మనుషుల్ని ఎంతగా ప్రేమిస్తాం, అభిమానిస్తామంటే.. "అస్సలు ప్రపంచంలో ఈ మనిషంటూ లేకపోతే నేనేమైపోవాలి" అని అవతలి వ్యక్తి మైమరిచిపోయేటంత!
మన ప్రేమని రుచిచూపించడానికి.. మన కళ్లకు, మనస్సుకి నచ్చే అర్హులైన స్నేహితులూ, బంధాలూ కావాలి! సరిగ్గా అదే సమయంలో మన ప్రేమని రుచిచూడడానికి కొన్ని బంధాలు కాచుక్కూర్చుని ఉంటాయి.. అయిపోయింది డీల్. ఎవరికి కావలసింది వారికి దక్కుతుంది.
మన ప్రేమని అందిస్తూ.. ఆ ప్రేమ అవతలి వారిని ఆనందపరుస్తుందో లేదో ఓ కంట గమనిస్తూ.. వారి కంటి మెరుపులతో మన మనస్సు నింపుకుంటాం..
అటుపక్కవాళ్లూ మరోవైపు గారాభాన్ని ఆస్వాదిస్తూనే ఉంటారు. వారిలో మనకిష్టమైన క్వాలిటీస్‌ని మన కోసం మరింత ప్రసరింపజేస్తూనే ఉంటారు.. మనల్ని ముగ్థుల్ని చేస్తూనే ఉంటారు.
ప్రతీ ఒక్క హ్యూమన్ రిలేషన్‌కీ ఇది అప్లై అవుతుంది. ఇద్దరి వ్యక్తులు రకరకాల ప్రాతిపదికల మీద ఏర్పరుచుకునే మానసిక అవగాహనా ఒప్పందాలే మన రిలేషన్లు.
ఎటొచ్చీ ఇవి అవగాహనా ఒప్పందాలు కావడం వల్లనే సమస్యలొస్తున్నాయి 🙂
"నేను ప్రేమిస్తాను.. నువ్వు నా ప్రేమని ఆస్వాదించు" అన్నది ఆ మానసిక అండర్స్టాండింగ్లో ఓ క్లాజ్ అనుకుందాం.
ఇద్దరూ క్లాజ్‌కి తగ్గట్లు నడుచుకున్నంతకాలం ఏ సమస్యా ఉండదు.
కొన్నాళ్లకు మనం ప్రేమిస్తూనే ఉంటాం.. అవతలి వారికి మన ప్రేమ ఎకనామిక్స్‌లో law of diminishing marginal utilityలా మొహమెత్తుతుంది. మొదట్లో వచ్చినంత స్పందన కన్పించదు.
దాంతో మన ఇగో దెబ్బతింటుంటుంది.. నిష్టూరాలు ఆడడం మొదలెడతాం 🙂 😉
కొన్నిసార్లు మన ప్రేమా బానే ఉంటుంది.. అవతలి వారూ ఆస్వాదిస్తూనే ఉంటారు.. కానీ మరో రకంగా సమస్య వస్తుంది.
అదెలాగంటే "మన దృష్టిలో మనం అవతలి వారిని చాలా ప్రేమిస్తున్నాం" అన్న ఫీలింగ్ బలపడుతుంటుంది. మరీ అంత కాకపోయినా కొద్దోగొప్పో అవతలి వారూ మనల్ని అంతగా భుజానికెక్కించుకుంటే బాగుణ్ణు అనే expectation తెలీకుండానే మొదలవుతుంది. కొన్నాళ్లకు అది పెరిగి పెద్దదవుతుంది.
మొదట్లో we don’t have any expectations. సో ఎ చిక్కూ ఉండేది కాదు.
ఇప్పుడూ మొదట్లోలాగే ప్రేమిస్తున్నాం.. ఆ ప్రేమలో 1% అయినా రిటర్న్ పొందాలని తాపత్రయపడుతున్నాం.. గింజుకున్నా అవతలి వాళ్లు మన ప్రేమని ఆస్వాదిస్తున్నారే గానీ.. గతంలో కంటే కొత్తగా ఏమీ ప్రవర్తించట్లేదు 🙂
కావాలనే అవతలి వారి పట్ల మన ప్రేమ ఇంటెన్సిటీ పెంచుతున్నాం.. అది అవతలి వారి మీద పెరిగిన ప్రేమ వల్ల కాదు 🙂 మన మీద మనకు పెరిగిన ప్రేమ వల్ల..!!
అంత ఇంటెన్సిటీకీ no result. Break down అవుతున్నాం.. మాటలు పారేసుకుంటున్నాం.. అవతలి వారు హర్ట్ అవుతున్నారు..
మనలో వచ్చిన మార్పుని digest చేసుకోలేక.. "నీ బోడి ప్రేమ ఎవరికి కావాలని" ఒక్క మాట అనేసి ఛప్పున వెళ్లిపోయారు..
అయిపోయింది.. ఓ రిలేషన్ ఖతం 🙂 🙂
తల్లిదండ్రుల ప్రేమ మొదలుకుని ప్రేమికుల ప్రేమల వరకూ.. స్నేహితుల ఎఫెక్షన్ల వరకూ సహజాతి సహజంగా జరుగుతున్న ప్రక్రియ ఇది.
ఒక్క బేసిక్ రూల్ గుర్తుంచుకుంటే.. ఎలాంటి కన్ఫ్యూజన్ ఉండదు..
అదేంటంటే…..
మనం ఎవర్నైనా ప్రేమిస్తున్నామా… అభిమానిస్తున్నామా… ఆరాధిస్తున్నామా… అన్నది ఒక్కటే మన కంట్రోల్లో ఉంటుంది..
మనం తీగల్లా అల్లుకుని బంధిస్తామంటే.. ఎవరూ మన బంధనాల్లో వచ్చి పూర్తిగా తమని తాము త్యాగం చేసుకుని.. ముడుచుకుని జీవితాన్ని అర్పించరు. ఎవరి లైఫ్ వాళ్లది.
మనం ఎఫెక్షనేట్‌గా ఉండడం మన గొప్పదనమే..
యెస్.. ఎంతవరకూ అంటే ఎలాంటి ఎక్స్పెక్టేషన్లూ లేకుండా మన ఎఫెక్షన్‌ని పంచిపెట్టేటంత వరకే.
మనం ఇలా ఇంత మంచిగా ఉన్నాం కాబట్టి అవతలి వారు అలాగే అంత మంచిగా ఉండాలంటే కుదరదు. ఇక్కడ నేను అవతలి వారిని సపోర్ట్ చెయ్యట్లేదు. ఓ fact చెప్తున్నానంతే.
unconditionalగా ప్రేమిస్తావా.. ప్రేమించు.. అది నీ ఔన్నత్యాన్ని చాటుతుంది.. మన ప్రేమని ఎవరు గుర్తించినా లేకపోయినా మనకైనా తెలుసు కదా.. అదెంత అమూల్యమైనదో! ఇంకెందుకు కంప్లయింట్స్?
ఈ విషయంపై రాయడానికి చాలానే ఉంది.. కానీ మరీ లెంగ్తీ అవుతోంది..
సో చివరిగా ఒక్కమాట.. నూటికి 99% ఈరోజు మనం మెయింటైన్ చేస్తున్న రిలేషన్స్ అన్నీ ఒక్క బలమైన గాలి వీస్తే పుటుక్కున తెగిపోయేవే… కారణం… ఏవో ఊహించుకుంటారు.. అల్లుకుంటారు.. అలా అల్లుకునే ప్రాసెస్‌లో ఎక్కడో తీగ వంగదు… తెగిపోతుంది.. దట్సాల్ 🙂
– నల్లమోతు శ్రీధర్
ఎడిటర్
కంప్యూటర్ ఎరా తెలుగు మేగజైన్
Leave a Reply