నేను డాక్టర్ని కాదు.. కానీ యోగా వల్లా, అవగాహనతో కూడిన ఓ లైఫ్ స్టయిల్ వల్లా ఇది రాయగలుగుతున్నాను. ముఖ్యంగా పనుల వత్తిడితో ఆరోగ్యం పాడు చేసుకునే వారికి ఖచ్చితంగా ఇది ఉపకరిస్తుంది.
వారి వారి ఆఫీసు సమయాల్లో ఆన్లైన్లో ఉండే చాలామంది "కంప్యూటర్ ఎరా" పాఠకులకు తెలిసే ఉంటుంది.. నేను మార్నింగ్ 9 నుండి రాత్రి రాత్రి 1-2 వరకూ ఏదో రూపంలో టచ్‌లో ఉంటానని!
నిజంగా చెప్పాలంటే డైనమిక్‌గా మారే టెక్నాలజీని అప్డేట్ చేసుకుంటూ "మనకు వ్యక్తిగతంగా అవసరమా… కాదా" వంటి ఫిల్టరింగ్లు లేకుండా ప్రతీదీ కొత్త విషయంపై R&D చేసి మేగజైన్లో రాయడం కత్తి మీద సాము లాంటిది. ఎంత ఇబ్బందికరమైన పరిస్థితి అంటే కంటినిండా నిద్రపోయి నాకు ఇప్పటికి ఆరు నెలలు దాటి ఉంటుంది. సేమ్ ఇలాగే పనిచేస్తే ఖచ్చితంగా మనలో చాలామంది బ్రేక్ డౌన్ అవుతారు. ఇక్కడ ఇది నా గొప్ప అని చెప్పడానికి ఇలా రాయట్లేదు. జస్ట్ ఓ moderate లైఫ్ స్టైయిల్ పరిచయం చేద్దామని ప్రస్తావిస్తున్నాను.
మీరు ఎంత స్ట్రెయిన్ అయినా దాని ప్రభావం మీ ఆరోగ్యంపై, చివరకు మొహంలోని ఫ్రెష్నెస్పై పడకుండా ఉండాలంటే ఇవి ఫాలో కావచ్చు.
1. అన్నింటికన్నా ముఖ్యం ఎలాంటి మానసిక వత్తిడినీ మనస్సులోకి తీసుకోవద్దు. లైఫ్ చాలా చాలా సింపుల్. ఒకటికి పది ఆలోచనలతో మనం దాన్ని మరింత కాంప్లికేట్ చేసుకుంటున్నాం. ఎవరి పట్లా ద్వేషం పెంచుకోవద్దు మనం, మనస్సుకి బాధ కలిగించే అంశాలు వస్తుంటాయి.. వాటిని ఓ పావుగంటకు మించి మనస్సులో అట్టిపెట్టుకుంటే ఎంత మంచి ఫుడ్ తీసుకున్నా, ఎంత నిద్రపోతున్నా ఆ మానసిక వ్యాకులత మనల్ని కుంగదీస్తుంది. శ్రమ అని భావించకుండా కష్టపడడం, బాధ పడకుండా, కంప్లయింట్లు లేకుండా, ద్వేషాలు లేకుండా ఆలోచనలు సాగించడం.
2. వీలైతే రోజూ ఓ ఏపిల్, ఓ ఆరటికాయ, ఓ జామకాయ.. ఈ మూడు ఖచ్చితంగా తీసుకుని చూడండి.. ఓ నెలరోజుల్లో మీరే తేడా గమనిస్తారు.
3. రోజు మొత్తంలో ఒక్క పావు గంట కళ్లు మూసుకుని ప్రశాంతంగా మెడిటేషన్ చేస్తే నాలుగైదు గంటల నిద్రతో సమానం. ఇది నేను ఐదారేళ్లుగా ఫాలో అవుతున్న టెక్నిక్. కావాలంటే మీరే ప్రయత్నించి చూడండి. మెడిటేషన్ చేసేటప్పుడు ఏ ఆలోచనలూ తిరస్కరించకండి.. ఆలోచనలు వస్తుంటాయి… రానీయండి… అలాగే వచ్చిన ఏ ఆలోచననూ ఎక్కువ సేపు మనస్సులో ప్రాసెస్ చేయకండి.. ఐ మీన్ పట్టించుకోకండి.. పట్టించుకోపోతే ఏ ఆలోచన అయినా అంతే త్వరగా మాయమవుతుంది.. చివరకు ఓ ప్రశాంతమైన స్థితి ఓ 10 నిముషాల్లో ఖచ్చితంగా వస్తుంది.
4. ఫిజికల్ మూమెంట్స్ చాలా ఇంపార్టెంట్. గంటల తరబడి కంప్యూటర్ ముందు కూర్చుంటున్నాం అందరం… రకరకాల పనుల వల్ల. ప్రతీ అరగంటకూ, గంటకోసారి 2-3 నిముషాల బ్రేక్, వీలైతే నడవడం, లేదా కూర్చున్న చోటే కాళ్లు కదపడం, షోల్డర్స్ మూవ్ చేయడం, కనుగుడ్లని పూర్తి చివర్లకు మూవ్ చేస్తూ కళ్లకు ఎక్సర్ సైజ్ చేయడం.
5. రోజూ ఓ పావు గంట సైకిల్, ఓ గంట సేపు షటిల్ ఆడతాను నేను. ఇవి నా హెల్త్ కి ఎంత హెల్ప్ చేస్తున్నాయంటే అది ప్రాక్టికల్ గా అనుభవించి తీరాల్సిందే.
6. ప్రతీ 4 గంటలకూ ఓసారి 20 నిముషాల పాటు వజ్రాసనంలో కూర్చోవడం నాకు అలవాటు. ఇది చాలా హెల్ప్ చేస్తోంది.. వజ్రాసనం వచ్చిన వారు ఫాలో అవండి.
7. మోనిటర్ బ్రైట్ నెస్ తగ్గించుకుని కాంట్రాస్ట్ పెంచుకోవాలి మనం. కళ్లని గుర్తొచ్చినప్పుడల్లా బ్లింక్ చేయడం.
8. ఫుడ్ విషయంలో టైమింగ్స్ ఫాలో అయితే ప్రతీరోజూ సరిగ్గా అదే సమయానికి డైజేషన్ జ్యూసెస్ రిలీజవుతాయి అబ్డామిన్ లో. సో అంతా సిస్టమాటిక్ గా ఉంటుంది. ఆకలి టైమ్ కి వేస్తుంది.. డైజేషన్ బాగుంటుంది.
9. రోజుకి 4-5 లీటర్ల వాటర్ తాగడం.. ఇది ఎంత హెల్ప్ చేస్తుందో మీరే స్వయంగా అలవాటు చేసుకుని చూడొచ్చు.
10. షోల్డర్, నెక్ మూమెంట్స్ చాలా ఇంపార్టెంట్. బ్రెయిన్ నీ, కళ్లనీ, ఏక్టివ్ గా ఉంచాలన్నా, సరైన బ్లడ్ సర్క్యులేషన్ అందించాలన్నా మనకు మనం స్వయంగా షోల్డర్స్, నెక్ ని మూవ్ చేస్తుండడం చాలా అవసరం.
11. ఫుడ్ విషయంలో నేనైతే ఎలాంటి రిస్ట్రిక్షన్లూ ఫాలో అవను.. బేకరీ ఫుడ్స్, మరీ జంక్ ఫుడ్స్ లాంటివి మాత్రం తీసుకోను. చాలామంది అనుకునేటట్లు ఫుడ్ కాదు మన ఆరోగ్యాన్ని చెడగొట్టేది.. మరీ చెత్త ఫుడ్ కాకుండా ఉంటే చాలు.. మామూలు ఫుడ్ పెద్దగా హాని చేయదు.. కార్బోహైడ్రేట్లు, ప్రొటీన్, ఫైబర్ ఏదీ తగ్గకుండా ఉంటే చాలు. కార్బోహైడ్రేట్లు మానేసి ప్రొటీన్, ఫైబర్ ఒక్కటి తీసుకున్నా ప్రమాదమే. కొంతమంది ప్రొటీన్లు, కార్బొహైడ్రేట్లు మానేసి ఫైబర్ ఒక్కటే తీసుకుంటారు.. అలా చేస్తే మనిషిలో జీవకళ మొత్తం పోతుంది.
సో అదన్నమాట సంగతి…
మనకు టెక్నాలజీ, రాజకీయాలూ, సినిమాలూ, డబ్బు సంపాదన, ప్రపంచ వ్యవహారాలే కాదు.. ఆరోగ్యమూ ముఖ్యమే… ఆరోగ్యాన్ని ప్రత్యేకంగా చూసుకునే పరిస్థితి లేనప్పుడు ఇలాంటి చిన్న చిన్న చిట్కాలు ఫాలో అయితే ఖచ్చితంగా బెటర్ లైఫ్ లీడ్ చేయొచ్చు.
గమనిక: ఇది ఎవరికైనా పనికొస్తుందన్పిస్తే ఇతరులకూ షేర్ చేయండి.
– నల్లమోతు శ్రీధర్
Tips are really very good Sridhar. Atleast i will try to follow some of them.
చాలా మంచి చిట్కాలండీ, వీటికి డాక్టర్ కన్నా అనుభవం కావాలి.
ఈ ఆధునుక యుగంలో చాలా ఈజీగా చెయ్యగలిగేవి ఎంతో ప్రశాంతతనిచ్చేవీ.
చాలా మంచి టిప్ప్. పై చిట్కాలు తప్పకుండా పాటిస్తే మన ఆరోగ్యం మన చేతుల్లోనే ఉంటుంది, థ్యాంక్యూ సార్.