"చూసుకుందామా.." అంటే చూసుకోవడానికీ, బలాబలాలు నిరూపించుకోవడానికీ ప్రతీ ఒక్కరికీ చాలానే బ్యాక్‌గ్రౌండూ, ఫోర్గ్రౌండూ ఉంటుంది.
మనకు శక్తివంతమైన మాటలు ఉన్నాయి.. అంతకన్నా శక్తివంతమైన మెదడూ ఒకటి దేముడిచ్చాడు… వీటి శక్తి ముందు ఏ బలాబలాలైనా దిగదుడుపే.
కొట్టుకోవడం క్షణం పని… మనస్సులు నొప్పించుకునేలా తిట్టుకోవడమూ క్షణంలో జరిపేయగల పనే… ఓపిగ్గా మంచిగా, పద్ధతిగా ప్రవర్తించడమే కష్టమైన పని.
ఈ పద్ధతులు, మంచితనాలూ, ఓపికలూ అనేవి బలాబలాల్ని చూసుకుని, డబ్బుని చూసుకునీ, హోదాల్నీ, ఇంకేదో చూసుకుని పోగొట్టుకోవడం వల్లనే మనం అనాగరికంగా ప్రవర్తించేస్తున్నాం.
వేలిడంత లేని నాలిక మనల్ని ఆడించేస్తోంది తోలుబొమ్మల్లా! నోటికొచ్చినట్లు మొండిగా, మూర్ఖంగా మాట్లాడడమే "నెగ్గుకురావడం" అన్నట్లు ఫిక్సైపోయి చాలా మొండిగా బిహేవ్ చేస్తున్నాం.
శివాలెత్తి అందరూ ఇలాగే బిహేవ్ చేసుకుంటూ పోతే ఈ భూమ్మీద కిలోమీటరుకో యుద్ధం జరిగే భవిష్యత్ ఎంతో దూరంలో లేదు.
ఓపిక, సంస్కారం, శత్రువైనా ఎదుటి వ్యక్తిని ఇతోధికంగా గౌరవించి వ్యవహారాలు చక్కబరుచుకునే సంయమనం లేకపోతే ఇన్ని చదువులు చదువుకుని.. ఇన్ని సూట్లూ, బూట్లూ వేసుకునీ.. ఇంత దర్జాగా బ్రతుకుతూ ఏం లాభం?
ప్రతీ ఒక్కరూ, ప్రతీ చిన్న విషయానికీ, ప్రతీ చిన్న అభిప్రాయా బేధానికీ ఏదో జీవితకాలం శత్రువుల్లా కత్తులు నూరుకునే వాళ్లే! కొందరు ఆ శత్రుత్వాలు బయటకు కక్కేస్తారు.. మరికొందరు మనస్సులో దాపెట్టుకుని కుళ్లబొడుస్తుంటారు… ఒక్కొకరు ఏమైనా వందల ఏళ్లు బ్రతికేయడం కోసం ఇలా కొట్టుకుని "నేనే కరెక్ట్" అనో, "నేనే శాశ్వతం" అనో గొడవపడుతున్నారా అంటే.. నిండా 50 ఏళ్లు కూడా గ్యారెంటీ లేని ఓ నీటి బుడగ లాంటి లైఫ్. ఈ కొద్ది లైఫ్‌లోనే అందరూ శత్రువులే..
నాబోటి వాడు నాలుగు మంచి మాటలు రాస్తే.. "ఇతనేంటి మనకు చెప్పేది" అని ఫస్ట్ ఇంప్రెషన్లోనే శత్రువుని చేసి పారేస్తున్నాం…
ఇంకొందరు నాలుగు తప్పుడు మాటలు మాట్లాడితే.. "తాడో పేడో తేల్చుకుందాం" అని అక్కడా శత్రుత్వమే…
నాన్న చెప్తే తప్పు, అన్న చెప్తే తప్పు, ఫ్రెండ్ చెప్తే తప్పు, లెక్చరరో, ప్రొఫెసరో చెప్తే తప్పు, పక్కింటోడు చెప్తే తప్పు, ఫేస్బుక్లో అనామకులు చెప్తే తప్పు… కాస్త ఆలోచన ఉన్న వాళ్లు మాట్లాడితే తప్పు, CM చెప్తే తప్పు, PM చెప్తే తప్పు… అన్నీ తప్పులే..!! మరి ఏది మనకు acceptable? ఇంత లాక్ చేసుకుని సొసైటీ మొత్తాన్నీ శత్రువుల్లా చూసేస్తే జీవితం మొత్తం ఆ శత్రువులతో ఫైట్ చేయడమే సరిపోతుంది.
మనుషుల్ని టిక్ పెట్టుకుంటూ పోతే, accept చేసుకుంటూ పోతే మనస్సు తేలికపడుతుంది.. గొడవలుండవు, కొట్టాటలుండవు, యుద్ధాలుండవు..ప్రశాంతంగా ఉంటుంది.
అందుకే మనందరం హాపీగా బ్రతకాలంటే పెద్ద పెద్ద చదువులు చదువుకున్న మూర్ఖులు కాదు కావలసింది.. కొద్దిగా సర్ధుకుపోయే ఆలోచన ఉన్న నిరక్ష్యరాస్యులైనా ఫర్లేదు.. చాలా సంతోషంగా బ్రతికేయగలం.
చూసుకుందామా అంటే చూసేసుకునేసరికి కన్నూ, కాలూ, చెయ్యీ, గుండె ఉండకపోవచ్చు కూడా! మాట్లాడుకుని సంతోషంగా ఉండే మనుషులతోనే సమాజం ఆరోగ్యకరంగా ఉంటుంది.
గమనిక: ఇది ఎవరికైనా పనికొస్తుంది అన్పిస్తే ఇతరులకూ షేర్ చెయ్యగలరు.
ధన్యవాదాలు
– నల్లమోతు శ్రీధర్
ఎడిటర్
కంప్యూటర్ ఎరా తెలుగు మేగజైన్
http://computerera.co.in
http://youtube.com/nallamothu
http://nallamothusridhar.com
Hello Sir, I am following your blog for the past 6 months. It was really superb. Really i appreciate your efforts in creating this kind of stuff.
I would like to ask a small suggestion.
My family (Elder Brother & Dad) is not satisfy with my salary. They are expecting much more than my current package. But myself and my wife are happy with the money which i am earning now, Nearly i am saving half of my salary for the future use.
My dad is feeling sad by comparing my salary with that of my cousins.
What should i do Sir ?? Do we need lot of money to be happy in our life ?
For me Health and Happiness are most important factors to be consider.
What should i do sir ? I am really enjoying the work in current position…
Waiting for you reply
వంశీ గారు..
మన వ్యక్తిగత సంతృప్తికి మించిన కొలమానం జీవితంలో మరొకటి లేదు. మీ జీవితాన్ని మీ దృష్టితో చూడడమే మేలు.. ఇతరుల దృష్టితో ఎప్పుడూ చూడకండి, విపరీతమైన డబ్బు సంపాదిస్తేనే సంతోషంగా ఉండగలుగుతాం అన్నది ఒట్టి భ్రమ… అది మాత్రం ఖచ్చితంగా చెప్పగలను.
Thank you sir…