5 అడుగుల చిన్న టిక్కీ..
ఉదయం 10 నుండి రాత్రి సెకండ్ షో పూర్తయ్యే వరకూ (1 వరకూ) ఆ కొద్ది ప్లేస్లోనే కాలక్షేపం..
నేను రెగ్యులర్‌గా సినిమా చూసే ఓ థియేటర్లో ఓ ఫుడ్ స్టాల్ ఓనర్ లైఫ్ ఇది. “చాలా కష్టం కదా” అంటే “ఏముంది అలవాటైపోయింది” అని నవ్వుతాడు. Boys ఉన్నా.. ఇంటి దగ్గర రిలాక్స్ అవకుండా అన్ని గంటలూ అక్కడే గడుపుతాడు..
—————————————–
పదేళ్ల నుండి తెలిసిన కిరాణా షాపు.. మెయిన్ రోడ్‌కి వెళ్లాలంటే ఆ షాపు మీందే వెళ్లాలి.. ఎప్పుడు చూసినా ఆ షాపు తెరిచే ఉంటుంది… ఆ షాపులో మిత్రులు రాజుగౌడ్ గారు కూర్చునే ఉంటారు.. ఆయనకీ అసిస్టెంట్లు ఉన్నారు. కానీ ఓనర్ స్వయంగా చూసుకుంటే వచ్చే తృప్తిని ఆయన ఎంజాయ్ చేస్తున్నారు. అది పనిని ఇష్టపడే వాళ్ల గొప్పదనం..
—————————————-
వీధి చివర ఓ చిన్న ఫార్మసీ, జనరల్ స్టోర్… తెల్లారకముందూ తెరిచే ఉంటుంది… అర్థరాత్రీ తెరిచే ఉంటుంది…. ఒక భార్యా, ఒక భర్తా అంతే చూసుకునేది. నైట్ 10 అయితే ఓ పక్క ఫుడ్ బాక్స్ ఓపెన్ చేసి తింటూనే పెద్దాయన ఒక చేత్తో మనకు కావలసినవి ఇస్తుంటాడు. కేవలం మెడిసిన్స్ ఇచ్చి డబ్బులు తీసుకోవడమే కాదు.. చిన్న చిన్న ఆరోగ్య సలహాలు కూడా చెప్తుంటాడు.. అంత ఓపిక ఎలా వస్తుందో!
——————————————-
మనకు డైలీ మన చుట్టూ ఇలాంటివి చాలా కన్పిస్తాయి. అయినా పెద్దగా పట్టించుకోం… ఓవర్‌లుక్ చేసేస్తాం.. “ఆ ఏముంది వాళ్లు డబ్బులు సంపాదించుకోవట్లేదా” అని చిన్నచూపు చూస్తాం. ఒక్కో ప్రోడక్ట్ అమ్మితే వాళ్లకి వచ్చే 10, 20 రూపాయల మార్జినే మన కళ్లకి కన్పిస్తోంది. దాని వెనుక వాళ్లు రాత్రింబవళ్లూ, ఏళ్లతరబడి పడుతున్న కష్టం అస్సలు కన్పించదు. మనం మాత్రం 7-8 గంటలు Facebook ఛాట్లు, whatsapp ఛాట్లు చేసుకుంటూ వేలకు వేలు సంపాదిస్తున్నా డబ్బు సరిపోవట్లేదని అనుకుంటాం. ఇక్కడ వాళ్లు టాలెంటెడ్ కాదు, మనం ఒక్కళ్లమే టాలెంటెడ్ అనుకుంటే అది మన మూర్ఖత్వం. మనకన్నా ఎంతో టాలెంటెడ్ వాళ్లు కూడా డబ్బు పట్ల పెద్దగా ఇంట్రెస్ట్ లేకుండా పనిని ఆస్వాదిస్తూ వచ్చిన దానితో తృప్తి పడుతూ చాలా హాపీగా బ్రతికేస్తున్నారు. అసంతృప్తల్లా ఎంత వచ్చినా సరిపోని మనకే!
—————————
కష్టం విలువ తెలీనప్పుడు, కష్టం పట్ల గౌరవం లేనప్పుడూ ఏదీ తలకెక్కదు. పైన చెప్పిన తరహా వాళ్లని మీ చుట్టూ గమనించండి.. వాళ్ల నుండి చాలా నేర్చుకోవాలి.. సినిమా హీరోల పంచ్ డైలాగులనూ, జై మాహిష్మతీ అనే మాదిరి హిట్ సినిమాల డైలాగులనూ ఏదో పూనకం వచ్చినట్లు మాట్లాడుకుంటూ గొప్పగా ఫీలైపోవడం కాదు… వాళ్ల లైఫ్ స్టైయిల్నీ, వాళ్ల అణుకువనీ, షాపులకెళ్లి మనం ఎంత విసిగించినా ఓర్పుతో ఉండే వాళ్ల సహనం నుండీ చాలా నేర్చుకోవాలి.
లైఫంటే నువ్వు ఒక్కడివే గొప్పగా జీవిస్తున్నట్లు కాదు… నీ చుట్టూ నీకన్నా వందరెట్లు అద్భుతంగా జీవిస్తున్న వాళ్ల నుండి మంచి క్వాలిటీలను నేర్చుకుంటేనే నువ్వెంత అడుగున ఉన్నావో అర్థమవుతుంది.
– నల్లమోతు శ్రీధర్
Leave a Reply