మనిషి శరీరంలో సటిల్‌గా ఉండే ఎనర్జీ సెంటర్స్ అయి వివిధ chakras వివిధ సంగీత వాయిద్యాల ద్వారా యాక్టివేట్ అవుతాయి. దేవాలయాలకు వచ్చే భక్తుల్లోని ఆయా చక్రాలను ఉత్తేజం చేసే విధంగా పురాతన దేవాలయాల్లో అలాంటి ప్రత్యేకమైన అమరిక ఉండేది.
పెద్ద పెద్ద డ్రమ్స్ శరీరంలో అన్నింటి కంటే అడుగున ఉండే మూలాధార చక్రని యాక్టివేట్ చేస్తుంది. సరైన నిధులతో, పోషణతో నిర్వహించబడుతున్న పెద్ద పెద్ద దేవాలయాలకు వెళ్లినప్పుడు, ఉత్సవ మూర్తుల ఊరేగింపుల సమయంలో ఇలా డ్రమ్స్‌తో పెద్ద శబ్ధం ఉత్పత్తి చెయ్యడం చూస్తూనే ఉంటారు. వాస్తవానికి ఆయా పెద్ద దేవాలయాల్లో మొత్తం 7 ద్వారాలు ఉంటాయి. మొదట ద్వారం వద్ద ఇలా డ్రమ్స్, రెండవ ద్వారం దగ్గర సన్నాయి వాయిద్యకారులు ఉంటారు. సన్నాయి తరహా వాయిద్యాలన్నీ శరీరంలోని రెండవ చక్ర అయిన స్వాధిష్టాన చక్ర ఎనర్జీని యాక్టివేట్ చేసే సంగీతం.
ఇక మూడవ ద్వారం వద్ద మూడవ చక్ర అయిన మణిపూరక చక్రని యాక్టివేట్ చేసే వయోలిన్, నాలుగవ చక్ర అయిన అనాహత చక్ర (హార్ట్ చక్ర)ని యాక్టివేట్ చేసే గిటార్ లేదా పియోనో చాలా మంద్ర శబ్ధంతో నాలుగవ ద్వారం దగ్గర, విశుద్ధ చక్ర (థ్రోట్ చక్ర)ని యాక్టివేట్ చేసే ఫ్లూట్ వాయిద్యం ఐదవ గుమ్మం దగ్గర, థర్డ్ ఐ చక్ర (ఆజ్ఞా చక్ర)ని యాక్టివేట్ చేసే బెల్స్ ఆరవ గుమ్మం దగ్గర అమర్చబడి ఉంటాయి. ప్రతీ గుడిలో ఉండే గుడి గంటలు కూడా ఈ కారణం చేతనే అమర్చబడ్డాయి. దేవుడుని అలర్ట్ చెయ్యడానికి బెల్స్ పెట్టారని చాలామంది భ్రమపడుతుంటారు. గంట కొట్టడం ద్వారా మన ఆజ్ఞా చక్ర ఎనర్జీ యాక్టివేట్ అవుతుంది.
ఇక చివరిగా శివాలయం వంటి లయకారుడికి చెందిన కొన్ని దేవాలయాల్లో శంఖు శబ్ధం వినిపించబడుతుంది. ఇది ఏడవ చక్ర అయిన సహస్రార చక్రని యాక్టివేట్ చేసి ఒక జీవుడు ఈ భౌతిక బంధనాలకు అతీతంగా విశ్వంతో అనుసంధానం అవడానికి ఉపయోగపడుతుంది.
శబ్ధాలు, అవి మానసిక, భౌతిక స్థితులపై చూపించే ప్రభావాలు వంటి అంశాలపై స్టడీ చేసే క్రమంలో రవిశంకర్ గారి ద్వారా, దేవాలయ నిర్మాణం, వివిధ అంగాలు అనే అంశంపై అధ్యయనం ద్వారా నాకు తెలిసిన విషయం ఇది.
– Sridhar Nallamothu