. (full stop) పెట్టేయడానికి వంద కారణాలు కనిపిస్తాయి..
అవును.. చాలా పనుల విషయంలో మన గిల్ట్ ఫీల్‌ని కప్పిపుచ్చుకోవడానికీ, అడిగిన వాళ్లకి చెప్పడానికీ నిజంగానే వంద కారణాల్ని సృష్టించొచ్చు.
మనకు కష్టంగా చేసే పనులు నచ్చవు.. ఏ పనైనా సరదాగా సాగిపోతే బాగుణ్ణు అన్పిస్తుంది. ఖర్మ కొద్దీ మనం చేసే పనేమో అలా సరదాగా ఉండదు. అలాగని సరదాని పనిలో వెదుక్కోవడం అస్సలు తెలీనే తెలీదు. సో ఎలాగోలా పని ఎగ్గొట్టేసేయాలి.. అనుకోవడం ఆలస్యం సాకులు చాలా బాగా దొరుకుతాయి.
"నేనీ క్షణం నుండి ఈ పని చెయ్యను" అని మొండిగా మనస్సులో అనేసుకుంటే చాలు.. ఆటోమేటిక్ లాక్లా బ్రెయిన్‌కి తాళాలు పడిపోతాయి.
"నేను చాలా టిపికల్.. నాకు నచ్చని పని అస్సలు చెయ్యను.. నన్ను అర్థం చేసుకోవడం చాలా కష్టం" అని కొంతమంది భలే తమాషాగా చెప్తుంటారు 🙂
దీనిలో టిపికల్ ఏమీ లేదు.. అందరూ అంతే నచ్చని పని అస్సలు చెయ్యరు..
"అర్థం చేసుకోవడం చాలా కష్టం" అని చెప్పేసుకుని ఓ ప్రత్యేకతని మనకి మనం ఆపాదించుకుని మన పని గురించి ఎవరూ ప్రశ్నించకుండా దాన్ని ఓ అడ్డుగోడలా వాడుకునే ఓ చిన్న టెక్నిక్ అంతే.. ఈ టిపికల్ నేచర్!!
వంద అడ్డంకులొచ్చినా పనిచేయాలన్న పట్టుదల కావాలి గానీ పని మానేయడానికి వంద కారణాలు వెదుక్కునే చౌకబారుతనానికి దిగజారుతామా…?
చేయడానికి పనిలేక పస్తులు పడుంటున్న మనుషుల్ని చూస్తే పని విలువ తెలిసొస్తుంది…
మనం ఎన్ని కబుర్లయినా చెప్పుకోవచ్చు… కబుర్లతో నింగీ నేలనూ ఏకం చేసేయనూవచ్చు.. కానీ కష్టపడి చేసే చిన్న పని విలువ కూడా ఆ కబుర్లు చెయ్యవు.
పని అన్నాక సవాలక్ష అడ్డంకులు వస్తాయి.. work నేచరే అంత! వాటిని సాల్వ్ చేసుకుని పని పూర్తి చేయాలి గానీ.. టైమ్ బాలేదని తిట్టేసుకుని పని ఆపేస్తే ఏం మిగులుతుంది… బూడిద తప్ప?
పని దైవంతో సమానం.. పనిని ప్రేమిస్తే అస్సలు కష్టమే అన్పించదు. ఇప్పుడే అనుకున్నట్లు కొన్ని hard times వస్తాయి… అలాంటప్పుడు ఓన్లీ సింపుల్ రూల్.. అన్ని ఆలోచనలూ, డిజప్పాయింట్మెంట్లూ, చిరాకులూ మానేసి తలొంచుకుని ఓపిగ్గా పనిచేసుకుంటూ పోవడమే. ఆ ఓపిక పట్టగలిగితే అడ్డంకులు వాటంతట అవే తొలగిపోతాయి.
చేసే పనిలో గొప్పదనం కన్పించాలి తప్ప కన్పించే ఆకారంలో గొప్పదనం ఎవరికి కావాలి… పనిని నమ్ముకుందాం, పనిచేద్దాం.. అదే మనల్ని శిల్పంగా మలుస్తుంది.
ధన్యవాదాలు
గమనిక: ఇది ఎవరికైనా పనికొస్తుంది అన్పిస్తే ఇతరులకూ షేర్ చెయ్యగలరు.
– నల్లమోతు శ్రీధర్
ఎడిటర్
కంప్యూటర్ ఎరా తెలుగు మేగజైన్
http://computerera.co.in
http://youtube.com/nallamothu
http://nallamothusridhar.com
too good…