మనిషిలో కొవ్వు అన్నది మోతాదుకి మించినదీ…… 🙂 🙂 🙂
ఎక్కడో ఏదో జరిగితే గానీ అంతా సాధారణ స్థితికి చేరుకోదన్నమాటా…. 🙂
ఇవ్వాళ మరోసారీ పై విధంగా అన్పించింది…
రోడ్ల మీద ఇష్టమొచ్చినట్లు ఫీట్లు చేస్తూ టూవీలర్లు డ్రైవ్ చేసే వాళ్లనీ, అడ్డదిడ్డంగా కార్లని టూవీలర్ల కన్నా ఘోరంగా స్టీరింగ్ తిప్పుతూ దూసుకుపోయే వాళ్లనీ చూసినప్పుడల్లా నాకు ఇలాగే అన్పిస్తుంది…
నాకే కాదు చాలామందికి ఇలాగే అన్పిస్తుందంట కూడా… హహహ.. ఈ విషయం తెలిశాక నేను తిట్టుకోవడంలో తప్పేమీ లేదనిపించింది మొత్తానికి!!
ఇంతకీ తెలుసుకోవలసిన నీతి ఏమిటంటే..
"కొవ్వు అన్నది అతి ప్రమాదకరం… అది మనిషిని తిన్నగా ఉండనీయదు… రకరకాల విన్యాసాలు చేయిస్తుంది…. చివరకు ఎక్కడో ధడేల్మని గుద్దుకుని ఏవో ఒకటి విరగ్గొట్టుకునో, లేదా పూర్తిగా ప్రాణాలు పోగొట్టో గానీ శాంతించదు.."
హుషారూ, జోష్ ఉండొచ్చు… ఆ జోష్ చూపించాల్సినవి చాలానే పనులు ఉన్నాయి కొద్దిగా బుర్రని దగ్గర పెట్టుకుని ఆలోచిస్తే…!
స్ప్లిట్ సెకండ్లో అలా వంపులు తిరుగుతూ డ్రైవ్ చేస్తుంటే ఎంతమంది చేతుల్లో హ్యాండిళ్లు కంట్రోల్ తప్పుతున్నాయో, ఎందరి గుండెలు దడదడలాడుతున్నాయో అర్థం కాకపోతే… అంతే వేగంగా వెళ్లి ఏ లారీకైనా మీ వెహికిల్ గుద్దేయండి… సగం దరిద్రం వదులుతుంది… మనుషుల గుండెలెంత సున్నితమైనవో ప్రాక్టికల్‌గా అనుభవించి తెలుసుకోవచ్చు….
రోడ్ల మీద ఎంతమంది కాళ్లూ, చేతులూ, ప్రాణాలూ పోగొట్టుకుంటున్నారో తెలీట్లేదా…. ఏం కొంపలంటుకుపోతున్నాయని రేసు గుర్రాల్లా ఉరుకులెత్తడం?
నిజంగానే ఏదో ఒకటి అవ్వాలి…. అప్పుడే జీవితం విలువ తెలిసొస్తుంది…. చెడు కోరుకోకూడదంటారు…. ఒక చెడు వల్ల పదిమందికి మంచి జరిగేదైతే అలాంటి చెడుని కోరుకున్నా తప్పు లేదు…..
రోడ్ల మీద చావడానికో, చంపడానికో, జీవశ్చవాల్లా పక్కనోళ్లని చేయడానికో కాదు మీ తల్లిదండ్రులు మిమ్మలను కన్నది….. కిలోమీటర్ల లెక్కన పోలీస్ ట్రైనింగ్ ఇనిస్టిట్యూట్లోలా నడిపిస్తే, పరిగెత్తిచ్చి ప్రాణం విలవిల్లాడిస్తే గానీ బుర్రకు ఎక్కదు ఒక్కో రేస్ గుర్రాన్నీ!!
గమనిక: ఇది ఎవరికైనా పనికొస్తుంది అన్పిస్తే ఇతరులకూ షేర్ చేయగలరు.
ధన్యవాదాలు
– నల్లమోతు శ్రీధర్
ఎడిటర్
కంప్యూటర్ ఎరా తెలుగు మేగజైన్
Leave a Reply