
కేజీల బరువు ఉండే మనిషి చనిపోయాక ప్రతీ కణంలో ఎనర్జీ నిలిచిపోయాక డొల్లగా ఉండే స్కెలెటన్గా ఎందుకు మారతాడు అనే సందేహం ఎప్పటి నుండో నాకు ఉండేది. క్వాంటమ్ ఫిజిక్స్‌ని, స్పేస్ టైమ్ కాన్సెప్టులను లోతుగా స్టడీ చెయ్యడం మొదలుపెట్టాక నా ప్రశ్నకు సమాధానం లభించింది.
ప్రతీ ప్రాణి శరీరాలను సూక్ష్మ స్థాయిలో చూస్తే పైకి కనిపించే తల, మెడ, కాళ్లు, చేతులు వంటి అవయువాలు, లోపల ఉండే లివర్, కిడ్నీ వంటి ఆర్గాన్స్ అన్నీ ప్రొటీన్ ద్వారా నిర్మితమైన టిష్యూలుగా, సెల్స్‌గా, ఆ సెల్స్ లోపల ప్రోగ్రామింగ్ కోడ్ కలిగిన DNA, RNAగా, చివరకు ఆటమ్స్, సబ్ ఆటమిక్ పార్టికల్స్‌గా నిర్మితమై ఉంటాయి.
ఆటమ్స్ మాదిరి సూక్ష్మ స్థాయిలో చూస్తే 99 శాతం ఖాళీ స్థలం, ఒక శాతం ఎనర్జీ నిక్షిప్తమై ఉంటుంది. 99 శాతం ఖాళీ స్థలం కలిగి ఉండే ఆటమ్స్ ద్వారా నిర్మితమైన కణాలు, అవయువాలు అలా నిండుగా, సాలిడ్ శరీరాలుగా ఎలా మారాయి అన్నది తెలుసుకుంటే ఆశ్చర్యమేస్తుంది. ఫ్యాన్ ఖాళీగా ఉన్నప్పుడు మూడు రెక్కలకు మధ్య చాలా ఖాళీ ఉన్నా, ఫ్యాన్ ఫుల్ స్పీడ్‌లో తిరిగేటప్పుడు అది తన పరిధిలో ఉన్న స్పేస్ మొత్తాన్నీ నింపుకుని ఉంటుంది కదా! ఆ స్పేస్‌లో మిగతా ఏదీ పెట్టలేం. అంటే ఒక మనిషి ఈ భూమ్మీద నిలుచుని ఉన్న స్థలంలో అతని మీద గానీ, క్రింద గానీ మరో మనిషిని అదే డైమెన్షన్స్‌లో ఎలాగైతే పెట్టలేమో అదే విధంగా కేవలం వైబ్రేట్ అయ్యే స్పీడ్‌ని, ఆటమ్స్ నిండి ఉన్న ప్రదేశాన్ని బట్టి మన కళ్లకి కనిపించే మెటీరియల్ ప్రపంచం తయారై ఉంటుంది.
ఒక మనిషి శరీరం గానీ, వస్తువు నుండి గానీ ఎనర్జీని వేరు చేస్తే దాని వైబ్రేషన్ ఆగిపోయి అది విశ్వంలో ఆక్రమించి ఉన్న స్పేస్ కుంచించుకుపోతుంది. అంటే మనం చనిపోయాక మన ఎనర్జీ శరీరం నుండి తొలగిపోతుంది కాబట్టి ఆటమ్స్ వైబ్రేట్ అవడం ఆగిపోయి విశ్వంలో మన శరీరం ఆక్రమించుకుని ఉన్న స్థలం క్షీణించిపోతుంది.
ఆ వైబ్రేషనల్ స్పీడ్‌ని పెంచడం కోసమే, పాజిటివ్ థాట్స్‌తో తన ఎనర్జీ ఎక్స్ప్రెషన్ లెవల్ని పెంచడానికి స్పిరిట్యువాలిటీ ఉపయోగపడుతుంది.
– Sridhar Nallamothu