క్షణాల్లో మిమ్మలను హాపీగా చేసే ఓ చిన్న టెక్నిక్ యోగా దినోత్సవం సందర్భంగా చెబుతాను..
- కళ్లు మూసుకోండి. లేదా కళ్లు తెరిచి అయినా చాలా ఫోకస్డ్గా మీ ఛాతీ (chest) మధ్య భాగంలో మీ ఫోకస్ నిలపండి. పూర్తి ఫోకస్ అక్కడే ఉండాలి.
- చాలా నెమ్మదిగా కేవలం ఛాతీ ప్రదేశంలోనే సంకోచ, వ్యాకోచాలు వచ్చేలా ఊపిరి పీలుస్తూ, వదులుతూ ఉండండి. ఎంత నెమ్మదిగా అంటే మీరు ఊపిరి తీసుకునేటప్పుడు శరీరంలో ఇతర భాగాలపై ఎలాంటి వత్తిడీ ఉండకూడదు.
- అలా శ్వాస తీసుకుంటూ, వదిలేటప్పుడు మీ జీవితంలో హాపీయెస్ట్ మూమెంట్స్‌ని గుర్తు తెచ్చుకోండి. మీ కుటుంబ సభ్యులతో సంతోషంగా, నవ్వుతూ గడుపుతూ ఉన్నవి గానీ, మిమ్మలను అందరూ అప్రిషియేట్ చేస్తూ మీ చుట్టూ చాలామంది ఆత్మీయులు ఉన్నట్లు గానీ, మీ ఆరోగ్యం అద్భుతంగా ఉండి మీరు విగరస్‌గా వాకింగ్ చేస్తున్నట్లు, చాలా ఎనర్జటిక్‌గా ఉన్నట్లు, లేదా చాలా యాక్టివ్‌గా షటిల్ ఆడుతున్నట్లు.. మీరు ఇతరులకి హార్ట్‌ఫుల్‌గా కృతజ్ఞత తెలుపుతున్నట్లు.. ఇలా సంతోషం, కృతజ్ఞత అనే రెండు ప్రధానమైన ఎమోషన్స్ ఆల్రెడీ జరిగిన సంఘటనలు గానీ, లేదా ఆల్రెడీ జరుగుతున్నట్లు మీకు మీరు ఊహించుకుని కానీ పూర్తిగా ఆ ఎమోషన్లో మునిగిపోండి.
ఐదు నిముషాల పాటు ఇలా చేయండి. అది ఊహ అన్న విషయం కూడా మీ మైండ్‌కి తట్టకూడదు. అంతగా ఆ ఎమోషన్లో మీరు ఉండిపోవాలి. మెల్లగా మీ మొహంపై ఎంతో స్వచ్ఛమైన నవ్వు వస్తుంది. హృదయం విప్పారుతుంది.
నేను ఇక్కడ చెప్పిన టెక్నిక్ హార్ట్ కోహరెన్స్ని పెంచుతుంది. గుండె చుట్టూ ఉండే నాఢీ వ్యవస్థని, హార్ట్ చక్రని యాక్టివేట్ చేస్తుంది. లైఫ్‌తో పాటు హార్మొనీలో మన ఆలోచనలు సాగేలా, మన మూడ్ మొత్తం ఒక్కసారిగా సంతోషంగా మారిపోయేలా చేస్తుంది.
రోజు మొత్తం ఈ టెక్నిక్ పలుమార్లు చేయండి. కొద్దిరోజుల్లోనే మీ వైబ్రేషన్లో ఎంతో మార్పు వస్తుంది. నేను చాలా ఏళ్లుగా దీన్ని చేస్తున్నాను. మీరు ఎవరైనా కొత్త వ్యక్తిని కలవడానికి వెళ్లే ముందు గానీ, మీ మూడ్ బాలేనప్పుడు గానీ, ఓ మంచి అవకాశం పొందాలనుకున్నప్పుడు గానీ, కీలకమైన నిర్ణయం తీసుకునేటప్పుడు గానీ మైండ్‌ని అధిగమించి మీ సోల్‌తో స్వచ్ఛంగా, హాపీగా ఉండడానికి ఇది బెస్ట్ టెక్నిక్. మీరు వీలైతే ఇప్పటికిప్పుడు ఓ ఐదు నిముషాలు ఈ టెక్నిక్ ఫాలో అయి మీలో వచ్చిన మార్పుని ఇక్కడ కామెంట్లలో గానీ, sridharcera@gmail.com అనే నా మెయిల్ ఐడికి గానీ పంపండి.
గమనిక: ఈ పోస్ట్ ఎవరైనా షేర్ చేసుకోవచ్చు. కానీ రాసిన Sridhar Nallamothu అనే నా నేమ్ ఉంచి షేర్ చేసుకోవడం సంస్కారం.
- Sridhar Nallamothu