ఒక మనిషితో రిలేషన్ build అవడం అనేది basicalగా రెండు mode of expressionsలో జరుగుతుంది..
ఎదుటి వ్యక్తిని గుడ్డిగా అభిమానించడం, అప్రిషియేట్ చేయడం, flatter చేయడం.. ఇది old style of expression అయిపోయింది..
ఇప్పుడంతా ఎదుటి మనిషిని టీజ్ చేస్తూ, ఉడికిస్తూ, ఏడిపిస్తూ… అస్సలు ఎందుకూ పనికిరాని వ్యక్తిగా ట్రీట్ చేస్తూ.. ఇగోని హర్ట్ చేయడం ద్వారా వాళ్ల దృష్టి ఆకర్షించేయడం.. ఎక్కువ వాడుకలో ఉంది.
Plus ఏ రిలేషన్‌కీ బలమైన మూలాలు ఉండట్లేదు. దాంతో క్యూరియాసిటీ క్రియేట్ అవడం, రిలేషన్ మొదలవడం వరకూ టీజింగ్ బిహేవియర్ బానే ఉంటోంది గానీ.. లైఫ్ లాంగ్ “ఆ పెద్ద నీకే తెలుసులే..” అని చులకనగా మాట్లాడే జనాభా indirectగా రిలేషన్లని దెబ్బతీసుకుంటున్నారు.
రిలేషన్‌కి respect ఇవ్వడం అతి ముఖ్యమైన క్వాలిటీ. Respect అనే ఈ బేసిక్ క్వాలిటీని చాలామంది అస్సలు లెక్కలోకి కూడా తీసుకోరు. ఎవరైనా ఎవరికైనా గౌరవం ఇస్తే వాళ్లని చూసి పగలబడి నవ్వుకుంటూ ఉంటారు.. జోక్లేసుకుని!!
మనుషుల మధ్య ఉండే అటాచ్మెంట్ గురించి, ఇంటిమసీ గురించి, పరస్పర గౌరవం గురించి జోక్లేసుకోవడానికి బానే ఉంటుంది గానీ.. మన జీవితంలో అవి మిస్ అయినప్పుడే మన పార్టనర్‌తో లైఫ్ వెలితిగా ఉంటుంది.
————————-
హ్యూమన్ బ్రెయిన్లో సున్నితత్వం అనే తీగలు తెగిపోతున్నాయి.. సెంటిమెంటల్ ఫీలింగ్సే కామెడీ అయిపోతున్నాయి. సెంటిమెంట్స్ ఎప్పుడైతే పోయాయో వాటితో పాటే పార్టనర్‌ని మనస్ఫూర్తిగా అప్రిషియేట్ చేయడం కూడా మరుగునబడిపోతోంది. ఇవ్వాళ రేపు “నీకేం తెలుసు” అని పొగరుబోతుగా ప్రశ్నించేవారు ఎక్కువవుతున్నారు గానీ “నీకు చాలానే తెలుసు” అని అప్రిషియేట్ చేసే పార్టనర్లు దొరకట్లేదు. అదేం అంటే.. just kidding, దాన్ని కూడా సీరియస్‌గా తీసుకుంటే ఎలా అనే ఎదురు దాడులు!
————
సరదాకీ హద్దు ఉంటుంది.. మనం సరదాగా ఉన్నంత మాత్రాన అవతలి మనిషి సీరియస్ మూడ్‌లో ఉంటే మన సరదా వికటిస్తుంది. సో మనుషుల మూడ్స్ చూసి మసులుకోవాలి. ఇవ్వాళ రేపు ఎవరూ ఎవరి మూడ్స్ చూసే తీరికలో లేరు. దాంతో ఇద్దరి వ్యక్తుల్లో ఒకరికి సరదా అయినది కాస్తా రెండో వ్యక్తికి చికాకు వచ్చేసి రిలేషన్ కొంత కొంత తెగుతూ ఏదో కాజువల్ రిలేషన్షిప్ మెయింటైన్ చేస్తూ వస్తున్నారు.
———————–
Lack of appreciation అనేది చాలామంది వైవాహిక జీవితాల్లో కన్పిస్తోంది. దీంతో ఎవరి బ్రతుకు వారు మెకానికల్‌గా బ్రతికేస్తున్నారు. అప్రిషియేట్ చేసే నైజం చిన్నప్పటి నుండి రావాలి. అది ఈ మధ్య పేరెంట్స్ నేర్పించట్లేదు. సో ఎవరికి వారు గొప్పలు చెప్పుకునే జనాభానే తయారవుతున్నారు తప్ప ఒకర్నొకరు అప్రిషియేట్ చేసుకునే జనాభా దొరకట్లా.. ఒకవేళ అప్రిషియేట్ చేసినా.. ఓ సెక్సువల్ రిలేషన్షిప్ కోసమో, అవతలి వ్యక్తి ఇగో శాటిస్ఫై చేసి ఇంటిమసీ పొందడానికి టెంపరరీగా పొగడ్తలు కురిపించే టెక్నిక్‌లు ఫాలో అవుతున్నారు గానీ.. శాశ్వత ప్రాతిపదికన ఆ అప్రిషియేషన్ క్వాలిటీ ఎవరిలోనూ ఉండట్లేదు.
—————————-
అందుకే ఈ మధ్య చాలామందిని చూస్తే అన్పిస్తోంది.. కొన్నిసార్లు అమాయకత్వం ఉండాలి.. కొన్నిసార్లు చురుగ్గానూ ఉండాలి… ఎప్పుడూ చురుగ్గా, అన్నింటిలోనూ చాలా గొప్ప అయినట్లు పర్సనల్ జోన్లో ఉండే లైఫ్ పార్టనర్ల వంటి వాళ్ల దగ్గర కూడా బింకంగా ఉండే వాళ్లు రిలేషన్లలో సారాన్ని మిస్ అవుతున్నారన్పిస్తోంది.
– నల్లమోతు శ్రీధర్
Well said
పద్మార్పిత గారు థాంక్యూ