన్నీ కళ్లకు సాక్షాత్కరింపజేయడంతో పాటు… సినిమాలో ఓ చోట చెప్పినట్లు ఈరోజు పేపర్లో వచ్చిన వార్త రేపు రానట్లే ఈరోజు కోపం రేపుండదూ, రేపటి కోపం మరునాడు ఉండదు…. అన్న భాష్యం వద్ద మనిషి ఎమోషన్లని అద్భుతంగా విశ్లేషించింది.
సినిమాలో ఓ డైలాగుంటుంది… "పక్షులూ, జంతువులూ ఎక్కడికైనా వలసిపోయి బ్రతుకుతాయి గానీ.. మనిషి ఉన్నచోటినీ, తోటి మనుషుల్ని చూసుకోలేకపోతే ఎలా" అన్న అర్థంలో ధ్వనిస్తుందది…
మైనింగ్ మాఫియానే ఈ సినిమా కధగా మనం భావిస్తే చాలా సూక్ష్మంగా అర్థం చేసుకున్న వాళ్లమవుతాం…
పుట్టినందుకూ….. చచ్చేలోపు బ్రతుకుదామన్న ఆశా….
కళ్లెదుట కాలరాయబడుతుంటే ఏం చేయాలో పాలుపోని నిస్సహాయతని మనం ఎటూ బయటి ప్రపంచంలో అర్థం చేసుకోలేం.. ఈ సినిమాలో మాత్రం చాలా డ్రమెటిక్‌గా అర్థమయ్యేలా క్రిష్ ఎస్టాబ్లిష్ చేశారు.
వేర్వేరు నేపధ్యాల వ్యక్తుల మధ్య యాధృచ్ఛికంగా ముడిపెట్టి కధని నడిపించడం "వేదం"లో మాదిరే క్రిష్‌కి వెన్నతో పెట్టిన విద్య.
ఈ సినిమా చూస్తుంటే… కధనీ, మైనింగ్ ఏరియల్ వ్యూలనూ, దౌర్జన్యాలనూ పక్కనబెడితే… మనుషులు కన్పిస్తారు…. మానవత్వం కన్పిస్తుంది…. మనిషికి మనిషి ఎంత అవసరమో అర్థమవుతుంది. సాటి మనిషి కోసం బ్రతకడం ఎంత ముఖ్యమో అర్థమవుతుంది.
చివర్లో 20 నిముషాలకు పైగా బ్యాక్‌గ్రౌండ్ స్కోర్‌తో ప్రతీ ఒక్కరికీ ఒళ్లు గగుర్పొడుస్తుంది… ఇదే అనుభూతిని అందరూ ఒకేలా ఆస్వాదించారంటే… "ఎవరు బ్రతుకు వాళ్లది కాదు… మనకు ఒకరికొకరి మానసిక సాయం కావాలి… దాన్ని దులపరించుకుని బ్రతకాలనుకోవడం ఖచ్చితంగా స్వార్థమే"
నిజమే సినిమాలో చాలాచోట్ల అన్నట్లు "ఎవరి బ్రతుకు వాళ్లది.. ఎవరి సినిమాకి వాళ్లే హీరో" అన్నట్లు మనం చాలా ప్రాక్టికాలిటీకి అలవాటుపడిపోయాం… అంత ప్రాక్టికాలిటీలోనూ కొద్దోగొప్పో స్పందనలు మిగిలున్న జీవుల కోసం ఈ "కృష్ణం వందే జగద్గురుమ్".
మానవ సంబంధాల పట్ల నాకున్న విపరీతమైన మక్కువ కొద్దీ సినిమాల గురించి ఇకపై రాయకూడదు అనుకుని కూడా…. చాలాసేపు వద్దనుకుని మరీ రాసిన నా స్పందన ఇది.
– నల్లమోతు శ్రీధర్
ఎడిటర్
కంప్యూటర్ ఎరా తెలుగు మేగజైన్
‘అంత ప్రాక్టికాలిటీలోనూ కొద్దోగొప్పో స్పందనలు మిగిలున్న జీవుల కోసం ఈ “కృష్ణం వందే జగద్గురుమ్”.’మీ అన్న మీ స్పందనే నాది కూడా.
డిసెంబర్ ఒ క టో తేదిన మా అమ్మయి పుట్టిన రోజున నిర్మల్ శిుశువిహర కి వెళ్లి అక్కడ వారితో కలిసి కొంతసేపు గడిపి ఆ తరువాత ఈ సినిమా చూసాము. మాటలలో చెప్పడం కష్టం ఆ అనుభూతి ని అనుభవం లోకి రావలి. చాల చక్కగా తీసారు సినిమాని